ఈ 9 ర‌కాల అద్భుత ఆవిష్క‌ర‌ణ‌లు చూస్తే మీరు షాక‌వుతారు తెలుసా..?

ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానం అందుబాటులోకి వ‌చ్చాక మ‌న జీవ‌న విధానం పూర్తిగా మారిపోయింది. మ‌నం పెద్ద‌గా క‌ష్ట‌ప‌డ‌కుండానే అనేక సౌక‌ర్యాలు మ‌న‌కు అందుబాటులోకి వ‌చ్చాయి. ఓ ర‌కంగా చెప్పాలంటే.. మ‌న ప‌ని మ‌రింత సుల‌భ‌త‌రం అయింది. అది ఆఫీసుల్లో కావ‌చ్చు, ఇండ్ల‌లో కావ‌చ్చు, గ‌తంలో క‌న్నా అనేక రెట్లు మ‌న‌కు ప‌నిభారం త‌గ్గింది. అందుకు కార‌ణం కొత్త‌గా వ‌స్తున్న అనేక వ‌స్తువులే. అలాంటి వాటి గురించే కింద ఇవ్వ‌డం జ‌రిగింది. వీటితో మ‌న ప‌ని మ‌రింత సుల‌భ‌త‌రం అవుతుంది. మ‌రి ఆ వ‌స్తువుల‌పై ఓ లుక్కేద్దామా..!

1. సాధారణంగా పెన్ డ్రైవ్‌ల‌లో ఎంత డేటా ఉందో తెలుసుకోవాలంటే దాన్ని పీసీకి క‌నెక్ట్ చేయాల్సిందే. కానీ ఈ పెన్ డ్రైవ్‌ను చూశారా. దీన్ని పీసీకి క‌నెక్ట్ చేయాల్సిన ప‌నిలేదు. దానిపైనే స్టోరేజ్ వివ‌రాల‌ను తెలియ‌జేసే ఓ ఇండికేట‌ర్ ఉంది. దీంతో మ‌న పని ఇంకా ఈజీ అవుతుంది.

2. మ‌న‌లో కారం తినే వారు కొంద‌రు ఉంటే.. కొంద‌రు ఆహార ప‌దార్థాల‌ను చ‌ప్ప‌గా తింటారు. అయితే మ‌రి ఇద్ద‌రికీ కలిపి ఒకేలా ఏ వంట‌కాన్ని వండ‌లేం క‌దా. క‌నుక‌నే ఈ సాస్‌. దీంట్లో కారం లెవ‌ల్‌ను అడ్జ‌స్ట్ చేసుకోవ‌చ్చు. అంటే.. కారం తినాల‌కునే వారు సాస్ సీసాను తిప్పితే కారంకు సెట్ అవుతుంది. అప్పుడు సాస్ కారంగా వ‌స్తుంది. అదే వ‌ద్ద‌నుకుంటే దాన్ని మ‌ళ్లీ త‌క్కువ కారం ఉండే లెవ‌ల్‌కు అడ్జ‌స్ట్ చేయాలి. అప్పుడు చ‌ప్ప‌గా ఉన్న సాస్ మ‌న‌కు ల‌భిస్తుంది.

3. లిఫ్ట్ ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌డం. బ‌ట‌న్ ఒత్త‌డం. అది వ‌చ్చేదాకా నిల‌బ‌డ‌డం.. ఇదంతా టైం వేస్ట్‌. అందుకే బ‌య‌ట‌కు రాగానే డోర్ వ‌ద్దే లిఫ్ట్ బ‌ట‌న్‌ను ఏర్పాటు చేశారు. దాన్ని ప్రెస్ చేసి లిఫ్ట్ వ‌ద్ద‌కు వెళ్లే లోపు లిఫ్ట్ మ‌నం ఉన్న ఫ్లోర్‌కు వ‌చ్చేస్తుంది. దీంతో స‌మయం ఆదా అవుతుంది.

 

4. కొంద‌రు టాయ్‌లెట్‌కు వెళ్తారు. కానీ బ‌ద్ద‌కంతోనో లేదా నిర్ల‌క్ష్యం కార‌ణంగానో నీటిని ఫ్ల‌ష్ చేయ‌డం మ‌రుస్తారు. అలాంటి వారి కోస‌మే ఈ డోర్ ను ఏర్పాటు చేశారు. టాయిలెట్‌కు వెళ్లి నీళ్లు ఫ్ల‌ష్ చేయ‌క‌పోయినా డోర్ వ‌ద్ద‌కు వ‌చ్చిన హ్యాండిల్‌ను ప‌ట్టుకోగానే దానికి ఉన్న బ‌ట‌న్ ఆటోమేటిక్‌గా టాయిలెట్‌ను ఫ్ల‌ష్ చేస్తుంది. ఐడియా భ‌లేగా ఉంది క‌దా..

 

5. సాధార‌ణంగా మ‌నం ఏదైనా బాటిల్‌ను ఓపెన్ చేస్తే దాన్ని ఎప్పుడు ఓపెన్ చేశామో తేదీ మ‌న‌కు గుర్తుకుండ‌దు. కానీ ఈ బాటిల్ అలా కాదు. దానిపై ఎల‌క్ట్రానిక్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. అందువ‌ల్ల ఆ బాటిల్‌ను ఓపెన్ చేసిన‌ప్పుడ‌ల్లా ఆ తేదీ, స‌మ‌యంల‌ను డిస్‌ప్లే సేవ్ చేసి మ‌న‌కు చూపిస్తుంది.

 

 

6. ఇలాంటి ఇరుకుగా ఉన్న రోడ్ల‌లో బెంచీల‌ను ఏర్పాటు చేసేందుకు వీలు కాదు. అవి దారికి అడ్డంగా వ‌స్తాయి. పైగా ఖర్చు కూడా. కనుక న‌దికి ఉండే ఫెన్సింగ్‌నే అక్క‌డ‌క్క‌డా బెంచీల్లా మ‌లిస్తే బాగుంటుంది క‌దా. అందుక‌నే వారు ఇలా ఆ ఫెన్సింగ్‌ను మార్చారు.

 

 

7. మ‌నం వేసుకునే దుస్తులు భిన్న‌మైన కాంతుల్లో భిన్న‌మైన రంగుల్లో క‌నిపిస్తాయ‌ని తెలుసు క‌దా. క‌నుక ఉద‌యం, మధ్యాహ్నం, రాత్రి ఉండే కాంతుల‌కు అనుగుణంగా మ‌నం వేసుకునే దుస్తుల రంగు ఎలా ఉంటుందో ముందే అనుభ‌వించేలా ఓ షాపింగ్ దుకాణంలో ట్ర‌య‌ల్ రూంలో ఇలా భిన్న‌మైన కాంతులు ప‌డేలా మూడు ర‌కాల లైటింగ్ వ్య‌వ‌స్థ‌ల‌ను ఏర్పాటు చేశారు. వాటి కింద నిల‌బ‌డి మ‌నం వేసుకున్న దుస్తులు మూడు స‌మ‌యాల్లో ఏయే రంగుల్లో క‌నిపిస్తాయో తెలుసుకుని మ‌రీ దుస్తుల‌ను కొనుగోలు చేయ‌వచ్చు. ఈ సౌకర్యం నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది క‌దా.

 

8. సాధార‌ణంగా మ‌న దేశంలో ఎక్క‌డైనా ట్రాఫిక్ సిగ్న‌ల్స్‌లో మ‌న వంతు వ‌చ్చే వ‌ర‌కు లేదా మ‌నకు గ్రీన్ లైట్ ఎంత సేపు ఉంటుందోన‌నే దానిపై మాత్రమే ఇంకా సెక‌న్ల పాటు వేచి ఉండాలో తెలిపేలా సిగ్న‌ల్స్ వ‌ద్ద సెక‌న్ల సంఖ్య‌ను తెలియ‌జేస్తారు. అయితే ఆ సిగ్న‌ల్స్‌లో ఆ లైట్‌ను చూడండి. అందులో ఏయే లైట్ ఎంత సేపు ఉంటుందో సెక‌న్ల‌లో తెలుపుతున్నారు. ఇలా చేస్తే చాలా మంది వాహ‌న‌దారుల‌కు చాలా సౌక‌ర్యంగా ఉంటుంది.

9. ఫోన్ల‌కు, ఇత‌ర చార్జ‌బుల్ వ‌స్తువుల‌కు చార్జింగ్ చేసుకునే పోర్టులు ఉంటాయి. కానీ ఏకంగా బ్యాట‌రీల‌కే వాటిని చార్జింగ్ చేసేందుకు యూఎస్‌బీ పోర్టుల‌ను అమ‌ర్చారు. కావాలంటే చిత్రంలో వాటిని చూడ‌వ‌చ్చు. ఈ ఐడియాకు నిజంగా హ్యాట్సాఫ్ చెప్ప‌వ‌చ్చు.

Comments

comments

Share this post

scroll to top