ఆహారం బాగాలేదంటూ ఫేస్‌బుక్‌లో వీడియో పెట్టిన బీఎస్ఎఫ్ జ‌వాన్‌… ఇప్పుడేం చేస్తున్నాడంటే..?

త‌మ‌కు అందించే ఆహారం స‌రిగ్గా ఉండ‌డం లేదంటూ కొద్ది రోజుల క్రితం ఓ బీఎస్ఎఫ్ సైనికుడు ఫేస్‌బుక్‌లో ఓ వీడియో పోస్ట్ చేశాడు గుర్తుంది క‌దా. ఆ… అవును, అత‌నే. అత‌ని పేరు తేజ్ బ‌హ‌దూర్ యాద‌వ్‌. అలా అత‌ను వీడియో పోస్ట్ చేయ‌గానే స‌ద‌రు బీఎస్ఎఫ్ అధికారులు స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల్సిందిపోయి అత‌ని మీద‌కు ఎదురు దాడి చేశారు. అత‌నికి మ‌తి భ్ర‌మించిందని, తాగుడుకు బానిస అని… ఇలా ర‌క‌ర‌కాలుగా క‌థలు అల్లి త‌మ త‌ప్పును కప్పి పుచ్చుకునే ప్ర‌య‌త్నం చేశారు. అయితే హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెంట‌నే జోక్యం చేసుకుని ఆ విష‌యాన్ని స్వ‌యంగా ప‌రిశీలించారు కూడా. వెంట‌నే సైనికుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఆదేశించారు. అంత‌టితో అక్క‌డికి ముగిసింది కానీ అస‌లు క‌థ ఇప్పుడే షురూ అయింది. మ‌రి ఇంత‌కీ ఇప్పుడా సైనికుడు తేజ్ బ‌హదూర్ యాద‌వ్ ఏం చేస్తున్నాడో తెలుసా..?

tej-bahadur-yadav

తేజ్ బ‌హ‌దూర్ యాద‌వ్ మొన్నా మ‌ధ్యే అంటే ఆ వీడియో పోస్ట్ చేయ‌డానికి చాలా రోజుల ముందే వాలంట‌రీ రిటైర్మెంట్‌కు ద‌ర‌ఖాస్తు పెట్టుకున్నాడు. అయితే అందుకు పై నుంచి అనుమ‌తి కూడా వ‌చ్చింది. ఇంత‌లో అత‌ను అలా వీడియో పెట్ట‌డంతో అత‌నిపై చ‌ర్య‌ల‌కు బీఎస్ఎఫ్ ఉన్న‌తాధికారులు ఆదేశించారు. దీంతో తేజ్ బ‌హ‌దూర్ యాద‌వ్ రిటైర్మెంట్ ఆగింది. దానిపై అధికారులు క్యాన్సిల్ ముద్ర వేశారు. దీంతో యాద‌వ్ స్పందిస్తూ… అధికారులు త‌న‌ను కావాల‌నే అలా చేస్తున్నార‌ని, సైనికుల స‌మ‌స్య‌ల‌ను బ‌య‌టికి తెలియ‌జెప్ప‌డ‌మేనా నేను చేసిన నేరం అంటూ వాపోతున్నాడు. ఇక అత‌ని భార్య అయితే త‌న భ‌ర్త‌ను అధికారులు ముప్పు తిప్ప‌లు పెడుతున్నార‌ని, ఆ వీడియో పోస్ట్ చేసినప్ప‌టి నుంచి త‌న భ‌ర్త‌కు ఉన్న‌తాధికారులు న‌ర‌కం చూపిస్తున్నార‌ని, అత‌న్ని హౌస్ అరెస్ట్ చేశార‌ని అంటోంది.

కానీ… దీనిపై బీఎస్ఎఫ్ అధికారులు ఏమంటున్నారంటే… తాము యాద‌వ్ రిటైర్మెంట్‌ను అడ్డుకోబోమ‌ని అన్నారు. అత‌ను అలా వీడియో పెట్టడం క్ర‌మ‌శిక్ష‌ణ‌ను ఉల్లంఘించ‌డ‌మే అవుతుందని, అందుకు అత‌నిపై చ‌ర్య‌లు తీసుకునేందుకే కొంత కాలం వ‌ర‌కు అత‌ని రిటైర్మెంట్‌ను ఆపామని అన్నారు. ఇక యాద‌వ్‌ను తాము ఎలాంటి ఇబ్బంది పెట్ట‌డం లేద‌ని, అత‌ని భార్య అన్న‌ట్టుగా ఎలాంటి హౌస్ అరెస్ట్ చేయలేద‌ని అంటున్నారు. ఇక ఇందులో నిజ‌మెంతో ఆ దేవుడికే తెలియాలి. ఏది ఏమైనా… మ‌న దేశంలో త‌ప్పును అలా బ‌హిరంగంగా ప్ర‌శ్నిస్తే… ఇక వారికి ఉంటుంది నాసామిరంగా… ఇది ఇప్పటిది కాదు… ఎప్ప‌టి నుంచో చూస్తూనే ఉన్నాం. మ‌రి తేజ్ బ‌హ‌దూర్ యాద‌వ్ విష‌యంలో ఏమ‌వుతుందో వేచి చూడాలి..!

Comments

comments

Share this post

scroll to top