నాలుక ఉన్న రంగు, ఆకారాన్ని బట్టి మీరు ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారో ఇట్టే చెప్పవచ్చు… అదెలాగో చూడండి..!

అనారోగ్యంగా ఉందంటే చాలు, సొంత వైద్యం చేసుకోవడమో, వైద్యుని దగ్గరికి పరుగెత్తడమో చేస్తాం. అయితే ఎలాంటి అనారోగ్యం కలిగినా మన శరీరం దానికి సంబంధించిన కొన్ని లక్షణాలను గుర్తించి ముందుగానే మనకు చెబుతుంది. ఈ క్రమంలో ఆయా అవయవాల రూపు రేఖలను బట్టి అనారోగ్య లక్షణాలను తెలుసుకోవచ్చు. అలాంటి అవయవాల్లో నాలుక కూడా ఒకటి. నాలుక ఉన్న రంగు, దాని ఆకారాన్ని బట్టి మనం ఏ అనారోగ్యంతో బాధపడుతున్నామో ఇట్టే తెలుసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

tongue-shapes-colors

1. చిత్రంలో చూపిన విధంగా నాలుక మరీ ఎర్రగా ఉందంటే అప్పుడు మీరు విటమిన్ లోపంతో బాధపడుతున్నారని అర్థం చేసుకోవాలి. వెంటనే విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం ప్రారంభించాలి. దీంతో సమస్య తగ్గిపోతుంది.

2. బొమ్మలో ఇచ్చిన విధంగా నాలుక అదోరకమైన రంగులో ఉంటే అప్పుడు అది మీ బ్రషింగ్‌లో లోపాన్ని సూచిస్తుంది. అంటే మీరు దంతాలు, నోటిని సరిగ్గా శుభ్రం చేసుకోవడం లేదన్నమాట. సరైన టూత్‌పేస్ట్, టూత్‌బ్రష్‌లతో నోటిని శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.

3. నాలుక తెల్లగా ఉంటే మీకు ఈస్ట్ ఇన్‌ఫెక్షన్ వచ్చిందని తెలుసుకోవాలి. అంటే మీ శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేయడం లేదని అర్థం. వెంటనే వైద్యున్ని సంప్రదించి తగు చికిత్స తీసుకోవాలి. యాంటీ బయోటిక్స్ వంటివి వాడడం వల్ల ఫలితం ఉంటుంది.

4. నాలుక బాగా పగిలి ఉంటే నోరు శుభ్రంగా లేదని అర్థం. వయస్సు మీద పడుతున్న వారిలోనూ నాలుక ఇలాగే పగులుతుందట. నోటిని సరిగ్గా శుభ్రం చేసుకుంటే దాదాపుగా ఇలాంటి సమస్య రాదట.

5. నాలుక కొద్దిగా పగిలి మంట పుడుతూ ఉంటే టూత్‌పేస్ట్ మంచిది వాడడం లేదని తెలుసుకోవాలి. వెంటనే టూత్‌పేస్ట్‌ను మార్చాలి. అదేవిధంగా మెనోపాజ్ దశలో ఉన్న మహిళలకు కూడా నాలుక ఇదే విధంగా అవుతుంది.

6. చిత్రంలో చూపిన విధంగా నాలుక కింది భాగంలో తెల్లటి ప్యాచ్‌లు వస్తే భయపడాల్సిన పని లేదు. ఇవి సాధారణంగా కొద్ది రోజుల్లోనే తగ్గిపోతాయి. అయితే తంబాకు తినే వారిలో, పొగ తాగే వారిలో నాలుక ఇలా కనిపిస్తే మాత్రం అనుమానించాల్సిందే. ఎందుకంటే ఇలాంటి నాలుక నోటి క్యాన్సర్ రాకను తెలియజేస్తుంది. కాబట్టి అలాంటి అలవాట్లు మానేస్తే సమస్య నుంచి బయట పడవచ్చు.

7. బొమ్మలో ఉన్న విధంగా నాలుకపై చిన్నపాటి గడ్డలు కనిపిస్తే అవి క్యాన్సర్‌కు దారి తీసే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

8. నాలుకపై చిన్న చిన్న బిందువుల్లా వచ్చి, బుడగల్లా, గాయాల్లా కనిపిస్తే అవి మీ పొట్టలో జీర్ణాశయ సమస్యను సూచిస్తాయి. అంటే ఏదో జీర్ణ సంబంధ అనారోగ్యంతో మీరు బాధపడుతున్నారన్నమాట. చికిత్సను తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.

Comments

comments

Share this post

scroll to top