ఇక‌పై క‌రెంట్ ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వ‌స్తుందో SMSలు పంపుతారు..!

ఎంతో ముఖ్య‌మైన ప‌నిలో ఉంటే క‌రెంట్ పోయింద‌నుకోండి, అప్పుడు మ‌న‌కు ఎంత‌టి విసుగు వ‌స్తుందో అంద‌రికీ తెలిసిందే. ఇక మళ్లీ క‌రెంటు ఎప్పుడు వ‌స్తుందా, అస‌లు వ‌స్తుందా, రాదా అని ఎదురు చూస్తాం. 5-10 నిమిషాల్లో క‌రెంట్ వ‌స్తే ఓకే లేదంటే దాని కోసం ఎదురు చూస్తూ కూర్చోవాల్సి వ‌స్తుంది. ఈ క్ర‌మంలో ఎంతో విలువైన స‌మ‌యం వృథా అవుతుంది. అదే క‌రెంట్ ఎప్పుడు వ‌స్తుందో ముందే తెలిసింద‌నుకోండి, అప్పుడు మ‌నం ఏదో ఒక ప్ర‌త్యామ్నాయ ఏర్పాటు చేసుకుంటాం క‌దా. అప్పుడు మ‌న‌కు టైం క‌ల‌సి వ‌స్తుంది. అయితే మ‌రి, మ‌న ద‌గ్గ‌ర క‌రెంట్ పోతే అస‌లు ఎప్పుడు వ‌స్తుందో తెలుసుకోవ‌డం ఎలా..? క‌రెంట్ ఆఫీస్‌కు ఫోన్ చేస్తే స్పంద‌న ఉండ‌దు. మ‌రి క‌రెంట్ ఎప్పుడు వ‌స్తుందో మ‌న‌కు ఎలా తెలుస్తుంది..? అంటే… అందుకు సీపీడీసీఎల్ ప‌రిష్కారం చూపుతోంది. అదీ ఎస్ఎంఎస్ రూపంలో..! ఇక‌పై విద్యుత్ వినియోగ‌దారులు క‌రెంట్ పోతే ఎప్పుడు వ‌స్తుందా అని ఎదురు చూడాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే సీపీడీసీఎల్ ఆ వివ‌రాల‌ను ఎస్ఎంఎస్ రూపంలో వినియోగ‌దారుల‌కు అందించ‌నుంది.

power-cut

హైద‌రాబాద్‌లోని సీపీడీసీఎల్ నార్త్ స‌ర్కిల్ ప‌రిధిలో ఇప్ప‌టికే ఆ సంస్థ అధికారులు ఓ వినూత్న కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. అదేమిటంటే… ఇక‌పై ఎప్పుడు క‌రెంట్ పోయినా మ‌ళ్లీ ఎప్పుడు వ‌స్తుందో, ఎన్ని గంట‌ల‌కు వ‌స్తుందో క్లియ‌ర్‌గా తెలియ‌జేస్తూ వినియోగ‌దారుల‌కు ఎస్ఎంఎస్ పంప‌నున్నారు. దీంతో వినియోగ‌దారులు ఆ స‌మ‌యం చూసి అవ‌స‌రం అయితే త‌మ ప‌నులు దెబ్బ తిన‌కుండా ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటారు. ఇప్ప‌టికే ఈ విధానం స‌ద‌రు స‌ర్కిల్‌లో అమ‌లులో ఉండ‌గా, త్వ‌ర‌లో అన్ని ప్రాంతాల్లోనూ దీన్ని ప్రవేశ‌పెట్ట‌నున్నారు. ఈ క్ర‌మంలో విద్యుత్ వినియోగ‌దారుల‌కు చెందిన ఫోన్ నంబ‌ర్ల‌ను సేకరించే ప‌నిలో ప‌డింది సీపీడీసీఎల్‌.

అయితే క‌రెంట్ ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వ‌స్తుందో తెలిపే ఎస్ఎంఎస్ అల‌ర్ట్స్ మాత్ర‌మే కాదు, విద్యుత్ వినియోగ‌దారుల‌కు చెందిన మీట‌ర్ రీడింగ్ సేక‌రించ‌గానే ఆ బిల్లు, దాని చివ‌రి తేదీ త‌దిత‌ర అంశాలతోనూ సీపీడీసీఎల్ ఎస్ఎంఎస్‌ల‌ను పంప‌నుంది. ఈ క్ర‌మంలో గ‌డువు తేదీకి 3 రోజుల ముందుగానే ఎస్ఎంఎస్ అందేలా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో వినియోగ‌దారులు బిల్లు చెల్లించ‌డం మ‌రింత సుల‌భం కానుంది. గ‌డువు తేదీ చూసుకుని వారు బిల్లు చెల్లించేందుకు అవ‌కాశం ఉంటుంది. ఈ క్ర‌మంలో బిల్లు చెల్లించాక వ‌చ్చే ఎస్ఎంఎస్‌ను లైన్ మెన్ కు చూపిస్తే చాలు, డిస్ క‌నెక్ష‌న్ బాధ నుంచి త‌ప్పించుకునేందుకు వీలుంటుంది. అయితే సీపీడీసీఎల్ అమ‌లు చేయ‌నున్న ఈ విధానం అన్ని ప్రాంతాల‌లో ఎప్పుడు ల‌భిస్తుందో ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. అతి త్వ‌ర‌లోనే ఈ విధానం అమ‌లు కానుంద‌ని మాత్రం తెలిసింది.

Comments

comments

Share this post

scroll to top