వ‌ర‌ద ప్రాంతాల్లో చిక్కుకున్న‌ప్పుడు ఇలా చేస్తే ప్రాణాల‌తో బ‌తికి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చ‌ట‌..!

ప్ర‌కృతి విప‌త్తుల‌నేవి చెప్పి రావు. అవెప్పుడు వ‌చ్చినా చెప్ప‌కుండానే వ‌స్తాయి. అలా వ‌చ్చే క్రమంలో ఎంతో మందిని త‌మ‌తో తీసుకుపోతాయి. అలాంటి వాటిలో ప్ర‌ధానంగా చెప్పుకోద‌గిన‌వి వ‌ర‌ద‌లు. అవును, అవే. ఉత్త‌రాఖండ్ వ‌ర‌ద భీభ‌త్సం చూశారుగా. అది ఎంత మంది ప్రాణాల‌ను బ‌లి తీసుకుందో అంద‌రికీ తెలుసు. ఆ వ‌ర‌ద‌కు కార‌ణాలేమున్నా ఎంతో మంది త‌మ ప్రాణాల‌ను కోల్పోయారు. అయితే అదే కాదు, వేరే ఎక్క‌డైనా వ‌ర‌ద ఉధృతి ఎక్కువ‌గా ఉన్న ప్ర‌దేశంలో ఎవ‌రైనా చిక్కుకుంటే ఇక అంతే సంగ‌తులు. అలాంటి వారి పై ప్రాణాలు పైనే పోతాయి. ఈ క్రమంలో అలాంటి అపాయ ప‌రిస్థితిలో చిక్కుకున్న వారు బ‌తికి బ‌ట్ట క‌ట్ట‌డమంటే చాలా క‌ష్ట‌మే. అయితే అలాంటి వ‌ర‌ద‌లు వ‌చ్చిన‌ప్పుడు ఓ సూచ‌న పాటిస్తే అధిక శాతం వ‌ర‌కు మ‌న ప్రాణాల‌ను ర‌క్షించుకోవ‌చ్చ‌ట‌. అదెలాగంటే..!

hand-in-flood

సాధార‌ణంగా నీటికి ప్ర‌వ‌హించినా, ప్ర‌వ‌హించ‌కున్నా ఎంతో కొంత ఫోర్స్ (బ‌లం) ఉంటుంది. అయితే మ‌నిషి క‌న్నా నీటి ప‌రిమాణం ఎక్కువ‌గా ఉంటే ఆ నీరు ఆ మ‌నిషిని తోసేస్తుంది. అది ఎంత వేగంగా ప్ర‌వ‌హించినా స‌రే. ఈ క్ర‌మంలో పెద్ద ఎత్తున వ‌ర‌దలు వ‌చ్చిన‌ప్పుడు ఆ నీటి వేగం ఇంకా ఎక్కువ‌గా ఉంటుంది కాబ‌ట్టి ఎంత మంది మ‌నుషులు ఆ నీటి ప్ర‌వాహంలో ఉన్నా కొట్టుకుని పోతారు. అయితే ఆ నీటి ప్ర‌వాహానికి వ్య‌తిరేక దిశ‌లో బ‌లాన్ని క‌లిగిస్తే అప్పుడు అందులో మ‌నుషులు ఉన్నా వారికి ఏమీ కాదు. ఆ బ‌లం ఎలా వ‌స్తుందంటే, మ‌నుషులంతా ఒక‌రి వెనుక ఒక‌రు సందు లేకుండా గ‌ట్టిగా ప‌ట్టుకుని నిల‌బ‌డితే చాలు. దాంతో ఆ మ‌నుషుల బ‌ల‌మంతా క‌లిసి నీటి ప్ర‌వాహానికి వ్య‌తిరేకంగా ప‌నిచేస్తూ దాన్ని స‌మ‌ర్థ‌వంతంగా అడ్డుకుంటుంది. ఈ క్ర‌మంలో ప్ర‌వాహ వేగం త‌గ్గ‌గానే మ‌నుషులు బ‌తికి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అయితే అదే మ‌నుషులు ప‌క్క ప‌క్క‌నే ఉంటే మాత్రం అంత బ‌లం రాదు. ఒకరి వెనుక ఒక‌రు ఉండాల్సిందే. అప్పుడే నీటికి అడ్డుగోడ‌లా ఏర్ప‌డుతుంది.

పైన చెప్పిన సూచ‌న‌ను వ‌ర‌ద ప్రాంతాల్లో చిక్కుకున్న‌ప్పుడు ఉప‌యోగించి సుల‌భంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. కాగా ఈ ప‌ద్ధ‌తిని కొంద‌రు ప్ర‌యోగ‌శాల‌లో ప‌రీక్షించి మ‌రీ విజ‌య‌వంతమయ్యారు. వారి ప‌రీక్ష‌కు చెందిన వీడియోను కింద వీక్షించ‌వ‌చ్చు. వ‌ర‌దలు వ‌చ్చిన‌ప్పుడు వాటి నుంచి ఎలా త‌ప్పించుకోవాలో తెలుసుకున్నారుగా, న‌చ్చితే అంద‌రికీ షేర్ చేయండి!

Comments

comments

Share this post

scroll to top