గుడ్ న్యూస్: టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన పనిలేదు!! మరి టోల్ ఎలా కట్టాలి అంటే.?

మ‌న దేశంలో అనేక ప్రాంతాల్లో జాతీయ ర‌హ‌దారులు ఉంటాయి. అయితే వాటిపై కేవ‌లం కొన్ని చోట్ల మాత్ర‌మే టోల్ ప్లాజాలు ఉంటాయి. ఏ వాహ‌న‌మైనా టోల్ చెల్లించాకే ఆ ప్లాజా నుంచి ముందుకు క‌దిలేందుకు అనుమ‌తినిస్తారు. అయితే ఒక్కోసారి వాహ‌నాల ర‌ద్దీ వ‌ల్ల టోల్ ప్లాజాల వ‌ద్ద వాహ‌న‌దారులు గంట‌ల త‌ర‌బ‌డి వేచి చూడాల్సి వ‌స్తుంది. దీంతో చాలా స‌మ‌యం వృథా అవుతుంటుంది. ఇదే విష‌యాన్ని గ‌మ‌నించిన కేంద్రం ఓ నిర్ణ‌యం తీసుకుంది. అదేమిటంటే… ఇక‌పై టోల్ ప్లాజాల వ‌ద్ద గంట‌ల త‌ర‌బ‌డి లైన్ల‌లో వెయిట్ చేయాల్సిన ప‌ని ఉండ‌దు. మ‌రి డ‌బ్బులు ఎలా చెల్లించాల‌నేగా మీ డౌట్‌.. అయితే అది మీ మొబైల్ ద్వారానే.

అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఇక‌పై టోల్ ప్లాజాల వ‌ద్ద గంట‌ల త‌ర‌బ‌డి లైన్ల‌లో వేచి ఉండాల్సిన ప‌నిలేదు. టోల్ ప్లాజాల వ‌ద్ద వాహ‌నదారులు ప‌డుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నేష‌న‌ల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఓ నిర్ణ‌యం తీసుకుంది. టోల్‌ప్లాజా వ‌ద్ద‌కు రాగానే వాహ‌న‌దారుల మొబైల్ ఫోన్‌లో ఉండే యాప్ ద్వారా ఆటోమేటిక్‌గా టోల్ చెల్లించేలా ఓ నూత‌న విధానాన్ని అందుబాటులోకి తేనుంది. వాహనదారులు మొబైల్‌ ఫోన్ల నుంచే డబ్బు చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ప్రీపెయిడ్‌ వాలెట్లు, క్రెడిట్‌ కార్డుల ద్వారా, బ్యాంకు ఖాతాల ద్వారా నేరుగా ఖాతాల నుంచే డబ్బుచెల్లించే ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నారు. వాహనం టోల్‌ప్లాజా దగ్గరికి రాగానే ఆటోమేటిక్‌గా వారి ఖాతాల నుంచి డబ్బు కట్‌ అయ్యే విధానం తీసుకు రానున్నారు.

టోల్ ప్లాజాల వ‌ద్ద ఇలా ఆటోమేటిక్‌గా డ‌బ్బులు క‌ట్ అయ్యే విధానాన్ని మొదటగా ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-చండీగఢ్‌, ఢిల్లీ-కోల్‌కతా, బెంగళూరు-చెన్నై జాతీయ ర‌హ‌దారులలో ఉన్న టోల్ ప్లాజాల‌లో పరీక్షించ‌నున్నారు. త‌రువాత దేశ వ్యాప్తంగా ఇదే ప‌ద్ధ‌తిని అమ‌లు చేయ‌నున్నారు. టోల్‌ ప్లాజాల వద్ద డబ్బు చెల్లించేందుకు ఆగకుండా నేరుగా ఖాతాలో నుంచి కట్టగలిగేలా అన్ని ఆప్షన్లతో కూడిన మొబైల్‌ అప్లికేషన్‌ను NHAI మరికొన్ని నెలల్లో తీసుకురానుంది. ప్రయాణికులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని వారి వాహ‌నానికి సంబంధించిన వివరాలు అందులో పొందురచాల్సి ఉంటుంది. టోల్ ప్లాజా దగ్గరకు రాగానే వైఫై, బ్లూటూత్‌ సహాయంతో ఫోన్‌లోని యాప్‌ దాన్ని డిటెక్ట్‌ చేస్తుంది. ప్లాజాలోని సిస్టమ్‌ వాహనాన్ని గుర్తించి టోల్‌ డబ్బును యాప్‌తో లింక్ చేసిన ఖాతా నుంచి కట్‌ చేసుకుంటుంది. ఇలా టోల్‌ప్లాజా వ‌ద్ద‌కు రాగానే వాహ‌న‌దారుల అకౌంట్ నుంచి యాప్ ద్వారా నేరుగా డ‌బ్బులు క‌ట్ అవుతాయి. దీంతో ఓ వైపు గంట‌ల త‌ర‌బ‌డి లైన్ల‌లో వేచి ఉండాల్సిన ప‌ని ఉండదు. అలాగే ప్లాజాల వ‌ద్ద చిల్ల‌ర కోసం ఇబ్బందులు కూడా ఉండ‌వు. ఈ విధానం ఎంత త్వ‌ర‌గా పూర్తి స్థాయిలో అంద‌రికీ అందుబాటులోకి వ‌స్తే అంత మంచిది క‌దా..!

Comments

comments

Share this post

scroll to top