యూట్యూబ్‌ హవా – జనం ఫిదా ..!

కోట్లాది జనం తమను తాము యూట్యూబ్‌ లో చూసుకుంటున్నారు . ఏ ముహూర్తంలో దీనిని క్రియేట్ చేశారో కానీ అప్పటి నుండి నేటి దాకా మిస్సైల్ కంటే వేగంగా తన రికార్డ్ ను తానే అధిగమిస్తోంది. వినోదం ..విజ్ఞానం ..ఆధ్యాత్మికం ..వికాసం ..ఆటలు ..ప్రకృతి ..ప్రపంచం ..అడవులు ..జంతువుల విన్యాసాలు ..ఇలా ప్రతిదీ ఇందులోకి చేరిపోతోంది . అవసరమైనప్పుడు తీసుకోవచ్చు .వద్దనుకుంటే అలాగే తమ పేరుతో ఉంచేసుకోవచ్చు . ఇలాంటి సౌలభ్యం ఇందులో ఉండడంతో కోట్లాది జనం దీనికి ఫిదా అవుతున్నారు . ఇంటర్నెట్ అనుసంధానం కావడంతో దీని వినియోగం పదింతలు పెరిగింది . పిల్లలు ..మహిళలు ..పెద్దలు ..ఇలా ప్రతి ఒక్కరు యూట్యూబ్‌ కు అడిక్ట్ అవుతున్నారు . గేమ్స్ వీడియోలకు విపరీతమైన క్రేజ్ ఉంటోంది .

దేశీయంగా మొబైల్‌ ఫోన్లలో యూట్యూబ్‌ను వీక్షిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరిగిపోతోంది. గత ఏడాది మొబైల్‌ ఫోన్లలో యూట్యూబ్‌ను యాక్సెస్‌ చేస్తున్న యూజర్లు 73 శాతంగా ఉండగా ఈ ఏడాది అది ఏకంగా 85 శాతానికి పెరిగింది. ఈ ఏడాది జనవరి నాటికి భారత్‌లో యూట్యూబ్‌ నెలవారీ యాక్టివ్‌ యూజర్‌ బేస్‌ 26.5 కోట్లుగా ఉంది. గత ఏడాది ఈ సంఖ్య 22.5 కోట్లుగా ఉంది. పదకొండేళ్ల క్రితం యూట్యూబ్‌ వీడియో ప్లాట్‌ఫామ్‌ భారత్‌లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం భారత్‌ వీక్షకులపరంగా అతిపెద్ద మార్కెట్‌గా రికార్డ్ నెలకొల్పింది .

తాము సరదాకు తీసిన వీడియోలను షేరింగ్ చేశారు పే పల్ ఉద్యోగులు . అది కాస్తా యూట్యూబ్ గా మారింది . 2005 ఫిబ్రవరి 14 న అధికారికంగా లాంచ్ అయ్యింది . దీనిని చాద్ హార్లే , స్టీవ్ చెన్, జావేద్ క్రీం కలిసి యూట్యూబ్ ను క్రియేట్ చేశారు . మీ ఎట్ ద జూ పేరుతో మొదటి వీడియోను అప్లోడ్ చేశారు . ఇక అప్పటి నుండి నేటి దాకా కోట్లాది వీడియోలు చేరఁసుతూనే ఉన్నారు . వేలాది మంది దీని ద్వారా లెక్కకు మించి సంపాదిస్తున్నారు . 3 .5 మిలియన్ డబ్బుల్ని పే పల్ సీయివో పెట్టుబడి పెట్టారు . యూట్యూబ్ డైరెక్టర్ గా చేరారు . ఆర్టిస్ కాపిటల్ మేనేజ్ మెంట్ మరో 8 మిలియన్ల డబ్బులు పెట్టుబడిగా పెట్టింది . వీరిద్దరూ పెట్టిన పెట్టుబడి తో యూట్యూబ్ అనతి కాలంలోనే ప్రపంచం లోనే టాప్ వన్ రేస్ లో నిలిచింది .

2006 ఏడాదిలో 65 వేల వీడియోలు అప్ లోడ్ చేశారు నీటిజెన్స్ . ఈ యూట్యూబ్ వెబ్ సైట్ లో నుండి 100 మిలియన్ ప్రజలు వీడియోలను చూశారు . అలెక్సా ర్యాంకింగ్స్ లో ఐదో స్థానంలో నిలిచింది ఈ సైట్ . సగటున 20 మిలియన్ల మంది దీనిలోని వీడియోలను చూశారు . దీంతో నెట్ లో రేటింగ్ అమాంతం పెరిగింది . ఇందులో 44 శాతం మంది మహిళలు వుంటే.. 56 శాతం పురుషులు ఉన్నారు . 12 నుండి 17 లోపు వయసు కలిగిన బాల బాలికలు ఈ సైట్ ను సందర్శిస్తున్నారు . ఒక్క యుకె లో 64 శాతం వాటాను యూట్యూబ్ చేజిక్కించుకుంది .

దీంతో యూట్యూబ్ యాజమాన్యం యెన్ బి సీతో ప్రకటనల కోసం జత కట్టింది . 6 అక్టోబర్ 2006 లో యూట్యూబ్ ను గూగుల్ 1 .65 బిలియన్ డాలర్స్ కు కొనుగోలు చేసింది . దీంతో యూట్యూబ్ రూపు రేఖలు ఒక్కసారిగా మారి పోయాయి. కోట్లాది రూపాయల ఆదాయం సమకూరుతోంది .ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి . యూట్యూబ్ లో లైవ్ వచ్చేలా చేశారు . మొత్తం మీద గూగుల్ పుణ్యమా అంటూ లోకం యూట్యూబ్ లో ప్రత్యక్షమవుతోంది . ఇండియా వరకు వస్తే కోట్లాది ప్రజలే కాదు యూత్ దీని పట్ల ఫిదా అయిపోయారు .

Comments

comments

Share this post

scroll to top