సార్.. మాకు బిడ్డ పుట్టింది, మీపేరే పెడుతున్నామని ,ఆ ఇంజనీర్ కు మెసేజ్ చేసిన దంపతులు!? మానవత్వం గెలిచింది, నిలిచింది.!

భీకరవర్షంలో మోహన్, చిత్ర అనే దంపతుల తో పాటు మరికొందరు చెట్ల కొమ్మలనే ఆధారంగా చేసుకొని ప్రాణాలు కాపాడుకున్నారు.  చిత్ర 9 నెలల గర్భవతి. ఆ వర్షంలో, ఆ వరదల్లో ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి.. ఎవరైనా వచ్చి సాయం చేస్తారా అని ఎదురుచూపులు.  ఎక్కడి నుండి వచ్చాడో తెలీదు కానీ  ఓ యువకుడు …వచ్చి ఆమెను  బోటులో తీసుకెళ్ళి హాస్పిటల్ లో చేర్పించాడు. కట్ చేస్తే  ‘నమస్తే సార్, నాపేరు మోహన్ నేను ఉరప్పకం నుండి మెసేజ్ చేస్తున్నాను, నా భార్య ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పాపకు మీ పేరే పెట్టుకున్నాము అంటూ ఆ కుర్రాడి ఇన్ బాక్స్ లో ఓ మెసేజ్ మోగింది.  మీరే మాకు మార్గదర్శి, మీరే  మా ప్రభుత్వం, మీరే  మా నాయకుడు అంటూ మరిన్ని మెసేజ్ లు అతని ఇన్ బాక్స్ లోకి వచ్చి చేరాయి.

ఈ సంఘటన తమిళనాడులో ఉరప్పకం ప్రాంతంలో జరిగింది. తీవ్ర వర్షాలకు ఆ గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సోషల్ మీడియాలో , మీడియాలో తెలుసుకున్న  యూనస్ అనే యువ ఇంజనీర్ చలించిపోయాడు, ఎలాగైనా  సహాయం చేయాలని నిశ్చయించుకొని బయలుదేరాడు. చివరకు అనేక కష్టాలకోర్చి సక్సెస్ అయ్యాడు. మోహన్ దంపతులు నుండి ఆ మాట విన్నాక త్వరలోనే ఆ చిన్నారిని చూడటానికి వస్తానని ప్రస్తుతం కడలూర్ లో సహాయక చర్యల్లో ఉన్నట్లు  సంతోషంతో రిప్లే కూడా ఇచ్చాడు యూనస్.
younus
 కులం, మతం ల పొరపొచ్చాలకంటే సహాయం చేసే గుణం కావాలని  చేతల్లో నిరూపించాడు యూనస్. అని తత్వాల కన్నా మానవత్వమే మిన్న అని నిరూపించాడు.   రాజకీయ నాయకులు, అధికారులు చేయలేని పనిని చేసి పదిమందికి ఆదర్శంగా నిలిచాడు. అందుకే ఈ రోజు  రియల్ హీరో గా మీడియాలో, సోషల్ మీడియాలో యూనస్ పేరు మారు మోగుతోంది. ఇది ఒక్కటే కాదు, సహాయక చర్యలు అందక, వరదల్లో ఇబ్బందులు పడుతున్న మరికొందరికి నిత్యావసరాలతో పాటు రెండు ప్లాట్లు వారికోసం కేటాయిస్తున్నట్లు ప్రకటించి, ఎలాంటి సహాయానికైనా నేను ముందుంటానని చాటిచెప్పాడు. హ్యాట్సాఫ్ టు యూనస్.

Comments

comments

Share this post

scroll to top