ఫేస్‌బుక్‌, మెసెంజర్‌ల‌ను ఓసారి రీస్టార్ట్ చేయండి… ఎందుకంటే..?

ఫేస్‌బుక్‌, ఫేస్‌బుక్ మెసెంజ‌ర్‌… ఈ రెండు యాప్స్ చాలా స్మార్ట్‌ఫోన్ల‌లో ఉంటాయి. ఇవి రెండు యాప్స్‌ను వాడ‌ని వారుంటారంటే అతిశ‌యోక్తి లేదేమో. అయితే ఈ యాప్స్ గురించిన విష‌యం మీకొక‌టి తెలుసా..? అదేనండీ… ఇవి రెండు యాప్స్ మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉండ‌డం వ‌ల్ల మీ ఫోన్ బ్యాట‌రీ 20 శాతం త‌గ్గుతుంద‌ట‌. అంతే ఆ మేర బ్యాక‌ప్ త‌క్కువ వ‌స్తుంది. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఇది మేం చెబుతోంది కాదు. ప‌లువురు నిపుణులు విశ్లేషించి ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఫేస్‌బుక్‌, ఫేస్‌బుక్ మెసెంజ‌ర్‌లు రెండూ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఉంటే గ‌న‌క వీటి వ‌ల్ల బ్యాట‌రీ బ్యాక‌ప్ 20 శాతం త‌గ్గుతుంద‌ట‌. అందుకు కార‌ణం… ఇవి రెండు యాప్‌లు బ్యాట‌రీని ఎక్కువ‌గా వాడుకోవ‌డ‌మే..! అయితే దీనికి ప‌రిష్కారం లేదా అంటే… ఉంది..! అదేమిటంటే..!

facebook-messenger-restart
ఫేస్‌బుక్‌, ఫేస్‌బుక్ మెసెంజ‌ర్‌ల వ‌ల్ల ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ల బ్యాట‌రీ 20 శాతం త‌గ్గుతుంద‌ని తెలిసిన వెంట‌నే ఆ సంస్థ‌కు చెందిన సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్లు స‌మ‌స్య‌ను సాల్వ్ చేసే ప‌నిలో ప‌డ్డారు. అందులో భాగంగానే వారు ఆయా యాప్‌ల‌కు చెందిన స‌ర్వ‌ర్ ఎండ్‌ల‌లో ఉన్న స‌మ‌స్య‌ను ఇప్ప‌టికే తొల‌గించేశారు. ఇక‌పై ఈ రెండు యాప్స్ వ‌ల్ల బ్యాట‌రీ ఏ మాత్రం త‌గ్గ‌ద‌ని వారు చెబుతున్నారు. అయితే ఆయా యాప్స్‌ను ఉప‌యోగిస్తున్న యూజ‌ర్లు మాత్రం అలా బ్యాట‌రీ బ్యాక‌ప్ త‌గ్గ‌కుండా ఉండాలంటే ఓ ప‌నిమాత్రం క‌చ్చితంగా చేయాల‌ట‌. అదేంటంటే…

facebook-messenger-restart-
యూజ‌ర్లు తమ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఉన్న ఫేస్‌బుక్‌, ఫేస్‌బుక్ మెసెంజ‌ర్ యాప్‌ల‌ను ఓసారి రీస్టార్ట్ చేయాలి. దీంతో బ్యాట‌రీ బ్యాక‌ప్ త‌గ్గ‌డం అనే స‌మ‌స్య పోతుంది. దీన్ని ఫేస్‌బుక్ ప్ర‌తినిధులు అధికారికంగా వెల్ల‌డించారు కూడా. అయితే యాప్‌ల‌ను ఎలా రీస్టార్ట్ చేయాలంటే… ముందుగా యాప్‌ల‌ను ఓపెన్ చేసి వాటిలో నుంచి లాగ‌వుట్ అవ్వాలి. అనంత‌రం సెట్టింగ్స్‌లో అప్లికేష‌న్స్‌లోకి వెళ్లి ఆ రెండు యాప్‌ల‌ను ఓపెన్ చేసి ఫోర్స్ స్టాప్ చేయాలి. అక్క‌డే కింద ఉండే క్లియ‌ర్ క్యాచె, క్లియ‌ర్‌ డేటా అనే ఆప్ష‌న్ ల‌ను ఎంచుకుని యాప్ డేటాను, క్యాచెను క్లియ‌ర్ చేయాలి. అంతే, మ‌ళ్లీ మెనూలోకి వెళ్లి య‌థా ప్ర‌కారం యాప్‌ల‌ను ఓపెన్ చేసి సైనిన్ అయితే చాలు. దీంతో మీ ఫోన్‌లో బ్యాటరీ త‌గ్గ‌డం అన్న మాటే ఉండ‌దు..!

Comments

comments

Share this post

scroll to top