మోడీ పేరిట బెంగుళూరులో ప‌కోడీలు అమ్మిన యువ‌త‌. ఎందుకో తెలుసా..?

రాజ‌కీయ నాయ‌కులు అన్నాక అప్పుడ‌ప్పుడు నోరు జారి ఏవో వ్యాఖ్య‌లు చేస్తూనే ఉంటారు. త‌రువాత త‌ప్పుగా అన్నామ‌ని నాలిక్క‌రుచుకుంటారు. అబ్బే.. మేమ‌న‌లా అన‌లేదు, కేవ‌లం మీడియా మాత్ర‌మే మా వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుగా అర్థం చేసుకున్నాయ‌ని చెబుతారు. అయితే ఈ విష‌యంలో ఎంత నిజం ఉంటుందో ఎంత అబ‌ద్దం ఉంటుందో తెలియ‌దు కానీ.. తాజాగా ఇదే త‌ర‌హాలో మ‌న ప్ర‌ధాని మోడీ చేసిన వ్యాఖ్య‌లు మాత్రం బెంగుళూరు యువ‌త‌కు కోపాన్ని తెప్పించాయి. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే…

ఇటీవ‌లే ప్ర‌ధాని మోడీ ఓ మీడియా చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో నిరుద్యోగం, ఉద్యోగాలు అనే విష‌యంపై స్పందించారు. దీనిపై మోదీ ఏమ‌న్నారంటే.. బ‌య‌ట రోడ్ల‌పై ప‌కోడీలు అమ్ముతూ రోజుకు రూ.200 సంపాదించే వ్య‌క్తి కూడా ఉద్యోగం చేస్తున్న‌ట్టే లెక్క అని అన్నారు. అయితే ఇవే వ్యాఖ్య‌లు బెంగుళూరులో కొంద‌రు యువ‌త‌ల‌కు కోపం తెప్పించాయి. దీంతో తాజాగా ఆ న‌గ‌రంలో జ‌రిగిన మోడీ ర్యాలీకి కొన్ని గంట‌ల ముందు వారు నిర‌స‌న చేప‌ట్టారు. అది కూడా ప‌కోడీలు అమ్ముతూ.

బెంగుళూరు న‌గ‌రంలో ఉన్న మేక్రీ స‌ర్కిల్‌లో కొంద‌రు యువ‌త న‌ల్ల‌ని దుస్తులు ధ‌రించి చేతిలో పకోడీలు ప‌ట్టుకుని అమ్ముతూ త‌మ నిర‌స‌న తెలిపారు. అక్క‌డికి కొంత స‌మీపంలో ఉన్న ప్యాలెస్‌గ్రౌండ్‌లో మ‌రికొన్ని గంట‌ల్లో మోడీ ర్యాలీ జ‌రుగుతుంద‌న‌గా కొంద‌రు యువ‌త ఇలా ఆ స‌ర్కిల్‌లో ప‌కోడీలు అమ్ముతూ నిర‌స‌న తెలిపారు. వారు ప‌కోడీలు అమ్మే స‌మ‌యంలో.. మోడీ ప‌కోడీలు, అమిత్ షా ప‌కోడీలు, డాక్ట‌ర్ ఎడ్డీ (య‌డ్యూర‌ప్ప‌) పకోడీలు అని అరుస్తూ వాటిని అమ్మ‌డం మొద‌లు పెట్టారు. దీంతో పోలీసులు వెంట‌నే అక్క‌డికి చేరుకుని స‌ద‌రు యువ‌త‌ను చెద‌ర‌గొట్టి పంపించేశారు. అయినా.. ప‌కోడీలు అమ్మ‌డం కూడా ఉద్యోగం కింద‌కే వ‌స్తుందంటారా ? అది స్వ‌యం ఉపాధి క‌దా..!

https://www.outlookindia.com/website/story/students-donning-degree-robes-sell-pakodas-near-pm-modis-bengaluru-rally-venue/307822

Comments

comments

Share this post

scroll to top