యూ ట్యూబ్ లో చూసి డెలివరీ చేసుకుంది. చివరకు ఏమైందో చుస్తే షాక్ అవుతారు??

ఏదైనా కూర చెయ్యాలనుకున్నప్పుడు మనకి రాకపోతే యూట్యూబ్ లో చూసి చేసుకుంటాం. ఇలా ప్రతి అవసరానికి యూ ట్యాబ్ లోనే చూస్తున్నాం. కానీ అన్ని విషయాలకు అలా కుదరదు, కొన్ని బెడిసి కొడతాయి కూడా. ఇప్పుడు మేం చెప్పబోయేది అలాంటి సంఘటన గురించే…


ఇంట్లోనే ప్రసవం ఎలా చేసుకోవాలి అనే విషయాన్ని ఓ అమ్మాయి పదే పదే చూసింది. పెళ్లి కాకముందే గర్భవతి అయిన ఆమెని సమాజం నిందిస్తుందని సెల్ఫ్ డెలివరీ చేసుకోవాలని ప్రయత్నించింది. ఆ ప్రయోగం బెడిసికొట్టడంతో బిడ్డతో పాటు ఆమె కూడా ప్రాణాలు కోల్పొయింది. ఈ ఘటన గోరఖ్ పూర్ లో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే….

గోరఖ్ పూర్ లోని బిలండ్పూర్ ప్రాంతంలో, కంటోన్మెంట్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. నాలుగు రోజులు క్రితం ఆ అమ్మాయి రవి ఉపాధ్యాయ అనే అతని ఇంటిని అద్దెకు తీసుకుంది. తన అమ్మ రెండు రోజుల్లో ఇక్కడికి వస్తుందని తన డెలివరీ కు తన అమ్మ సహాయంగా ఉంటుందని అతనికి తెలిపింది. ఆధార్ డిటైల్స్ అన్ని వెరిఫై చేసుకున్న అనంతరం రవి ఆమెకు ఇంటిని అద్దెకు ఇచ్చాడు.
అయితే సోమవారం ఉదయం ఆమె గది నుంచి రక్తం రావడం గమనించిన రవి తలుపు పగలకొట్టి లోపలికి చూసి షాక్ అయ్యాడు. అయితే అక్కడ తల్లి బిడ్డ శవాలుగా ఉండడం చూసి పోలీసులకి సమాచారం అందించాడు.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు ఆమె సెల్ ఫోన్ దొరికింది. ఈ ఫోన్ లో ఆమె యూ ట్యూబ్ లో ఎలా డెలివరీ చేసుకోవాలి అనే వీడియోలు చూసినట్టు గుర్తించారు. ఆమె బాడీ వద్ద కత్తెర, బ్లేడ్, దారం ఉండడం గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం కి తరలించారు.

Comments

comments

Share this post

scroll to top