శృగారం శృతి మించితే…బట్టతల, హార్ట్ ఎటాక్ లు వస్తాయని మీకు తెలుసా?

ఆకలి,నిద్ర, సెక్స్…ప్రతి మనిషికి చాలా అవసరం..ఓ రకంగా చెప్పాలంటే ఇవి ప్రాథమిక అవసరాలు..కానీ అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్టు….మోతాదును మించితే ప్రతిదీ విషమే అంటారు మన పెద్దలు. ఈ మాట నిజంగా నిజం. శృగారం శృతి మించితే….బట్టతల, కంటి చూపు మందగించడం, హార్ట్ ఎటాక్ వచ్చే  అవకాశాలు ఉన్నాయట. ఇవేవో గాలిమాటలు కాదు దీనికి ఆధారాలు సైతం ఉన్నాయంటున్నారు  కొందరు బయో హ్యాకర్స్.!  అదే పనిగా రోజులకు 4 సార్లకు మించి శృంగారంలో పాల్గొంటే…ఈ ఎఫెక్ట్స్ ఉంటాయట.

couple-making-love_147444

  • శృంగారంలో పాల్గొన్న సమయంలో….DHT( డిహైడ్రో టెస్టోస్టిరాన్) అనే హార్మోన్ అధిక మొత్తంలో ఉత్పత్తి అవుతుంది. ఇది తల వెంట్రుకలు అతుక్కొని ఉండే ప్రాంతాన్ని ప్రభావితం చేస్తుంది దీని కారణంగా…బట్టతల వచ్చే ఆస్కారం ఉందట.
  • DHT అనే హార్మోన్…. కంటికి రక్తాన్ని అందించే రక్తనాళాలను కూడా  ఉత్తేజపరుస్తుందట,  దీని కారణంగా కంటి చూపు తగ్గే అవకాశం కూడా ఉందట.!
  • కాస్త బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉన్న వారు అదే పనిగా సెక్స్ లో పాల్గొంటే….రతి క్రీడ తారా స్థాయికి చేరినప్పుడు …గాలి తీసుకోవడం కష్టమయ్యి…గుండె మీద ఒక్కసారిగా  ప్రెషర్ పడి….హార్ట్ ఎటాక్ వచ్చే ఆస్కారం కూడా ఉందంటున్నారు బయో హ్యాకర్స్.
  • అయితే శృగారంలో పాల్గొనకపోయిన అనేక అనర్థాలున్నాయట…కాబట్టి రోజుకు 4 సార్లకు మించి శృంగారంలో పాల్గొనకపోవడమే బెటర్ అంటున్నారు డాక్టర్లు.

Comments

comments

Share this post

scroll to top