ఇక‌పై చెన్నై టు బెంగుళూరు అర‌గంట‌లోనే వెళ్ల‌వ‌చ్చు..!

దాదాపుగా 345 కిలోమీట‌ర్లు… చెన్నై నుంచి బెంగుళూరుల మ‌ధ్య ఉన్న దూరం ఇది. రోడ్డు మార్గంలో వెళ్తే అంత దూరం వ‌స్తుంది. కానీ రైలు మార్గంలో అయితే 341 కిలోమీట‌ర్లు వ‌స్తుంది. అది స‌రే… తేడా ఎంత స్వ‌ల్ప‌మైన‌ప్ప‌టికీ చెన్నై నుంచి బెంగుళూరుకు ప్ర‌యాణించాలంటే ఎవ‌రైనా 340 కిలోమీట‌ర్లు వెళ్లాల్సిందే. అయితే అందుకు రోడ్డు, రైలు మార్గాల్లో 7 గంట‌ల వ‌ర‌కు ప‌డుతుంది. కానీ… ఇక‌పై ఆయా ప్రాంత వాసులు కేవ‌లం 30 నిమిషాల్లోనే ఆ రెండు ప్రాంతాల మ‌ధ్య ప్రయాణించ‌వ‌చ్చు. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. కేవ‌లం అర‌గంట‌లోనే చెన్నై నుంచి బెంగుళూరుకు వెళ్ల‌వ‌చ్చు. ఇంత‌కీ అదెలా సాధ్య‌మో తెలుసా..? హైప‌ర్ లూప్ అనే ఓ ప్ర‌త్యేక‌మైన ర‌వాణా వ్య‌వ‌స్థ వ‌ల్ల‌..! త్వ‌ర‌లో ఈ విధానం ఆయా సిటీల్లో ప్రారంభం కానుంది.

hyper-loop-1

hyper-loop-2

హైప‌ర్ లూప్ ర‌వాణా వ్య‌వ‌స్థ అనేది నిజానికి ట్రైన్‌ను పోలి ఉంటుంది. కాక‌పోతే బుల్లెట్ ట్రైన్ క‌న్నా కొన్ని వంద‌ల రెట్లు ఎక్కువ వేగంతో వెళ్తుంది. దాదాపు గంట‌కు 1200 కిలోమీట‌ర్ల వేగంతో ఇందులో ప్ర‌యాణించ‌వ‌చ్చు. మొత్తం ట్రాక్ అంతా ఓ పెద్ద సైజ్‌ గొట్టంలా ఉంటుంది. మెట్రో రైల్ మాదిరిగానే ఆ గొట్టాల‌ను పిల్ల‌ర్లపై అమ‌రుస్తారు. వాటి లోప‌లి నుంచి హైపర్ లూప్ ట్రైన్ వెళ్తుంది. అది గ‌రిష్టంగా గంట‌కు 1200 కిలోమీట‌ర్ల వేగంతో వెళ్ల‌గ‌ల‌దు. ఇదే వ్య‌వ‌స్థ త్వ‌ర‌లో చెన్నై, బెంగుళూరుల‌లో అందుబాటులోకి రానుంది.

hyper-loop-3

hyper-loop-4

అమెరికాకు చెందిన ఓ కంపెనీ హైప‌ర్ లూప్ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకుగా రాగా, అందుకు సంబంధించిన చ‌ర్చ‌లు ప్ర‌స్తుతం కొన‌సాగుతున్నాయి. తొలుత చెన్నై-బెంగుళూరు లైన్ ఓకే అవ‌గానే చెన్నై-ముంబై, బెంగుళూరు-తిరువ‌నంత‌పురం, ముంబై-ఢిల్లీ సిటీల మ‌ధ్య హైప‌ర్ లూప్ ట్రైన్‌ను తీసుకురానున్నారు. దీంతో ప్ర‌యాణానికియ్యే స‌మ‌యాన్ని ఎన్నో గంట‌ల మేర త‌గ్గించేందుకు అవ‌కాశం ఉంటుంది. మరో 38 నెల‌ల్లో ఈ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసి అందుబాటులోకి తెచ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. కేవలం విండ్‌, సోలార్ ప‌వ‌ర్‌ను ఆధారంగా చేసుకుని ఈ హైప‌ర్‌లూప్ వ్య‌వ‌స్థ ప‌నిచేస్తుంది. దీంతో ఇంధ‌న వ్య‌యం కూడా గ‌ణ‌నీయంగా త‌గ్గ‌నుంది. ఇక ఈ హైప‌ర్‌లూప్ ఎప్పుడు ప‌రుగులు పెడుతుందో అప్ప‌టి వ‌రకు మనం వేచి చూడాల్సిందే..!

Comments

comments

Share this post

scroll to top