ఫేస్బుక్… స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి నోట ఇప్పుడు ఈ మాట వినిపిస్తోంది. సమయం ఏదైనా, సందర్భం ఎలాంటిదైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా ఫొటో లేదా వీడియో తీసుకోవడం, లేదంటే ఏదన్నా సందేశాన్నో, తెలిసిన విషయాన్నో షేర్ చేయడం, లైక్‌లు, కామెంట్లు కొట్టించుకోవడం, నచ్చితే షేర్ చేయడం వంటి తంతు ఇప్పుడు బాగా ఎక్కువైంది. ఇక వ్యాపార సంస్థలైతే ఫేస్బుక్ మాధ్యమం ద్వారానే తమ ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నాయి. అయితే ఎవరు ఫేస్బుక్ వాడినా వారి ఖాతాలో ఎప్పుడూ 3 రకాల నోటిఫికేషన్స్ దర్శనమిస్తుంటాయి. అవే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు, మెసేజ్‌లు, పోస్ట్‌లకు సంబంధించినవి. అయితే ఏ నోటిఫికేషన్ వచ్చినా గ్లోబ్ ఆకారంలో ఉండే చిన్నపాటి షేప్‌పై వాటి సంఖ్య మనకు కనిపిస్తుంది. కానీ అందులో దాగున్న విషయం ఒకటి గమనించారా? లేదా? అయితే అదేమిటో చూడండి..!
సాధారణంగా మనకు ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు, మెసేజ్‌లు, పోస్ట్‌లకు సంబంధించిన నోటిఫికేషన్లు వస్తాయి కదా, అవి గ్లోబ్ లాంటి ఆకారంపై ఏదైనా సంఖ్యతో కనిపిస్తాయి. అయితే ఆ గ్లోబ్‌ను ఒక్కసారి జాగ్రత్తగా చూస్తే అందులో మనకు ఒక విషయం తెలుస్తుంది. అదేమిటంటే మనం ఆసియా ఖండానికి చెందిన వారం కాబట్టి నోటిఫికేషన్ కింద ఉండే గ్లోబ్ ఆసియా ఖండానికి చెందిన దేశాలను సూచిస్తూ మనకు కనబడుతుంది. అదే మనం ఏ అమెరికాలోనో, యూరప్‌లోనో ఉంటే ఆ ఖండాలకు చెందిన దేశాలను చూపిస్తూ గ్లోబ్ తిరుగుతుంది. చూశారా! ఆ… మీకు కనిపించే ఉంటుంది లెండి. ఇన్ని రోజులు చూస్తూనే ఉన్నారు. కానీ దాని గురించి మీకు తెలిసి ఉండదు. ఇంకేం! ఈ విషయం నచ్చితే అందరికీ షేర్ చేయండి మరి!