వాలంటైన్ డే తెలుసు.. వాలంటైన్ వీక్ తెలుసా..?

వాలెంటైన్స్ డే వచ్చేస్తోంది. ప్రపంచమంతా పండుగలా జరుపుకునే ప్రేమికుల రోజును ఆనందోత్సాహాలతో నిర్వహించేందుకు యూత్ రెడీ అయిపోతోంది. వాలెంటైన్స్ డే సెలబ్రేషన్స్ కోసం టీనేజర్స్, యువతీయువకులతో పాటు చాలామంది సిద్ధమవుతున్నారు. లవర్స్ డే నాడు వయసుతో సంబంధం లేకుండా అందరూ తమ ప్రేమను ఇచ్చిపుచ్చుకుంటూ ఆనందిస్తారు. ఫిబ్రవరి నెల అనగానే. యూత్ కి లవర్స్ డే గుర్తొస్తోంది. తన ప్రేయసితో ఎలా సెలబ్రేట్ చేసుకోవాలా అని ప్లాన్లు వేస్తూ ఉంటారు. రొమాన్స్ కు సింబల్ గా మారిన ఫిబ్రవరి నెలలో వాలెంటైన్స్ డేతో పాటు వాలెంటైన్స్ వీక్ కూడా ఉంటుంది తెలుసా..?

ప్రతి ఏటా ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే.. ప్రేమికుల రోజు జరుపుకుంటారు. ఈ రోజును ఆఖరి రోజుగా చేసుకొని ముందు వారంలో ప్రతి రోజుకో ప్రత్యేకత ఇచ్చి వాలెంటైన్స్ వీక్ ను జరుపుకుంటారు. ఈ వారమంతా ప్రేయసిని రోజుకో బహుమతితో మెస్మరైజ్ చేసి.. వారికి మరింత దగ్గరవుతుంటారు.

ఫిబ్రవరి 7 – రోజ్ డే

వాలెంటైన్ వీక్ లో మొదటి రోజు ఫిబ్రవరి 7న జరిగేది రోజ్ డే. వాలెంటైన్స్ డే సెలబ్రేషన్స్ రోజ్ డేతో ప్రారంభమవుతాయి. మీ ప్రేయసికో.. భార్యకో.. వాళ్లపై ఉన్న ఇష్టాన్ని ఒక గులాబీతో చెప్పండి. అయితే గులాబీ పువ్వుల కలర్స్ వెనుక చాలా అర్థాలున్నయి. ఒక్కో రంగుకు ఒక్కో అర్థం ఉంటుంది జాగ్రత్త.

ఫిబ్రవరి 8 – ప్రపోజ్ డే

మీ కాలేజ్ మేట్ కో.. కొలీగ్ కో.. లేదా మీకు బాగా నచ్చిన వ్యక్తికో మీ ప్రేమను తెలిపే రోజే ప్రపోజ్ డే. వారికి ఊహించని బహుమతి ఇచ్చి.. వారి ఆనందపు కాంతుల్లో మీరు ఎంజాయ్ చేయొచ్చు.

ఫిబ్రవరి 9 – చాక్లెట్ డే

సాధారణంగా మహిళలు చాక్లెట్లు ఎక్కువగా ఇష్టపడతారు. చాక్లెట్లు కామోద్దీపన పదార్థాలుగా పనిచేసి జరగబోయే హాట్ హాట్ రాత్రికి కూల్ కూల్ గా ఉంచుతాయి. అందుకే భార్యలకు, ప్రేయసికి.. ఈ రోజున చాక్లెట్లు బహుమతిగా అందిస్తారు.

ఫిబ్రవరి 10 – టెడ్డీ డే

ఆడవాళ్లకు టెడ్డీబేర్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే వారికి అందమైన టెడ్డీ బేర్ లు బహూకరించి ఆనందింప చేసే రోజే టెడ్డీ డే. మీ ప్రేయసికి నచ్చిన కలర్స్ లో టెడ్డీబేర్ కొని.. బహూకరించండి.

ఫిబ్రవరి 11 – ప్రామిస్ డే

మనకు నచ్చిన వ్యక్తికి దగ్గర కావడం కోసం కొన్ని వాగ్దానాలు చేయక తప్పదు. అలాంటి వాగ్దానాలు చేయడమే కాదు.. తూచా తప్పకుండా పాటించాలి కూడా. ప్రేయసి మీద మీకున్న ప్రేమను ప్రామిస్ డే రోజున ఒక వాగ్దానం ద్వారా తెలియజేయండి. జీవితాంతం ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోండి.

ఫిబ్రవరి 12 – హగ్ డే

ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమానురాగాలకు, కష్టసుఖాలకు చిహ్నం ఓ చిన్ని కౌగిలి. మనస్పూర్తిగా ఎదుటివారిని కౌగిలించుకుంటే ఎన్నో బాధలు కరిగిపోతాయి. ఒకరిపై ఒకరికి ప్రేమ పెరుగుతుంది. అనుబంధం బలపడుతుంది. మీరు మీ ప్రేయసికో ప్రియుడికో ఇచ్చే కౌగిలితో ఇద్దరి మనసు పరవశిస్తుంది. ప్రశాంతత లభిస్తుంది. అందుకే హగ్ డే రోజున మీకు బాగా ఇష్టమైని వారికి ఓ తీయని హగ్ ఇవ్వండి.

ఫిబ్రవరి 13- కిస్ డే

వేయి మాటలు చెప్పలేని భావాన్ని ఓ చిన్ని ముద్దు పలికిస్తుంది. ఎదుటివారి మీద అంతులేని ప్రేమ ఉన్నా చెప్పలేని వారు కొందరుంటారు. అలాంటి వారు ఓ తీయని ముద్దుతో తమ ప్రేమను వ్యక్తం చేయొచ్చు. అందుకే కిస్ డే రోజున మీకు ఇష్టమైన వారికి జీవితాంతం గుర్తుండిపోయేలా ఓ ముద్దు ఇవ్వండి. మీ ప్రేమ అలా నిలబడిపోతుంది.

ఫిబ్రవరి 14 – వాలెంటైన్స్ డే

వారం రోజుల పాటు రోజుకో రకం బహుమతితో ఆశ్చర్యంతో ముంచెత్తిన మీరు.. చివరి రోజు మీ మనసులోని మాటను చెప్పే మధురమైన రోజు.. అదే వాలెంటైన్స్ డే మీకు బాగా నచ్చిన వారికి. మీ మనసులో మాట చెప్పేసే రోజు.. వాలెంటైన్స్ డే రోజు ఓ అందమైన గులాబీ, ఓ చిన్న బహుమతితో వెళ్లి మీ ప్రేమను వ్యక్తం చేయండి. మీ మనసులో వారికున్న ప్రాధాన్యతను అర్థమయ్యేలా చెప్పండి.. వారి ప్రేమను పొందండి.. జీవితాంతం ప్రేమపక్షుల్లా జీవించండి.. ఆల్ ది బెస్ట్..

Comments

comments

Share this post

scroll to top