ఈ దేశాల‌కు వెళ్లాలంటే వీసా అవ‌సరం లేదు..!

వీసా అంటే తెలుసు క‌దా. ఏదైనా దేశంలో ఉండేందుకు గాను అక్క‌డి ప్ర‌భుత్వం ఇచ్చే అనుమ‌తి. ఇది దేశాన్ని బ‌ట్టి, మనం ఉండాల‌నుకునే రోజుల సంఖ్య‌ను బట్టి అనేక ర‌కాలుగా ఉంటుంది. ట్రావెల్‌, ఎడ్యుకేష‌న్, బిజినెస్‌, జాబ్ వంటి విభాగాల వారీగా కూడా ఆయా దేశాలు వీసాల‌ను జారీ చేస్తుంటాయి. అయితే ప్ర‌పంచంలో ఉన్న ఏ దేశం వెళ్లేందుకైనా సంబంధిత దేశ వీసా ఉండి తీరాల్సిందే. కానీ… ఇప్పుడు మేం చెప్ప‌బోయే దేశాల‌కు వెళ్లాల‌నుకుంటే మాత్రం అందుకు వీసా అవ‌స‌రం లేదు. కేవ‌లం పాస్‌పోర్టు ఉంటే చాలు. ఎంచ‌క్కా ఆ దేశాల్లో విహ‌రించ‌వ‌చ్చు. ఈ క్రమంలో అలా వీసా ఫ్రీ గా ఉన్న దేశాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

bhutan

భూటాన్…
మ‌న దేశానికి అతి సమీపంలో ఉన్న భూటాన్ దేశంలోకి భారతీయులు వీసా లేకుండానే వెళ్ళచ్చు. భూటాన్ లో బంగీ జంప్ , రాక్ క్లైంబింగ్‌, పారాచూట్ లలో గాల్లో విహరించడం వంటివి ఫేమ‌స్‌. ఇవే అక్క‌డి పర్యాటకులను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి. క‌నుక మీరు భూటాన్ వెళ్తే వీటి మ‌జాను ఓసారి ఆస్వాదించండి.

dominica

డొమినికా…
డొమినికా దీవిని ది నేచర్ ఐలాండ్ అఫ్ ది కెరబియాన్ అని కుడా పిలుస్తారు. ఈ దీవిలో జలపాతాలు , నదులు , సరస్సుల వంటివి అధికంగా ఉంటాయి. ఇవి పర్యాటకులను బాగా ఆకర్షిస్తాయి. అంతేకాదు ఈ ప్రాంతంలో ఉండే కొన్ని అడ‌వుల్లో ఎప్పుడూ వ‌ర్షం ప‌డుతుంది. దీంతో ఆ ప‌చ్చ‌ని ప్రాంతం చూసేందుకు రెండు కళ్లు స‌రిపోవు.

mauritius

మారిష‌స్‌…
ఈ దేశంలో అందమైన మడుగులు, పగడపు దిబ్బలు, బంగారు వర్ణంలో మెరిసిపోయే బీచ్ లు ఉంటాయి. ఇవే అక్క‌డ ఫేమ‌స్‌. వీటి అందాల‌ను వ‌ర్ణించ త‌రం కాదు. దీంతోపాటు ఈ ప్రాంతంలో భార‌తీయుల్లాగే దీపావ‌ళి, మ‌హా శివ‌రాత్రి పండుగ‌ల‌ను అత్యంత వైభ‌వంగా జ‌రుపుకుంటారు. ఆ వేడుక‌ల‌ను చూసేందుకైనా మారిష‌స్‌కు వెళ్లాల్సిందే.

హాంగ్ కాంగ్…
ప‌ర్యాట‌కుల స్వ‌ర్గ‌ధామంగా హాంగ్ కాంగ్‌ను పిలుస్తారు. అక్క‌డ రెస్టారెంట్‌ల‌లో ల‌భించే ఆహారానికి ప్ర‌త్యేక‌త ఉంది. ప్ర‌ధానంగా నూడుల్స్‌, సీ ఫుడ్ తో చేసే ప‌లు వెరైటీ వంట‌కాలు ప‌ర్యాట‌కులను అమితంగా ఆక‌ట్టుకుంటాయి. హాంగ్‌కాంగ్‌లో ఉండే డిస్నీ ల్యాండ్‌ను చూసేందుకు ప్ర‌పంచం న‌లు మూల‌ల నుంచి ప‌ర్యాట‌కులు వ‌స్తారు.

jamaica

జమైకా…
ఈ దీవీలో పచ్చని పర్వతాలు, సెలయేళ్ళు , పగడపు దిబ్బలు ప్ర‌ధాన ఆకర్ష‌ణ‌. వీటిని చూసేందుకు ప‌ర్యాటకులు ఎక్కువ‌గా వ‌స్తుంటారు. ఇక్క‌డి మాంటిగో బే , నేగ్రిల్ , పోర్ట్ అంటోనియో ప్రాంతాలలోని నీలపు వర్ణంలో కనిపించే పర్వతాలు, గోల్ఫ్ కోర్టులు, విలాసవంతమైన రిసార్ట్‌ల‌ను క‌చ్చితంగా చూడాల్సిందే.

haiti

హైతీ…
హైతీ కూడా ప‌ర్యాటకుల‌ను విశేషంగానే ఆక‌ట్టుకుంటుంది. ఇక్క‌డి సాంప్ర‌దాయ నృత్యాలు, బీచ్‌లు, డైవింగ్ వంటి విన్యాసాలు ప‌ర్యాట‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకుంటాయి.

fiji

ఫిజీ…
ఫిజీ ఐలాండ్ లో వివిధ రకాలైన జంతు జాతులు, వృక్షాలు , అందమైన బీచ్‌లో ఉంటాయి. ఇవి పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఫిజీ లోని బొటానిక‌ల్ గార్డెన్ లు , క్లబ్ లు , బార్లు క‌చ్చితంగా చూడాల్సిందే. ఇక్క‌డ పర్యాటకులు ఎక్కువగా ఇష్టపడే క్రీడ స్కూబా డైవింగ్.

grenada

గ్రినాడా…
గ్రినాడా లో ఉండే తెలుపు రంగు ఇసుక ఉన్న బీచ్‌లు, అందమైన పర్వతాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇక్కడ‌ ప్రత్యేకమైన పూల కుండీలు లభిస్తాయి. గ్రినాడా లోని నీటి అడుగున ఉన్న పార్క్ ను ప‌ర్యాటకులు క‌చ్చితంగా చూడాలి.

equador

ఎక్వాడర్…
ఎక్వాడర్ సాంస్కృతిక, చారిత్రక ఆకర్షణలకు పెట్టింది పేరు. ఎక్వాడర్ లోని మంచుతో కప్పుబడిన అగ్ని పర్వతాలు, రంగు రంగుల మార్కెట్లు పర్యాటకులకు మంచి అనుభూతిని ఇస్తాయి.

vanatu

వనటు…
ప్రపంచంలోనే అత్యంత సంతోష‌వంతంగా ఉండే దేశంగా వనటు పేరుగాంచింది. ఇక్కడ లభించే ఆహారం , వినోదం పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటాయి.

Comments

comments

Share this post

scroll to top