భర్త మరణంతో కష్టాలు.. ఆమె ఎంచుకున్న మార్గం ఏంటో తెలిస్తే??

సామాన్యంగా సెలూన్ షాప్ లు మగవాళ్లే నడుపుతారు, ఆడవాళ్లు బ్యూటీ పార్లర్ లలో కేవలం ఆడవాళ్లకు మాత్రమే స్టయిలింగ్స్ చేస్తూ ఉంటారు, మరి కొన్ని ప్రొఫెషనల్ హై ఎండ్ సెలూన్స్ లో అమ్మాయిలు కటింగ్, హెయిర్ స్టైల్ వంటివి చేస్తూ ఉంటారు మగవాళ్ళకి, మామూలు సెలూన్ లలో అమ్మాయిలు కనిపించరు, కానీ కుటుంబ పోషణ కోసం సెలూన్ ని ఒంటి చేత్తో నడుపుతున్నారు ఒక మహిళ. వివరాల్లోకెళితే తిరుచ్చి పట్టణంలోని చింతా మణి బజార్‌లో వేంబులి సెలూన్‌ను నిర్వహిస్తున్నారు మేరీ, ఆమె కుటుంబ బాధ్యత అంతా ఆమె చూసుకుంటున్నారు, సెలూన్ నడుపుతూ ఆమె కుటుంబాన్ని నడిపిస్తున్నారు.

మేరీసెలూన్ అంటే తిరుచ్చి పట్టణం లో అందరికి తెలుసు, అంత ఫేమస్ ఆమె, మేరీ తన జీవితం లో సెలూన్ నడపడానికి కారణం ఏంటో వివరించారు, మేరీ మాట్లాడుతూ : ‘నేను పుట్టిపెరిగింది తిరుచ్చి సర్కాల్‌ పాళయంలో. నా భర్త రూబన్‌ షణ్ముగనాథన్‌, మావ య్య ధనరాజ్‌ ఈ సెలూన్‌ను నిర్వహించారు. మా నాన్న, మావయ్య స్నేహితులు కావడంతో రెండు కుటుంబాల అంగీకారంతో నా భర్త రూబన్‌ షణ్ముగనాథన్‌ మతం మారి నన్ను 2001లో వివాహం చేసుకున్నారు. మాకు ఒకమ్మా యి, ఒకబ్బాయి ఉన్నారు. ఏడేళ్లుగా మావయ్యతో కలిసి పనిచేసి వృత్తి లో అనుభవం సాధించిన నా భర్త 2008 నుంచి ఆయనే పూర్తిస్థాయిలో సెలూన్‌ను నిర్వహించారు. నేను టైలరింగ్‌ శిక్షణ పూర్తిచేసి సెలూన్‌ ముందే బట్టలు కుట్టుకుంటూ కుటుంబానికి నా వంతు ఆర్థిక సాయం అందిస్తూవచ్చాను. తీరిక సమయంలో భర్తకు తోడుగా హెయిర్‌ డై కలిపివ్వడం, చెత్తను తొలగించడం వంటి చిన్నచిన్న పనులు చేసేదాన్ని. సంతోషంగా సాగుతున్న మా కుటుంబాన్ని ఒక రోడ్డుప్రమాదం చిన్నాభిన్న చేసింది. ప్రమాదంలో గాయపడిన నా భర్త 9 నెలలు ఆస్పత్రిలోనే వున్నారు. దీంతో వేరే మార్గం లేక సెలూన్‌ నిర్వహించే భారాన్ని నా భుజాలకెత్తుకున్నాను. కస్టమర్లకు షేవింగ్‌ చేయడం, హెయిర్‌ స్టైల్‌, డై వేయడం వంటి పనులు నేనే చేస్తూవచ్చాను. నాకు తోడుగా మా నాన్న రోజంతా దుకాణంలోనే తోడుగా ఉండేవారు. ఆస్పత్రి నుంచి వచ్చిన తరువాత కొన్నేళ్లకి నా భర్త 2014లో మరణించారు. దాంతో సెలూన్‌ వృత్తినే కొనసాగించాలని నిర్ణయించుకున్నాను. ఇద్దరు పిల్లలను బాగా చదివించి ఉన్నతవంతులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో వృత్తినే దైవంగా భావించి సేవలంది స్తున్నాను. నాలాగే భర్తను కోల్పోయిన మహిళలు ఏదో ఒక వృత్తిని ఎంచుకుని, అందులో రాణించి సమాజంలో గౌరవంగా బ్రతకాలన్నదే నా ఆకాంక్ష’ అని మేరీ తెలిపారు.

ఎందరికో స్ఫూర్తిదాయకం.. :

మేరీ ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఎటువంటి అవినీతికి పాల్పడకుండా, తప్పు పని కాకుండా ఏ పని చేసినా చాలు, కుటుంబ బాధ్యతల ముందు మిగిలినవన్నీ చిన్నబోతాయి అని మేరీ నిరూపించారు, ముఖ్యంగా ఆడవాళ్లకు మేరీ కథ ఒక కనువిప్పు.

 

Comments

comments

Share this post

scroll to top