వై.ఎస్.ఆర్ గారి బయోపిక్ లో విజయమ్మ పాత్ర పోషించింది ఎవరో తెలుసా.?

pandu

వై.ఎస్.ఆర్ గారి బయోపిక్ చిత్రం యాత్ర లో వై.ఎస్.ఆర్ గారి పాత్రలో మలయాళం మెగా స్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు, ఆయన ఇంత వరకు ఎన్నో విలక్షణమైన పాత్రల్లో నటించారు. కేవలం మాస్ కమర్షియల్ మూవీస్ లోనే కాకుండా ముందు నుండి అన్ని తరహా పాత్రల్లో నటిస్తూ వస్తున్నారు. యాత్ర సినిమాను తెలుగు, మలయాళ బాషలలో ఫిబ్రవరి 8 న విడుదల చెయ్యనున్నారు. యాత్ర సినిమా ట్రైలర్ ని యూట్యూబ్ లో విడుదల చేసారు.

అచ్చం విజయమ్మే :

అయితే యాత్ర చిత్ర ట్రైలర్ ని చుసిన ప్రతి ఒక్కరు విజయమ్మ పాత్రలో నటించిన నటి విజయమ్మ లాగానే ఉన్నారని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. విజయమ్మ పాత్రను పోషించిన నటి పేరు అశ్రిత వేముగంటి, యాత్ర సినిమాలో వై.ఎస్.ఆర్ గారి తండ్రి పాత్రలో జగపతి బాబు నటించారు, మమ్ముట్టి గారు వై.ఎస్.ఆర్ లా చాలా చక్కగా చేసారని యాత్ర ట్రైలర్ ని చూస్తేనే తెలిసిపోతుంది.

అశ్రిత వేముగంటి ఎవరంటే … :

అశ్రిత వేముగంటి భరతనాట్యం, కూచిపూడి నాట్యంలో ప్రతిభ సాధించారు. అయితే ఆమెకు సినిమాలో ఛాన్స్ ఎలా వచ్చింది అనుకుంటున్నారా? ఓసారి ఆమె ఓ ప్రదర్శన ఇస్తున్నారు. ఆ ప్రదర్శన వీక్షించే ఆడియన్స్ లో రాజమౌళి కుటుంభం కూడా ఉంది. ఆ పెర్ఫార్మెన్స్ అయిపోయిన నెలకు రాజమౌళి కొడుకు కార్తికేయ నుండి ఫోన్ కాల్ వచ్చింది. మీకు సినిమాలో నటించే ఉద్దేశ్యం ఉందా అని. అలా అడిగితె అవకాశం ఎవరు వదులుకుంటారు చెప్పండి! అందులోను బాహుబలి సినిమా.అందుకే ఆశ్రిత ఓకే చెప్పేసింది.

అశ్రిత వేముగంటి వయసు ఎంతో తెలుసా :

అశ్రిత వేముగంటి బాహుబలి – 2 చిత్రం లో అనుష్క కు వదిన పాత్రలో నటించారు, అశ్రిత వేముగంటి వయసు 27 ఏళ్ళు, ఆమె అనుష్క కంటే చిన్నవారు వయసులో, అశ్రిత వేముగంటి ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీ బిజీ గా ఉన్నారు, యాత్ర చిత్రం తరువాత ఆమె మరింత బిజీ అవుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.

 

Comments

comments