యువీ హ్యాట్రిక్ సిక్సల వీడియో చూస్తే యువీ ఇస్ బ్యాక్ అని అంటారు.. అదరగొట్టిన యువీ..!!

యువరాజ్ సింగ్… ఈ పేరు కె ఒక చరిత్ర ఉంది, క్రికెట్ ఆట లో భారతదేశానికి మూడు వరల్డ్ కప్ లు అందించిన లెజెండరీ ప్లేయర్, గత కొంత కాలం గా సరైన ఫార్మ్ లో లేడు యువరాజ్ సింగ్. ఈ IPL లో అతన్ని ఏ టీం కొనడానికి ముందుకు రాలేదు, చివరిగా ముంబై ఇండియన్స్ అతన్ని దక్కించుకుంది, ముంబై తరపున ఆడిన మొదటి మ్యాచ్ లోనే 50 కి పైగా పరుగులు సాధించి అదరహో అనిపించాడు, నిన్న జరిగిన బెంగుళూరు తో జరిగిన మ్యాచ్ లో చాహల్ బౌలింగ్ లో వరుసగా మూడు సిక్స్ లు బాది ఔరా అనిపించాడు.

బ్రాడ్ గుర్తొచ్చాడు… :

“నిజం చెప్పాలంటే, మొదటి మూడు బాల్స్ లో మూడు సిక్స్ లు కొట్టే సరికి ఇంగ్లాండ్ బౌలర్ బ్రాడ్ లా ఫీల్ అయ్యా, నా బౌలింగ్ లో కూడా 6 బాల్స్ కి 6 సిక్స్ లు కొడతాడని ఫిక్స్ అయ్యా.. కానీ ఫోర్త్ బాల్ కి అవుట్ అవ్వడం తో బ్రతికిపోయా” అని మ్యాచ్ అనంతరం ప్రెస్ మీట్ లో చాహల్ తెలిపాడు.

సంబరాల్లో ఫ్యాన్స్.. :

డీప్‌ స్క్వేర్‌ లెగ్‌ మీదుగా మొదటి బంతిని స్టాండ్స్‌లోకి పంపగా రెండో బంతిని స్ట్రెయిట్ గా ఆడి సిక్సుగా మలిచాడు. మూడో బంతిని లాంగ్‌ ఆన్‌ దిశగా హ్యాట్రిక్‌ సిక్స్‌ బాదాడు. యువీ తిరిగి ఫార్మ్ అందుకోటమే కాకుండా, సిక్సర్ల వీరుడు అనే పదానికి న్యాయం చేస్తుండటం తో ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. నిన్న మూడు బాల్స్ కి మూడు సిక్స్ లు కొట్టాక సోషల్ మీడియా మొత్తం యువీ మేనియా తో నిండిపోయింది. యావత్ దేశం మొత్తం యువీ ఇస్ బ్యాక్ అని సంబరపడిపోయారు, ఈ IPL మొత్తం యువీ ఇలాగె ఆడితే ఖచ్చితంగా వరల్డ్ కప్ కి సెలెక్ట్ అవుతాడని యువీ ఫ్యాన్స్ ఆనంద పడుతున్నారు.

WATCH YUVI HATRICK SIXES VIDEO :

Comments

comments

Share this post

scroll to top