బైక్ ఇండికేట‌ర్ ప‌గ‌ల‌గొట్టిన ఆ వ్య‌క్తి ఎలా స్పందించాడో తెలిస్తే ఆశ్చర్య‌పోతారు..!

త‌ప్పులు… క్ష‌మించాలి… పొర‌పాట్లు చేసే వారు చాలా మందే ఉంటారు. ఆ మాట కొస్తే ఈ భూమిపై ఉన్న ప్ర‌తి ఒక్క మ‌నిషి ఏదో ఒక సంద‌ర్భంలో పొర‌పాటు చేసే ఉంటాడు. కానీ వాటిని స‌రిదిద్దుకునే వారు కొందరే ఉంటారు. అలాంటి వారు ఎప్పుడో ఒక‌సారి మాత్రం మ‌న‌కు క‌న‌ప‌డ‌రు. అయితే ఇప్పుడు చెప్ప‌బోయేది కూడా ఆ క‌న‌ప‌డని వ్య‌క్తి గురించే. అత‌ని పేరు, ఊరు తెలియ‌దు. కానీ, చేసిన పొర‌పాటును స‌రిదిద్దుకుని మ‌నుషులలో ఉండాల్సింది అలాంటి ప‌శ్చాత్తాప గుణ‌మేన‌ని చాటి చెప్పాడు.

చెన్నై న‌గ‌రంలో నివాసం ఉండే మార్క్ నైట్ అనే వ్య‌క్తి స్థానికంగా ఉన్న రాజీవ్ గాంధీ గ‌వ‌ర్న‌మెంట్ హాస్పిట‌ల్‌కు వెళ్లాడు. అత‌ను త‌న బైక్‌ను పార్క్ చేసి లోప‌లికి వెళ్లి ప‌ని చూసుకుని తిరిగి వచ్చి చూడ‌గా బైక్ వెనుక ఉన్న ఇండికేట‌ర్ల‌లో ఓ ఇండికేట‌ర్ ప‌గిలిపోయి క‌నిపించింది. దీన్ని చూసిన మార్క్ నైట్ ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యాడు. ఇండికేట‌ర్‌కు డ్యామేజ్ అవ‌డంతో ఏం చేయాలో తోచ‌క దిగులు చెందాడు. అయినా తేరుకుని ఏదోలే, అలా జ‌రిగిపోయింది అనుకుంటూ బైక్‌ను తీద్దామ‌ని దానికి లాక్ చేసిన హెల్మెట్‌ను తీయ‌గానే అందులో ఒక లెట‌ర్ ఉంది. దాంట్లో వంద రూపాయ‌ల నోట్లు రెండు ఉన్నాయి. దీంతో మార్క్ నైట్‌కు ఒక్క‌సారిగా ఆశ్చ‌ర్యం వేసింది.

sorry-for-damage

ఆ ఆశ్చ‌ర్యంతోనే మార్క్ నైట్ లెట‌ర్‌ను ఓపెన్ చేసి చ‌దివాడు. అందులో ఏముందంటే ‘Sorry For The Damage to Back Light’ అని ఉంది. దీంతో అత‌ను మ‌రోసారి విస్మ‌యానికి లోన‌య్యాడు. బైక్ ఇండికేట‌ర్ ప‌గిలిపోయింద‌నే బాధ‌లో ఉండ‌గానే ఆ ఇండికేట‌ర్ ప‌గ‌ల‌డానికి కార‌ణ‌మైన వ్య‌క్తి సారీ చెబుతూ, దాన్ని రిపేర్ చేసుకోమ‌ని రూ.200ల‌తోపాటు అలా లెట‌ర్ పెట్ట‌డంతో మార్క్ నైట్ ఆ వ్య‌క్తి వ్య‌క్తిత్వానికి దిగ్భ్ర‌మ చెందాడు. నేటి ఆధునిక స‌మాజంలో తోటి మ‌నుషుల ప‌ట్ల పెద్ద పెద్ద త‌ప్పులు చేసిన వారే తామేమీ చేయ‌లేద‌ని చెబుతూ త‌ప్పించుకు తిరుగుతున్నారు. ఈ క్ర‌మంలో ఓ వ్య‌క్తి త‌న వ‌ల్ల జ‌రిగిన చిన్న పొర‌పాటుకు ప‌శ్చాత్తాప ప‌డుతూ అంత‌లా స్పందించాడంటే మార్క్ నైట్‌కు నిజంగా న‌మ్మ‌బుద్ధి కాలేదు. ఈ రోజుల్లో ఇంకా ఇలాంటి వారు ఉన్నారా? అనే సందేహాన్ని అత‌ను వ్య‌క్తం చేశాడు. జ‌రిగిన సంఘ‌ట‌న‌ను మొత్తాన్ని త‌న ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసి ఆ అజ్ఞాత వ్య‌క్తికి మార్క్ నైట్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు. నిజ‌మేగా మ‌రి. మ‌నం స‌మాజంలో ఎదుటి వారి ప‌ట్ల ఎలా ఉంటే వారు కూడా మ‌న‌తో అలాగే ఉంటారు. అయితే ఎవ‌రు ఎవ‌రితో ఎలా ఉన్నా, మ‌నుషుల్లో మాత్రం ప‌శ్చాత్తాప గుణం ఉండాల్సిందే. అప్పుడు స‌మాజంలోని వ్య‌క్తులంద‌రి మ‌ధ్య సంబంధాలు బాగుంటాయి. ఏమంటారు, మేం చెప్పింది నిజ‌మే క‌దా!

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top