కుక్క కోసం డ్రగ్స్‌ అడిగితే ఆమె కోసం అనుకుని మెడికల్‌ షాపతను ఆమెను ఏమన్నాడో తెలుసా..? చివరికి పోలీసులు కూడా..!

తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగినా అది క‌ల్లు అని అనుకుంటుంది ఈ స‌మాజం. ఎందుకంటే దానికి నిజం తెలియ‌దు క‌దా. క‌నుక అది ఏమైనా చేస్తుంది. నేను క‌ల్లు తాగ‌డం లేదు మ‌హాప్ర‌భో, పాలే తాగుతున్నా, కావాలంటే చూడండి.. అని ఎంత నెత్తి నోరు మొత్తుకున్నా స‌మాజం అస్స‌లు విన‌దు. మొండిగా వాదిస్తుంది. నీది త‌ప్పే అంటుంది. దీంతో చివ‌ర‌కు ఎలాంటి త‌ప్పు చేయకున్నా త‌ప్పు చేశాం అని ఒప్పుకోవాల్సి వ‌స్తుంది. స‌రిగ్గా ఆ యువ‌తికి కూడా ఇలాగే జ‌రిగింది. ఇంత‌కీ అస‌లు ఏమైందంటే…

ఆమె పేరు రుత్ పాల్ చౌద‌రి. కోల్‌క‌తా వాసి. ఈ సంఘ‌ట‌న జ‌రిగింది ఫిబ్ర‌వ‌రి 14వ తేదీన‌. ఆ రోజు ఉద‌యం ఆమె మెడికల్‌ షాపుకు వెళ్లింది. తన కుక్క (బాగా వయస్సు మళ్లింది)కు అనారోగ్యంగా ఉండడంతో దాని కోసం వాలియం 10 అనే మెడిసిన్‌ను కొనేందుకు షాపుకు వచ్చింది. వాలియం 10 మెడిసిన్‌ తనకు 2 ట్యాబ్లెట్లు కావాలని అడిగింది. అందుకు షాపతను నిరాకరించాడు. ఎందుకంటే సదరు మెడిసిన్‌ డ్రగ్స్‌ జాబితా కిందకు వస్తుంది. అందుకనే ప్రిస్క్రిప్షన్‌ లేనిదే తాను ఆ మెడిసిన్‌ను అమ్మనన్నాడు. దీంతో రుత్‌ వెనక్కి తిరిగింది. అయితే ఆ షాపతను ఆమెను అసభ్య పదజాలంతో కామెంట్‌ చేశాడు. డ్రగ్స్‌ కోసం రోడ్డెక్కి తిరుగుతుంది లం.. అంటూ కామెంట్‌ చేశాడు. దీంతో రుత్‌ వెనక్కి తిరిగి వచ్చి మెడికల్‌ షాపతనితో గొడవకు దిగింది.

చివరకు ఆ గొడవ కాస్తా పెద్దది అయింది. రుత్‌ ఆ షాపతని పేరు అడగ్గా అతను చెప్పలేదు. దీంతో షాప్‌లో ఉన్న బిల్‌ బుక్‌లోంచి ఒక పేపర్‌ను చింపి తీసుకుని రుత్‌ బయటకు పరిగెత్తింది. అంతే.. అది చూసి ఆ షాపతను కేకలు వేశాడు. దీంతో రోడ్డుపై ఉన్న అందరూ కలిసి రుత్‌ దొంగతనం చేసిందనుకుని ఆమెను పట్టుకుని హింసించారు. దాడి చేశారు. ఆమె నిజం చెప్పినా ఎవరూ నమ్మలేదు. దీంతో ఆమె తన ఇంటికి వెళ్లి తల్లిని తీసుకువచ్చింది. అయినా ఎవరూ నమ్మలేదు. పైగా తల్లి ముందే రుత్‌ను నానా మాటలు అన్నారు. ఇక లాభం లేదని రుత్‌, ఆమె తల్లి ఇద్దరూ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. అయినా అక్కడా వారికి చేదు అనుభవమే ఎదురైంది.

పోలీస్‌ స్టేషన్‌లో పోలీసులు కూడా రుత్‌దే తప్పన్నారు. దీంతో ఆమె అన్నది.. నేను డ్రగ్స్‌ తీసుకుని ఉంటే నాకు రక్త పరీక్షలు చేయండి, నిజమని తేలితే నేను తప్పు ఒప్పుకుని శిక్ష వేసుకుంటా, కాకపోతే ఏం చేస్తారు.. అని నిలదీసింది. దీంతో పోలీసులు కొంచెం తగ్గారు. అయితే విషయం అక్కడితో ముగిసినా రుత్‌ మాత్రం దాన్ని సీరియస్‌గానే తీసుకుంది. దీనిపై పోలీసు ఉన్నతాధికారులకు చెబుతానని, తనను అన్యాయంగా హింసించి, తనపై దాడి చేశారని, దీన్నంత తేలిగ్గా వదిలిపెట్టనని ఆమె అంటోంది. అవును మరి, ఇంతటి అన్యాయం జరిగితే ఎవరైనా ఎందుకు ఊరుకుంటారు చెప్పండి. కచ్చితంగా న్యాయం కోసం పోరాటం చేయాల్సిందే. అయినా నేటి తరుణంలో సగటు పౌరుడికి న్యాయం జరుగుతుందన్న నమ్మకం కూడా పోయింది. ఏమంటారు, నిజమే కదా..!

Comments

comments

Share this post

scroll to top