ఈ వీడియో చూస్తే రైళ్లలో ఇకపై మీరు టీ తాగరు. ఎందుకో తెలుసా..?

ఉదయం నిద్ర లేచింది మొదలు.. మళ్లీ రాత్రి నిద్రించే వరకు మన దైనందిన జీవితంలో చాయ్‌.. ఒక భాగమైపోయింది. చాయ్ తాగకపోతే ఆ రోజంతా ఏదో ఇబ్బందిగా అనిపించే వాళ్లు చాలా మందే ఉన్నారు. అంతలా టీ మన జీవితాలను ప్రభావితం చేస్తుంది. అయితే రైలు ప్రయాణాల్లో ఉన్నప్పుడు మాత్రం అందులో అమ్మే టీ బాగోకపోయినా, రిలీఫ్‌ కోసం కచ్చితంగా ఆ టీనే తాగుతారు. వేరే ఆప్షన్‌ లేదు. కానీ కింద ఇచ్చిన వీడియో చూస్తే మాత్రం మీరు ఇకపై రైళ్లలో టీ తాగేందుకు అస్సలు సాహసం చేయరు. రైళ్లలోనే కాదు, రైల్వే స్టేషన్లలోనూ టీ తాగాలంటే ఆలోచిస్తారు. అవును, మీరు విన్నది కరెక్టే. ఎందుకంటే విషయం అలాంటిది మరి. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

పైన ఇచ్చిన వీడియో చూశారు కదా. రైలులో ఓ వ్యక్తి బాత్‌రూం వద్దకు వచ్చి తలుపు కొట్టగానే అందులో ఉన్న వ్యక్తి మూడు టీ క్యాన్లను బయట పెట్టాడు. వాటిల్లో ఒకదాన్ని ఓ వ్యక్తి ప్లాట్‌ఫాం పైకి తీసుకెళ్లగా మరో ఇద్దరు రెండు క్యాన్లను చెరొకటి తీసుకుని అదే రైలులో చెరో వైపుకు వెళ్లారు. దీన్ని బట్టి మీకు ఏం తెలుస్తుంది ? అవును, అదే.. వారు టీలో నీళ్లు కలిపారు. అది కూడా రైలు బాత్‌ రూంలో ఉన్న నీరు. అందుకే అందులో ఓ వ్యక్తి మూడు క్యాన్లను పెట్టాడు. రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఈ వీడియోను తీయడంతో అది కాస్తా ఇప్పుడు నెట్‌లో వైరల్‌ అవుతోంది.

అయితే ఆ వీడియోలో బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే ఆడియోను గమనించారా..? వారు తెలుగులోనే మాట్లాడుకుంటున్నారు. అంటే.. ఇది తెలుగు రాష్ట్రాల్లోని ఏదో ఒక స్టేషన్‌లోనే జరిగినట్లు మనకు తెలుస్తుంది. ఆ వీడియోను తీసిన వ్యక్తి సదరు చాయ్‌ అమ్మేవారిని ప్రశ్నించాడు కూడా. బాత్‌ రూంలో టీ క్యాన్లను ఎందుకు పెట్టారు అని అడగ్గా అందుకు చాయ్‌ అమ్మేవారు సమాధానం చెప్పకుండా మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు. ఈ క్రమంలో ఇప్పుడీ వీడియో పెద్ద చర్చనీయాంశమే అయింది. సోషల్‌ మీడియాలో ఈ వీడియో బాగా వైరల్‌ అవుతోంది. కనుక ఇకపై మీరు రైళ్లలో టీ తాగాలంటే ఎందుకైనా మంచిది ఓ సారి ఆలోచించండి. లేదంటే అలాంటి టీ తాగి అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుంది. ఇప్పటికే రైళ్లు, రైల్వే స్టేషన్లలో అందిస్తున్న ఆహారం నాణ్యంగా ఉండడం లేదని ఎప్పటి నుంచో ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి టీ కూడా చేరిపోయింది. మరి ఇది రైల్వే శాఖ వరకు చేరుతుందా, వారు స్పందిస్తారా.. చూడాలి మరి..!

Comments

comments

Share this post

scroll to top