37 ఏళ్ల సర్వీస్ ఉన్న ఆ ఐపీఎస్ అధికారి సంపాదించిన ఆస్తి ఎంతో తెలిస్తే షాక‌వుతారు..!

నీతి, నిజాయితీల‌తో ప‌నిచేసే ప్ర‌భుత్వ అధికారులంటే అవినీతి ప‌రుల‌కు ఎప్పుడూ క‌ళ్ల‌మంటే. వారిని ఏదో ఒక‌టి చేయ‌నిది అవినీతి ప‌రుల‌కు నిద్ర ప‌ట్ట‌దు. అది ఇత‌ర అవినీతి అధికారుల‌కైనా స‌రే, లేదంటే అవినీతి పరులైన రాజ‌కీయ నాయ‌కుల‌కైనా స‌రే. వారు నీతిమంతులైన ప్ర‌భుత్వ అధికారులు, ఉద్యోగుల‌పై త‌మ ప్ర‌తాపం చూపిస్తారు. వారిని పాతాళానికి తొక్కేస్తారు. అదిగో ఇప్పుడు మేం చెప్ప‌బోతుంది కూడా అలా అణ‌గదొక్క‌బ‌డిన ఓ ఐపీఎస్ ఆఫీస‌ర్ గురించే. నీతిమంతుడిగా ఉండ‌డ‌మే అత‌ను చేసిన త‌ప్పు అయింది. అందుకు ఫ‌లితంగా ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌మోష‌న్ అందుకోలేదు. అయితే ఇటీవ‌లే ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం మార‌డంతో అత‌ని కృషిని గుర్తించి కొత్త ప్ర‌భుత్వం డీజీపీగా ప్ర‌మోష‌న్ ఇచ్చింది. ఇంత‌కీ ఆయ‌న ఎవ‌రంటే..?

ఆయ‌న పేరు సుల్ఖాన్ సింగ్‌. 1980 ఐపీఎస్ క్యాడ‌ర్ కు చెందిన ఆఫీస‌ర్ ఆయ‌న‌. అందులో ఆయ‌న‌కు 37 ఏళ్ల అనుభ‌వం ఉంది. సుల్ఖాన్ సింగ్ నీతి నిజాయితీకి పెట్టింది పేరు. ఇన్నేళ్ల స‌ర్వీస్‌లో ఆయ‌న సంపాదించిన ఆస్తి ఎంతో తెలుసా..? రూ.3 ల‌క్ష‌ల విలువ చేసే 2.3 ఎక‌రాల స్థలం. నెల‌స‌రి వాయిదాల ప‌ద్ధ‌తిలో కొనుగోలు చేసిన ఓ 3 గ‌దుల ఇల్లు. ఇవే ఆయ‌న ఆస్తి. సాధార‌ణంగా ఐపీఎస్ ఆఫీస‌ర్ అంటే మంచి ఉద్యోగ‌మే. అవినీతికి పాల్ప‌డి ఉంటే ఎన్నో కోట్ల ఆస్తి ఉండేది. అయినా ఆయ‌న మొద‌ట్నుంచీ నీతి నిజాయితీల‌తోనే ఉండేవాడు. ఇంత‌కీ ఆయ‌న ప‌నిచేసిన రాష్ట్రం ఏదో తెలుసా..? ఉత్త‌ర ప్ర‌దేశ్‌..! అవును, అదే. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న నీతివంత‌మైన జీవిత‌మే కొన‌సాగించాడు.

అయితే 2007లో ములాయం సింగ్ అధికారంలో ఉన్న‌ప్పుడు సుల్ఖాన్ సింగ్ త‌మ పోలీసు శాఖ‌లోనే జ‌రిగిన ఓ భారీ కుంభ కోణాన్ని బ‌య‌ట పెట్టాడు. దీంతో అంద‌రు నీతివంతులైన ఆఫీస‌ర్‌ల‌కు జ‌రిగిన‌ట్టే ఆయ‌న‌కు జ‌రిగింది. అంత‌టి భారీ స్కాంను క‌నిపెట్టినందుకు గాను ఆయ‌న‌కు ఎలాంటి ప్ర‌మోష‌న్ ల‌భించ‌క‌పోగా, ఆయ‌న విభాగం మార్చారు. అంత‌గా ప్రాధాన్య‌త లేని విభాగాల్లో అధికారిగా ఆయ‌న్ను వేశారు. 2012లో సీఎం అఖిలేష్ యాద‌వ్ ఆయ‌న్ను ఓ ట్రెయినింగ్ డిపార్ట్‌మెంట్‌లో వేశారు. ఆయ‌న క‌న్నా 8 మెట్లు కింద ఉన్న మ‌రో ఆఫీస‌ర్‌ను డీజీపీని చేశారు. కానీ సుల్ఖాన్ సింగ్‌కు మాత్రం ప్ర‌మోష‌న్ ల‌భించ‌లేదు. అయితే ఇటీవ‌లే ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో కొత్త సీఎం వ‌చ్చారు క‌దా. యోగి..! ఆయ‌నే సుల్ఖాన్ సింగ్ ను వెతికి మ‌రీ ప‌ట్టుకొచ్చి డీజీపీని చేశారు. ఇన్నాళ్ల‌కు ఆయ‌న‌కు ప్ర‌మోష‌న్ లభించింది. అయితే మ‌రో 4, 5 నెల‌ల పాటు మాత్ర‌మే సుల్ఖాన్ సింగ్ డీజీపీగా ఉండ‌నున్నారు. ఎందుకంటే ఆయ‌న స‌ర్వీస్ అయిపోవ‌చ్చింది. అయిన‌ప్ప‌టికీ ఎట్ట‌కేల‌కు ఆయ‌న గుర్తింపు ల‌భించ‌డం హ‌ర్ష‌ణీయం..!

Comments

comments

Share this post

scroll to top