అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాది స‌య్య‌ద్ స‌లావుద్దీన్ కొడుకులు ఎక్క‌డ పనిచేస్తున్నారో తెలిస్తే షాక‌వుతారు..!

స‌య్య‌ద్ మ‌హ‌మ్మ‌ద్ యూసుఫ్ షా అలియాస్ స‌య్య‌ద్ స‌లావుద్దీన్‌… ఇత‌ని గురించి చాలా మందికి తెలుసు. హిజ్‌బుల్ ముజాహిదీన్ నాయ‌కుడిత‌ను. కాశ్మీర్‌లో న‌ర‌మేథం సాగించే టెర్ర‌రిస్టు గ్రూపు ఇది. భార‌త్ నుంచి కాశ్మీర్‌కు విముక్తి కావాలంటూ వేలాది మంది యువ‌కుల‌ను ఉగ్ర‌బాట ప‌ట్టించ‌డంలో ఇత‌ను పేరుగాంచాడు. ఈ మ‌ధ్యే అమెరికా ప్ర‌భుత్వం స‌లావుద్దీన్‌ను అంత‌ర్జాతీయ టెర్ర‌రిస్టుగా ప్ర‌క‌టించి మోస్ట్ వాంటెడ్ జాబితాలో టాప్ ప్లేస్ క‌ల్పించింది. అయితే ఇంత‌కీ విష‌యం ఏమిటంటారా..? ఏమీ లేదండీ… ఇత‌నికి ఐదుగురు కొడుకులున్నారు. మ‌రి వారు ఏం చేస్తున్నారో తెలుసా..?

ఆ ఏం చేస్తారు. తండ్రి ఉగ్ర‌వాది కాబ‌ట్టి తండ్రి వార‌స‌త్వాన్ని పుణికిపుచ్చుకుని వారు కూడా ఉగ్ర‌వాదులు అయి ఉంటారు. ఎక్క‌డో ఒక చోట త‌ల‌దాచుకుని తండ్రిలాగే ఉగ్ర‌వాదులను త‌యారు చేస్తూ వారిని న‌డిపిస్తుంటారు… అని అనుకుంటున్నారా..? అయితే మీరు పొర‌పాటు ప‌డిన‌ట్టే. ఎందుకంటే స‌లావుద్దీన్ కొడుకులు ఎవ‌రూ ఉగ్ర‌వాదులు కారు. వారు ఎంచ‌క్కా ప్ర‌భుత్వ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. చ‌దువుకుంటున్నారు. అది కూడా ఎక్క‌డో కాదు, మ‌న దేశంలోనే. అవును, మీరు విన్న‌ది నిజ‌మే.

స‌లావుద్దీన్ మొద‌టి కొడుకు పేరు ష‌కీల్ యూసుఫ్‌. శ్రీ‌న‌గ‌ర్‌లో ఉన్న షేర్-ఇ-క‌శ్మీర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌లో మెడిక‌ల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇక రెండో కొడుకు జావేద్ యూసుఫ్‌. విద్యాశాఖ‌లో కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్‌గా విధులు నిర్వ‌హిస్తున్నాడు. మూడో కొడుకు షాహిద్ యూసుఫ్ షేర్‌-ఇ-క‌శ్మీర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్ సైన్స్ అండ్ టెక్నాల‌జీలో రీసెర్చ్ ఫెలోగా చేస్తున్నాడు. నాలుగ‌వ కుమారుడు వాహిద్ యూసుఫ్ పెద్ద అన్న చేస్తున్న దాంట్లోనే డాక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. ఇక చివ‌రి వాడైన మాజిద్ యూసుఫ్ శ్రీ‌న‌గ‌ర్‌లోని ఎంట‌ర్‌ప్రిన్యూర్స్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇనిస్టిట్యూట్‌లో ప‌నిచేస్తున్నాడు. ఇవీ… వారి గురించిన విష‌యాలు. కానీ తండ్రి స‌లావుద్దీన్ మాత్రం కాశ్మీర్‌ను వేరు ప‌ర‌చాల‌ని చెప్పి పాకిస్థాన్‌తో చేతులు క‌లిపాడు. పాకిస్థాన్ అత‌న్ని త‌న మిత్రునిగా ప్ర‌క‌టించి నాలుక్క‌రుచుకుంది కూడా..! అయితే స‌లావుద్దీన్‌కు ఇద్ద‌రు కూతుళ్లు కూడా ఉన్నారు. వారు ఎవ‌రంటే… మొద‌టి కూతురు న‌సీమా. ఈమె ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో టీచ‌ర్‌గా ప‌నిచేస్తోంది. రెండో కూతురు అక్తారా కూడా ఉపాధ్యాయురాలే..!

Comments

comments

Share this post

scroll to top