ప్లాన్ వేసి..అన్నా చెల్లెల్ని బందించి బట్టలూడదీసి..! నగ్న చిత్రాలను నెట్ లో పెడతామని బెదిరించారు.! చివరికి.?

నేడు మన సమాజం ఎటు వెళ్తుందో నిజంగా ఎవరికీ అర్థం కావడం లేదు. కొందరు మనుషులైతే నిజంగా రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు. ఏది మంచి, ఏది చెడు అనేది వారికి తెలియడం లేదు. సాటి మనిషిపై మానవత్వం ప్రదర్శించాల్సిందిపోయి వారిని క్రూరంగా హింసిస్తున్నారు, చంపుతున్నారు. లేదంటే మహిళలైతే అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఈ క్రమంలో అసలు కొందరు మనుషుల్లో మానవత్వం అన్నదే కరువవుతోంది. ఆ రాష్ట్రంలో కూడా కొందరు మృగాళ్లు సరిగ్గా ఇలాగే ప్రవర్తించారు. ఇద్దరు దళిత యువతి, యువకులను వివస్త్రలుగా చేసి దారుణంగా హింసించడమే కాదు, ఆ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. వారిని వీడియో తీసి ఆ వీడియోను నెట్‌లో పెడతామంటూ బెదిరించారు.

ఈ నెల 6వ తేదీన రాజస్థాన్‌లోని గంగాపూర్‌ సిటీలో ఉంటున్న ఓ దళిత యువకుని వద్దకు అతని సోదరి వచ్చింది. మరో సోదరుని వద్ద ఉన్న కొన్ని పత్రాలను తీసుకునేందుకు ఇద్దరూ కలిసి ఆ సోదరుని ఇంటికి వెళ్లారు. అక్కడే కాపు కాసి ఉన్న ఇద్దరు యువకులు వారిని బలవంతంగా లాక్కెళ్లి అక్కడే ఉన్న ఓ రూమ్‌లో పడేశారు. ఆ ఇద్దరు యువకులు మరో ముగ్గురికి కాల్‌ చేసి చెప్పగా వారు కూడా వచ్చారు. అనంతరం ఆ ఐదుగురు కలిసి ఆ యువకుడు, అతని సోదరిని దారుణంగా హింసించారు. వారి దుస్తులను బలవంతంగా తీయించి వివస్త్రులను చేశారు. చాలా పైశాచికంగా ప్రవర్తించారు.

అలా ఆ 5 మంది సదరు యువకుడు, అతని సోదరిని హింసించారు. ఓ దశలో వివస్త్రులుగా ఉన్న ఇద్దరినీ ఆ 5 మంది తమ ఫోన్లలో రికార్డు చేసి వీడియో తీశారు. అనంతరం రూ.2 లక్షలు ఇవ్వాలని లేదంటే ఆ వీడియోను నెట్‌లో పెడతామని భయపెట్టారు, బెదిరించారు. ఈ క్రమంలో బయటకు వచ్చిన ఆ యువకుడు, అతని సోదరి ఇద్దరూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ఈ ఘటనకు పాల్పడిన ఆ 5 మందిని అరెస్ట్‌ చేశారు. అనంతరం సదరు యువకుడు, అతని సోదరిని మెడికల్‌ ఎగ్జామినేషన్‌కు పంపారు. కాగా పోలీసులు నిందితులపై ఐపీసీ సెక్షన్లు 147, 342, 354, 384, 376-6, 67 IT Act, ST / SC act ల ప్రకారం కేసులు పెట్టారు. ఏది ఏమైనా ఇలాంటి నీచులను అస్సలు వదలకూడదు.

Comments

comments

Share this post

scroll to top