ఓ హాస్పిట‌ల్ లో జ‌రిగిన సంఘ‌ట‌న‌.! జీవిత స‌త్యాన్ని భోదించింది.!!

నిజ‌మే మ‌రి. మ‌నం బ‌తికున్నంత కాలం డ‌బ్బు మ‌న‌తోపాటు ఉంటుంది. కానీ చ‌నిపోయాక అది మ‌న‌తో రాదుగా. అలాగే డ‌బ్బు అనేది జీవితంలో అవ‌స‌ర‌మే. సౌకర్య‌వంతంగా జీవించేందుకు అది కావాల్సిందే. కానీ దాంతో ఏదైనా కొన‌వ‌చ్చు, ఏమైనా చేయ‌వ‌చ్చు అనుకుంటేనే అది పొర‌పాటు అవుతుంది. డ‌బ్బు అన్ని సంద‌ర్భాల్లోనూ మ‌న‌కు అవ‌స‌రం రాదు. చైనాలో జ‌రిగిన ఓ య‌దార్థ సంఘ‌ట‌న స‌రిగ్గా ఇదే కోవ‌కు చెందుతుంది. ప్ర‌స్తుతం ఈ వార్త నెట్‌లో వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే…

చైనాలోని హార్బిన్ ప్రావిన్షియ‌ల్ హాస్పిట‌ల్ అది. అక్క‌డికి ఓ మ‌హిళ వ‌చ్చింది. త‌న‌కు క్యాన్స‌ర్ వ‌చ్చింద‌ని, దాన్ని న‌యం చేయాల‌ని చెబుతూ త‌న వ‌ద్ద బ్యాగు నిండా ఉన్న డ‌బ్బును డాక్ట‌ర్ల‌కు చూపింది. అయితే ఆమెకు క్యాన్స‌ర్ ఫైన‌ల్ స్టేజిలో ఉంద‌ని, చేయ‌డానికి ఏమీ లేద‌ని, త‌మ‌తో ఏమీ కాద‌ని వారు తేల్చి చెప్పారు. ఇక రోజులు ద‌గ్గ‌ర పెట్టుకోవాల్సిందేన‌ని, ఎంత డ‌బ్బు ఖ‌ర్చు పెట్టినా బ‌త‌క‌డం క‌ష్ట‌మ‌ని వైద్యులు తేల్చారు.

అయినప్ప‌టికీ ఆ మ‌హిళ విన‌లేదు. త‌న‌కు ట్రీట్‌మెంట్ చేయ‌మ‌ని చెబుతూ బ్యాగులో ఉన్న డ‌బ్బును ఇవ్వ‌బోయింది. డాక్ట‌ర్లు అందుకు నిరాకరించారు. దీంతో ఆ మ‌హిళకు కోపం క‌ట్టలు తెంచుకుంది. తాను ఏం చేస్తుందో ఆమెకు తెలియ‌లేదు. బ్యాగులో ఉన్న డ‌బ్బునంతా చింద‌ర వంద‌ర‌గా హాస్పిట‌ల్ కారిడార్‌లో విసిరేసింది. అదే స‌మ‌యంలో what`s the use of having the money, what is the use of having the money, Money cannot buy health, money cannot buy time, money cannot buy life. అంటూ పెద్దగా అరుస్తూ అక్క‌డి నుంచి వెళ్లిపోయింది. అవును మ‌రి, డ‌బ్బుతో దేన్న‌యినా కొన‌వ‌చ్చు అనుకుంటే అది పొర‌పాటే అవుతుంది. ప్ర‌పంచంలో ఎంత‌టి ధనికుడైనా ఏదో ఒక రోజు చ‌నిపోవాల్సిందే. అప్పుడు త‌న ద‌గ్గ‌ర ఉన్న డ‌బ్బుతో పోతున్న ప్రాణాల‌ను మాత్రం కొన‌లేడు క‌దా..!

Comments

comments

Share this post

scroll to top