క‌రీనాక‌పూర్ కొడుకు తైమూర్ ధ‌రించే షూస్ ధ‌ర ఎంతో తెలిస్తే షాక‌వుతారు..!

అంతే మ‌రి. డ‌బ్బుంటే ఎవ‌రైనా విలాస‌వంత‌మైన జీవితాన్ని గడుపుతారు. ఏది కావాల‌నుకుంటే అది కాళ్ల ద‌గ్గ‌రికే న‌డుచుకుంటూ వ‌స్తుంది. అందుకోసం ఎక్క‌డికీ వెళ్లాల్సిన ప‌నిలేదు. ఏది కోరుకుంటే అది జ‌రుగుతుంది. విలాస‌వంత‌మైన బంగ‌ళాల్లో నివాసం, అంత‌కు మించిన స‌దుపాయాలు, కార్లు… అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ధ‌నికుల‌కు ఉండే సౌకర్యాలు అన్నీ ఇన్నీ కావు. మ‌రి ధ‌నికుల‌కే ఇలా ఉంటే… ఇక ప్ర‌ముఖ సెల‌బ్రిటీల‌కు ఎలాంటి విలాసాలు ఉంటాయో మ‌న‌కు ఇట్టే అర్థ‌మ‌వుతుంది. మ‌రీ ముఖ్యంగా వారి పిల్ల‌ల‌కు. అవును, వారే. అలాంటి ప్ర‌ముఖ బాలీవుడ్ సెలబ్రిటీల‌కు చెందిన ప‌లువురు పిల్ల‌ల ల‌గ్జ‌రీ లైఫ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. తైమూర్ అలీ ఖాన్
బాలీవుడ్ న‌టీన‌టులు సైఫ్ అలీ ఖాన్‌, క‌రీనా క‌పూర్‌ల కొడుకు తైమూర్ అలీ ఖాన్ కు 7 నెల‌ల వ‌య‌స్సు ఉంటుందిప్పుడు. అయితే అత‌నికి అందే సౌక‌ర్యాలు మాత్రం క‌ళ్లు చెదిరేవిగా ఉన్నాయి. ముఖ్యంగా అత‌ను వేసుకునే షూస్ ధ‌ర తెలుసా..? అక్ష‌రాలా రూ.12వేలు. అవి Gucci లేదా Ralph Lauren అనే కంపెనీల‌కు చెందిన‌వి అయి ఉంటాయి. ఇవే కాదు, ఇంకా ఎన్నో ఖ‌రీదైన బ్రాండ్ల షూల‌ను క‌రీనా త‌న కొడుకు తైమూర్ కోసం కొని పెట్టింద‌ట‌.

2. ఆరాధ్య బ‌చ్చ‌న్
బాలీవుడ్ న‌టీన‌టులు అభిషేక్ బ‌చ్చ‌న్‌, ఐశ్వ‌ర్యా రాయ్‌ల కూతురు ఆరాధ్య బ‌చ్చ‌న్ వేసుకునే డ్రెస్సుల‌కు ప్ర‌త్యేకంగా డిజైన‌ర్లు ఉంటార‌ట‌. విలా బాంబ‌ర్‌, యూజీజీ కంపెనీల‌కు చెందిన దుస్తులు, షూల‌ను ఆరాధ్య ధ‌రిస్తుంద‌ట‌. ఇక ఆమె మొద‌టి బ‌ర్త్ డేకు రూ.25 ల‌క్ష‌ల విలువ గ‌ల మినీ కూప‌ర్ కారును అభిషేక్ గిఫ్ట్‌గా ఇచ్చాడ‌ట‌. దీంతోపాటు రూ.54 కోట్ల విలువ చేసే ఓ ఇల్లు ఆమె పేరిట దుబాయ్‌లో ఉంద‌ట‌. దీంతోపాటు ఓ వానిటీ వ్యాన్ కూడా ఆరాధ్య బ‌చ్చ‌న్‌కు ఉంద‌ట‌. దాన్ని సంజ‌య్ గుప్తా అనే డైరెక్ట‌ర్ ఆరాధ్య‌కు గిఫ్ట్‌గా ఇచ్చాడ‌ట‌.

3. అబ్‌రామ్
షారూక్ ఖాన్ చిన్న కుమారుడు అబ్‌రామ్‌కు తండ్రిలాగే కొన్ని ల‌క్ష‌ల మంది అభిమానులు ఏర్ప‌డిపోయారు. అయితే గ‌తేడాది జ‌రిగిన ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా అబ్‌రామ్ కు షారూక్ త‌మ టీం జెర్సీని కొన్ని వేలు పెట్టి ప్ర‌త్యేకంగా డిజైన్ చేయించి మ‌రీ ఇచ్చాడ‌ట తెలుసా.

4. వియాన్ రాజ్ కుంద్రా
రాజ్ కుంద్రా, న‌టి శిల్పాశెట్టిల కుమారుడు వియాన్ రాజ్ కుంద్రా. వీరు ఐపీఎల్ టీం రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఓన‌ర్స్‌. అయితే వియాన్‌కు రాజ్ కుంద్రా, శిల్పాశెట్టిలు త‌మ టీం జెర్సీని గిఫ్ట్‌గా ఇచ్చారు. దీన్ని కూడా కొన్ని వేలు పెట్టి ప్ర‌త్యేకంగా డిజైన్ చేయించి మ‌రీ వియాన్‌కు ఇచ్చారు.

5. ఆర్య‌న్‌, సుహానా
ఆర్య‌న్‌, సుహానాలు కూడా షారూక్ సంతానమే. వీరికి 2009లో షారూక్ ఓ కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు. దాని ధ‌ర రూ.60 ల‌క్ష‌లు. ఆడి కంపెనీకి చెందిన ఎ6 కార‌ది. అందులో మ‌ల్టీమీడియా ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, జీపీఎస్ నావిగేష‌న్ సిస్ట‌మ్‌, డీఎస్‌పీ సౌండ్ సిస్ట‌మ్ వంటి స‌దుపాయాలు ఉన్నాయి.

Comments

comments

Share this post

scroll to top