మ‌తం మారితే రిజ‌ర్వేష‌న్లు వ‌ర్తించ‌వు. పాత మ‌తంలోని రిజ‌ర్వేష‌న్ల‌ను కొత్త మ‌తంలో వాడుకోలేరు..! వెల్ల‌డించిన త‌మిళ‌నాడు హైకోర్టు..!

మ‌న దేశంలో ఏ మతంలో ఉన్న వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తికి చెందిన కులాల వారికైనా స‌రే రిజ‌ర్వేష‌న్లు ఉన్న సంగ‌తి తెలిసిందే. దీంతో ఆ రిజ‌ర్వేష‌న్లను వారు చ‌దువుల్లో, ప్ర‌భుత్వ ఉద్యోగాల్లో ఉప‌యోగించుకుంటూ ఉంటారు. అయితే ఇంత వ‌ర‌కు ఓకే. కానీ మ‌తం మారితే..? అప్పుడెలా..? అంత‌కు ముందున్న మ‌తంలో ఏదైనా కులంలో అనుభ‌వించిన రిజ‌ర్వేష‌న్లు కొత్త మ‌తంలో వేరే కులంలో వాడుకోవ‌చ్చా..? అంటే.. అవును, వాడుకోవ‌చ్చు.. అని వాదించే వారు ఉన్నారు. కానీ.. నిజానికి అలా కుద‌ర‌దు. ఇది మేం చెబుతున్న‌ది కాదు, న్యాయ స్థానాలే చెబుతున్నాయి. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే…

చెన్నైకి చెందిన ఎస్‌.యాస్మిన్ అన‌బ‌డే ఓ యువ‌తి క్రిస్టియ‌న్ నాడార్ కుటుంబంలో జన్మించింది. అయితే ఆమెకు ఆ మ‌తంలో వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తికి చెందిన రిజ‌ర్వేష‌న్ ఉంది. ఈ క్ర‌మంలో ఆమె 2012లో గ్రూప్ 4 ఉద్యోగానికి ద‌ర‌ఖాస్తు చేసుకుంది. అప్ప‌టికే ఆమెకు 30 ఏళ్లు నిండిన‌ప్ప‌టికీ రిజ‌ర్వేషన్ కేట‌గిరి కింద వ‌య‌స్సులో ఐదేళ్ల స‌డ‌లింపు ఇచ్చారు. దీంతో ఆమె రాత ప‌రీక్ష‌లో ఉత్తీర్ణురాలైంది. అయితే ఆమె ఆ త‌రువాత ఇస్లాం మ‌తంలోకి మారింది. దీంతో ఆమెకు అంత‌కు ముందు ఉన్న మ‌తంలోని వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల రిజ‌ర్వేష‌న్ వ‌ర్తించ‌ద‌ని అధికారులు చెప్పారు. ఈ క్ర‌మంలో ఆమె ఓసీ కింద‌కి వ‌స్తుంద‌ని అందుకని ఆమెకు రిజ‌ర్వేషన్ ఇచ్చేది లేద‌ని కౌన్సిలింగ్‌లో అధికారులు స్ప‌ష్టం చేశారు.

దీంతో యాస్మిన్ ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్ర‌యించింది. ఈ క్రమంలో కేసు విచారించిన న్యాయ‌మూర్తి తాజాగా తీర్పు ఇచ్చారు. మ‌న దేశంలో ఎవ‌రైనా వ్య‌క్తి ఒక మతంలోని ఏదైనా కులంలో ఉండి, వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల రిజ‌ర్వేష‌న్ పొంది, ఆ త‌రువాత వేరే మ‌తంలోకి మారితే పాత మ‌తంలో ఉన్న రిజ‌ర్వేష‌న్ కొత్త మ‌తంలో ఉండ‌ద‌ని, వారు ఓసీలుగా ప‌రిగ‌ణించ‌బ‌డతార‌ని, క‌నుక రిజ‌ర్వేష‌న్ పొంద‌లేర‌ని న్యాయ‌మూర్తి స్ప‌ష్టం చేశారు. గ‌తంలోనూ 1952లో అప్ప‌టి మ‌ద్రాస్ హై కోర్టు ఇలాంటి కేసులో ఎప్పుడో తీర్పు చెప్పింద‌ని న్యాయ‌మూర్తి వెల్ల‌డించారు. అంతేకాదు, ఓసీలుగా ఉన్న వారు వేరే మ‌తంలో రిజర్వేష‌న్ ఉన్న కులంలోకి మారినా వారికి కూడా రిజ‌ర్వేష‌న్లు వ‌ర్తించ‌వ‌ని ధ‌ర్మాస‌నం వెల్ల‌డించింది. కాబ‌ట్టి… మ‌తం మారే వారు ఒక‌సారి ఆలోచించుకోవాలి. ఇప్ప‌టికే ఉన్న మ‌తంలో రిజర్వేష‌న్‌ను గన‌క పొందుతున్న‌ట్ట‌యితే వారు మ‌తం మారాక ఆ రిజ‌ర్వేష‌న్‌ను పొంద‌లేరు..!

Comments

comments

Share this post

scroll to top