గూగుల్‌ను మెప్పించిన బీటెక్‌ విద్యార్థి…రూ.8.70 లక్షలు పారితోషికం..! ఏం చేసాడో తెలుసా.?

అవును నిజ‌మే మ‌రి. తెలివి ఎవ‌రి సొత్తూ కాదు. రిక్షా కార్మికుడి కొడుకు కూడా ఐఏఎస్ కావ‌చ్చు. కృషి, ప‌ట్టుద‌ల ఉండాలే గానీ ఉన్న‌త స్థానాల‌కు ఎద‌గ‌వ‌చ్చు. ల‌క్ష్యాల‌ను సాధించ‌వ‌చ్చు. విజ‌య‌వాడ‌కు చెందిన సాయికుమార్ రెడ్డి అనే విద్యార్థి కూడా స‌రిగ్గా ఇదే నిరూపిస్తున్నాడు. ప‌లు ఐటీ కంపెనీల‌కు చెందిన సాఫ్ట్‌వేర్ల‌లో బ‌గ్స్ (లోపాలు) గుర్తించి ల‌క్ష‌ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. ఏకంగా సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జ సంస్థ గూగుల్‌కు చెందిన యూట్యూబ్‌లోనే ఓ లోపం ఉంద‌ని చెప్పి ఆ సంస్థ నుంచి కొన్ని ల‌క్ష‌ల న‌గ‌దు రివార్డు పొందాడు.

విజ‌య‌వాడ‌లో ఉండే సాయికుమార్ రెడ్డి నగ‌రంలోని పొట్టి శ్రీ‌రాములు ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ కంప్యూట‌ర్ సైన్స్ చ‌దువుతున్నాడు. ఇత‌ని తండ్రి లారీ డ్రైవ‌ర్. అయితే త‌న తండ్రి ప‌డే క‌ష్టాన్ని సాయికుమార్ ఎన్న‌డూ వృథా కానివ్వ‌లేదు. అర‌కొర వేత‌నం సంపాదించినా తండ్రి మాత్రం ఇత‌న్ని బాగానే చ‌దివించేవాడు. దీంతో సాయికుమార్ ఎప్పుడూ విద్య‌ను అభ్య‌సించ‌డంలో ముందుండేవాడు. అయితే ఇతనికి ఇంట‌ర్‌మీడియ‌ట్ నుంచి సాఫ్ట్‌వేర్ బ‌గ్స్‌ను వెద‌క‌డం, సైబ‌ర్ నేరాల‌ను అరిక‌ట్ట‌డం అనే అంశాల‌పై మ‌క్కువ ఉండేది. ఈ క్ర‌మంలోనే అత‌ను కంప్యూట‌ర్‌పై గంట‌ల త‌ర‌బ‌డి ప‌నిచేసేవాడు. బ‌గ్స్ క‌నిపెట్ట‌డం నేర్చుకున్నాడు.

అలా సాయికుమార్ బ‌గ్స్ క‌నిపెట్ట‌డంలో నిష్ణాతుడు అయ్యాడు. అందులో భాగంగానే ఓ సారి యూట్యూబ్ వెబ్‌సైట్ సాఫ్ట్‌వేర్‌లో ఉన్న బ‌గ్‌ను గుర్తించాడు. ప‌లు ప్రత్యేక ప‌రిక‌రాల ద్వారా యూట్యూబ్ అడ్మిన్ ప్యానెల్‌ను ఎలా యాక్సెస్ చేయ‌వ‌చ్చో చూపించాడు. ఈ క్ర‌మంలో తాను అలా చేసిన ప‌నిని రికార్డు చేసి గూగుల్‌కు పంప‌గా, కొన్ని నెల‌ల త‌రువాత గూగుల్ అందుకు రిప్లై ఇచ్చింది. అంతేకాదు, సాయికుమార్ బ్యాంక్ అకౌంట్‌కు గూగుల్ ఏకంగా రూ.8.70 ల‌క్ష‌ల న‌గ‌దును రివార్డుగా పంపింది. అయితే ఇదే కాకుండా ప‌లు ఇత‌ర సంస్థ‌ల‌కు చెందిన సాఫ్ట్‌వేర్ల‌లోనూ సాయికుమార్ బ‌గ్స్‌ను గుర్తించేవాడు. అందుకు తగిన పారితోషికం కూడా సాయికుమార్‌కు వారు ఇచ్చేవారు. దీంతో సాయికుమార్ త‌న‌కు వ‌చ్చే ఆదాయం నుంచి రూ.3.70 ల‌క్ష‌లు తండ్రి చేసిన అప్పును తీర్చేశాడు. కాగా సాయికుమార్ భ‌విష్య‌త్తులో సెక్యూరిటీ అన‌లిస్ట్ అవుదామ‌ని క‌ల‌లు కంటున్నాడు. అత‌ని క‌ల‌లు నిజం కావాల‌ని మ‌న‌మూ ఆశిద్దాం.

Comments

comments

Share this post

scroll to top