యోగి హారిక కేసులో కొత్త ట్విస్ట్: లీకైన వాట్సాప్ మెసేజ్‌లు… వారిద్దరి మధ్య జరిగిన అసభ్యకరమైన సంభాషణ?

షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ యోగి-హారిక కేసు మరో కొత్త మలుపు తిరిగింది. హారిక తనతో చేసిన వాట్సాప్ చాట్‌ను యోగి లీక్ చేశాడు. తాను వ్యక్తిగతంగా ఆనందంగా లేనంటూ హారిక పంపిన వాట్సాప్ మెసేజ్‌లను యోగి బయటపెట్టాడు. తనకు విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేయాలని ఉందని హారిక ఆ వాట్సాప్ చాట్‌లో పేర్కొన్నట్లు యోగి తన మొబైల్‌లో తీసిన స్క్రీన్ షాట్స్‌ను పోలీసులకు పంపించాడు. వారిద్దరి మధ్య జరిగిన అసభ్యకరమైన సంభాషణనంతా యోగి బయటపెట్టి ఈ కేసులో కొత్త ట్విస్ట్ ఇచ్చాడు. హారిక వద్ద రూ. 10వేలు అప్పుగా తీసుకున్న మాట వాస్తమేనని అంగీకరించిన యోగి.. తాను మంచివాడినేనని నిరూపించుకునేందుకు ఇలా చేస్తున్నాడని తెలుస్తోంది.

యోగి బయటపెట్టిన వాట్సాప్ చాట్ గురించి హారికను ‘ఏబీఎన్’ సంప్రదించగా.. యోగితో చాటింగ్ చేసిన మాట నిజమేనని, విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేయాలని ఉందన్న మాట కూడా వాస్తవమేనని ఆమె ఒప్పుకుంది. అయితే చాటింగ్‌లో యోగి చేసిన మెసేజ్‌లను డిలీట్ చేసి తన మెసేజ్‌లు మాత్రమే తప్పుడు అర్థం వచ్చేలా సృష్టించాడని ఆమె ఆరోపించింది. తాను విదేశాలకు వెళ్దామన్నది ఆఫీసు పని మీద అని ఆమె క్లారిటీ ఇచ్చింది. తాను ఎంఎన్‌సీ కంపెనీలో పనిచేస్తున్నానని, ఆఫీస్ పని మీద విదేశాలకు వెళ్లే అవకాశం ఉందని చెప్పినట్లు హారిక పేర్కొంది.

source:abnandhrajyothi

Comments

comments

Share this post

scroll to top