రన్నింగ్ ట్రైన్ లో 19 ఏళ్ల యువతిపై “గ్యాంగ్ రేప్”.! ఎవరికీ చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.! చివరికి.?

ఢిల్లీ.. నిజంగా మ‌న దేశ రాజ‌ధాని కాదు.. రేపిస్టుల‌కు అడ్డా. వారికే రాజ‌ధాని అయింది. అవును, ఆ విష‌యం క‌రెక్టే. నిర్భ‌య ఉదంతం అనంత‌రం కఠినమైన చ‌ట్టాల‌ను తెచ్చిన‌ప్పటికీ ఢిల్లీలో ఆ త‌ర‌హా నేరాలు మాత్రం ఆగ‌డం లేదు. తాజాగా అక్క‌డ జరిగిన ఓ ఘ‌ట‌న మ‌హిళ‌ల‌కు ఉన్న భ‌ద్ర‌త‌ను మ‌రోసారి ప్ర‌శ్నార్థ‌కం చేసింది. ర‌న్నింగ్ ట్రైన్‌లో ఇద్ద‌రు మృగాళ్లు ఓ యువ‌తిపై అత్యాచారం చేశారు. దీంతో ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకోబోగా ఫ్రెండ్స్ కాపాడి హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. అత్యంత హేయ‌మైన ఈ ఘ‌ట‌న జ‌రిగింది ఢిల్లీలోని ఆనంద్ విహార్ ప్రాంతంలో.

పంజాబ్‌లోని ఫాజిల్కా అనే ప్రాంతానికి చెందిన ఓ యువ‌తి (19) గ‌త 4 నెల‌లుగా జార్ఖండ్‌లోని రాంచీలో కుట్టు మిష‌న్ నేర్చుకుంటోంది. దీంతోపాటు స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సుకు కూడా ఆమె వెళ్తోంది. అయితే ఈ మ‌ధ్యే ఆమె పంజాబ్‌లోని త‌న సొంత ఇంటికి వెళ్లింది. అనంత‌రం తిరిగి రాంచీకి ఈ నెల 6వ తేదీన ప్ర‌యాణ‌మైంది. మురి నుంచి రాంచీకి వెళ్తున్న స్వ‌ర్ణ జ‌యంతి ఎక్స్‌ప్రెస్ రైలులో కోచ్ నంబ‌ర్ ఎస్‌-6లో ఆమె ప్ర‌యాణిస్తోంది. ఈ క్ర‌మంలో మార్గ‌మ‌ధ్య‌లో ఢిల్లీ ఆనంద్ విహార్ ప్రాంతం వ‌ద్ద కోచ్‌లో ఎవ‌రూ లేరు. ఆమె ఒక్క‌తే ఉంది. ఆ విష‌యాన్ని గ‌మ‌నించిన ఇద్ద‌రు దుండ‌గులు ఆమెను రేప్ చేశారు.

ఈ ఘ‌ట‌న జ‌రిగిన త‌రువాత ఆమె రాంచీకి చేరుకుంది. కొద్ది రోజుల‌కు ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని అనుకుంది. అయితే అది గ‌మ‌నించిన ఆమె స్నేహితులు ఆత్మ‌హ‌త్య ప్ర‌య‌త్నాన్ని ఆపారు. ఆమెను హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. దీంతో రైల్వే పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఇందుకు గాను ప్ర‌త్యేక సిట్ బృందాన్ని కూడా నియ‌మించారు. కాగా ఈ ఘ‌ట‌న‌పై జార్ఖండ్ సీఎం ర‌ఘుబ‌ర్ దాస్ స్పందించారు. నిందితుల‌ను వెంట‌నే ప‌ట్టుకుని క‌ఠినంగా శిక్షించాల‌ని ఆదేశించారు. అలాగే బాధితురాలికి అన్ని విధాలుగా అండ‌గా ఉంటామ‌ని, ఆమెకు అవ‌స‌రం అయిన స‌హాయం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. అవును మ‌రి, ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రిగాక నాయ‌కులు అలా కాక మ‌రెలా కామెంట్లు చేస్తారు. ఇది వారికి మామూలే క‌దా..! ఏది ఏమైనా ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన ఆ మృగాళ్ల‌ను మాత్రం అస్స‌లు వ‌ద‌ల‌కూడ‌దు. క‌ఠినంగా శిక్షించాల్సిందే.

Comments

comments

Share this post

scroll to top