ఒక్క ఛాన్స్ అంటూ ఇండస్ట్రీ చుట్టూ తిరిగాడు, చివరకు ఊరేసుకొని తనువు చాలించాడు!

ఒక్క  ఛాన్స్ , ఓకే ఒక్క ఛాన్స్ అంటూ ఇప్పటికీ సినీ ఇండస్ట్రీ చుట్టూ  అవకాశం కోసం తిరిగే  వారి సంఖ్యకు లెక్కే లేదు. కానీ అందరికీ అవకాశాలు అంత తొందరగా రావు…. తన టాలెంట్ కు ఖచ్చితంగా అవకాశం  వస్తుంది, అవకాశం రాగానే అదరగొడతాను అని అనుకున్న ఓ కుర్రాడు అంతలోనే  తన గొంతుకు ఉరితాడును బిగించుకొని తనువు చాలించాడు.

పూర్తి వివరాల్లోకి వస్తే…. . రాజానగరం మండలం శ్రీకృష్ణపట్నానికి చెందిన మందారపు వెంకట్రాజు  ఇంటర్మీడియట్ పూర్తిచేశాడు. స్కూల్ నుండి కాలేజ్ వరకు ఎప్పుడు పాటల పోటీ పెట్టిన ఇతనికే ఫస్ట్ ఫ్రైజ్ వచ్చేది. అంతబాగా పాడతాడు పాటలు….అతడి గాత్రం విని నువ్వు సినిమాల్లో ట్రై చెయ్, ఖచ్చితంగా టాప్ సింగర్ అవుతావని ప్రోత్సాహించేవారు. దీన్నే ప్రేరణగా తీసుకున్న రాజు  హైద్రాబాద్, చెన్నై సినీ ఇండస్ట్రీ చుట్టూ ప్రదక్షిణలు చేశారు ఒక్క ఛాన్స్ , ఒకే ఒక్క ఛాన్స్ అంటూ తనకు వీలున్నంత  వరకు ప్రయత్నించాడు.

కానీ అవకాశాలు రాలేదు…. సినిమాల్లో సింగర్ కావాలని కలలు కన్న అతడు.. చదువును కూడా నిర్లక్ష్యం చేసి.. పాటలు పాడే ఛాన్స్ రాకా… ఇంటికి వెళ్ళి తన వాళ్ళకు మెహం చూపించలేక , ఏం చేయాలో అర్థం కాక…..పెద్దాపురంలోని ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నాడు ..రెండు రోజులు తీవ్రం గా ఆలోచించి చివరకు అదే లాడ్జి  రూమ్    లోని ఫ్యాన్ కు  ఉరి వేసుకుని చనిపోయాడు.

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top