ఆఫీస్ కి వెళ్దామ‌ని లోకల్ ట్రైన్ ఎక్కింది ఆ యువతి…ఓ నీచుడు ఆమె ఎదుట ఏం చేసాడో తెలుసా.? చివరికి ఏమైంది?

నిజంగా ఇలాంటి ఘ‌ట‌నల గురించి చెప్పాలంటేనే… ఇబ్బందిక‌రంగా ఉంటుంది. అయినా త‌ప్ప‌దు క‌దా. రోజు రోజుకీ మృగాళ్లు మ‌హిళ‌ల ప‌ట్ల ఏవిధంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారో తెలియాలంటే… ఈ వార్త‌ల‌ను తెలుసుకోవాల్సిందే. అయితే చిత్ర‌మైన విషయం ఏమిటంటే… ఇలాంటి ఘ‌ట‌న‌లు త‌ర‌చూ జ‌రుగుతూ ఉన్నా పోలీసులు ఏదో నామ మాత్రంగా కేసులు పెట్టి నిందితుల‌ను అరెస్టు చేస్తున్నారు కానీ ఈ ఘ‌ట‌న‌ల్లో వారికి క‌ఠిన శిక్ష‌లు ప‌డిన దాఖ‌లాలు మాత్రం క‌నిపించ‌డం లేదు. సరే… ఈ విష‌యం అటుంచితే.. తాజాగా ముంబైలో మ‌రో నీచ‌మైన ఘ‌ట‌న చోటు చేసుకుంది. అదేమిటంటే…

ముంబైలోని న‌ల‌సొప‌ర అనే ప్రాంతానికి చెందిన ఓ 23 ఏళ్ల యువ‌తి క‌ఫ్ ప‌రేడ్ అనే ప్రాంతంలో ఉన్న త‌న సోద‌రుడి ఇంటి నుంచి ఆఫీసుకు బ‌య‌ల్దేరింది. ఈ క్ర‌మంలోనే ఆమె బెలాపూర్ వ‌ద్ద లోక‌ల్ ఎంఎంటీఎస్ స్టేష‌న్‌లో రైలు ఎక్కింది. అప్పుడు ఉద‌యం 10.10 అవుతోంది. కాగా ఆ యువ‌తి లేడీస్ కంపార్ట్‌మెంట్ లో ప్రయాణం చేస్తోంది. అయితే ఆ కోచ్‌కు ప‌క్క‌నే ఉన్న మ‌రో కోచ్‌లో కృప బోధెబా ప‌టేల్ (30) అనే వ్య‌క్తి ఉన్నాడు. లేడీస్ కంపార్ట్‌మెంట్‌లో ఆమె ఒక్క‌తే ఉంది. దీంతో ఆమెను చూసిన ప‌టేల్ వెంట‌నే ప్యాంట్ జిప్ తీసి హ‌స్త ప్ర‌యోగం చేసుకోవ‌డం మొద‌లు పెట్టాడు.

అయితే ఆ యువ‌తి భ‌య‌ప‌డ‌లేదు. ఆ వ్య‌క్తి చేస్తున్న నీచ‌మైన ప‌నిని ఫోన్‌లో రికార్డు చేసింది. ఆ 7 నిమిషాల వీడియోను వెంట‌నే సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఆ పోస్ట్ కాస్తా వైర‌ల్ అయింది. అయితే వెంట‌నే మ‌రో స్టేష‌న్‌లో దిగిన ఆ యువ‌తి అక్క‌డే ఉన్న రైల్వే పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ఆ వ్య‌క్తి కోసం వేట మొద‌లు పెట్టారు. ఆ వీడియో ద్వారా అత‌ని ఫొటోల‌ను అన్ని స్టేష‌న్ల‌కు పంపిన పోలీసులు మ‌రుస‌టి రోజు ఉద‌యం ఓ రైల్వే స్టేష‌న్‌లో అత‌న్ని గుర్తించి వెంట‌నే అరెస్టు చేశారు. అత‌నిపై పోలీసులు ఐపీఎస్ సెక్ష‌న్లు 354, 509 ల కింద కేసు న‌మోదు చేశారు. అయిన‌ప్ప‌టికీ ఇంకా ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌వ‌ని చెప్ప‌లేం. అవి జ‌ర‌గ‌కుండా మ‌రింత క‌ఠిన‌మైన శిక్ష‌ల‌ను అమ‌లు చేయాల్సిన బాధ్య‌త న్యాయ‌స్థానాల‌పై ఉంది..!

Comments

comments

Share this post

scroll to top