ఫేస్బుక్ లో పరిచయమైన వ్యక్తితో సినిమాకెళ్లింది ఆ 19 ఏళ్ల యువతి..ఆ 23 ఏళ్ల నీచుడు ఆమె జననావయవాలను!

నేటి తరుణంలో మహిళల సేఫ్టీ అనేది ఎంత ప్రశ్నార్థకంగా మారిందో అందరికీ తెలిసిందే. దేశంలో ఎక్కడో ఒక చోట నిత్యం ఏదో ఒక సమయంలో మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ వారి భద్రతను పట్టించుకునే వారు కరువయ్యారు. ఇదిలా ఉంటే కొంత మంది మాత్రం మృగాళ్ల మోసపూరిత మాటలను నమ్మి వారి వెంట వెళ్లి అత్యాచారానికి గురవుతున్నారు. హైదరాబాద్‌ నగరంలో సరిగ్గా ఇలాంటి ఘటనే ఒకటి తాజాగా చోటు చేసుకుంది. ఓ యువతితో సినిమా థియేటర్‌కు వెళ్లిన యువకుడు ఆమెపై లైంగిక దాడి చేశాడు. ఈ క్రమంలో అతని బారి నుంచి తప్పించుకున్న ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఆ యువకున్ని అరెస్టు చేశారు.

ఆమె వయస్సు 19 సంవత్సరాలు. అతని పేరు కందకట్ల భిక్షపతి. అతని వయస్సు 23 సంవత్సరాలు. అతను జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి, ఆ యువతికి గత రెండు నెలల కిందట ఫేస్‌బుక్‌లో పరిచయం అయింది. క్రమంగా వారిద్దరి మధ్య మాటలు పెరిగాయి. వారిద్దరూ అలా కొంతకాలం మాటుల కొనసాగించారు. ఈ క్రమంలోనే గత నెల 29వ తేదీన వారిద్దరూ కలసి సికింద్రాబాద్‌లో ఉన్న ప్రశాంత్‌ థియేటర్‌లో పద్మావత్‌ సినిమాను చూసేందుకు వెళ్లారు. అయితే అదనుగా భావించిన భిక్షపతి ఆ యువతిపై లైంగిక దాడి చేయడం మొదలు పెట్టాడు.

థియేటర్‌లో జనాలు తక్కువగానే ఉండడంతో సమయం చూసిన భిక్షపతి ఆ యువతిపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. ఆమెపై దాడి చేయడం మొదలు పెట్టాడు. ఆమె జననావయవాలను గాయ పరిచాడు. అనంతరం ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ క్రమంలో ఆ యువతి ప్రతిఘటించి వెంటనే అక్కన్నుంచి తప్పించుకుని ఇంటికి వెళ్లిపోయింది. అనంతరం తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రెండు రోజులకు భిక్షపతిని అరెస్టు చేసి అతన్ని రిమాండ్‌కు తరలించారు. ఏది ఏమైనా… మహిళలు.. ముఖ్యంగా యువతులు ఇలాంటి ఫేస్‌బుక్‌ స్నేహాలు చేసేటప్పుడు ఒకసారి ఆలోచించడం మంచిది. లేదంటే ఈ యువతికి జరిగినట్టే జరగవచ్చు. కాబట్టి జాగ్రత్త..!

Comments

comments

Share this post

scroll to top