తప్పిపోయిన ఈ ఎద్దును పట్టిస్తే….50 వేల రూపాయలు.! కరపత్రాలు కొట్టించి పంచిన యజమాని.

నా ఎద్దు పేరు బాద్ షా….దానిని ఓ జంతువులా నేనెప్పుడూ చూడలేదు. అది నాకు కొడుకుతో సమానం. నా బాద్షా రెండు రోజులుగా కనిపించడం లేదు. మీలో ఎవరికైనా కనిపిస్తే నాకు చెప్పండి మీకు 50 వేల రూపాయలను బహుమతిగా ఇస్తానని కరపత్రాలు అచ్చేయించి మరీ పంచుతున్నాడు ఉత్తర ప్రదేశ్ వారణాసికి చెందిన మనోజ్ కుమార్. సోషల్ మీడియా కంట పడ్డ ఈ వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా హల్ చల్ చేస్తుంది. UP లోని వారణాసికి చెందిన మనోజ్ కుమార్ కు తన ఎద్దు బాద్ షా అంటే అమితమైన ప్రేమ.బాద్షాకు  కూడా మనోజ్ కిచెన్ లోకి, బెడ్ రూమ్ లోకి వెళ్లేంత యాక్సెస్ ఉందటేనే తెలుస్తుంది బాద్ షా అంటే మనోడికి ఎంత లవ్వో..
laalbadshah1
అయితే ఎప్పుడూ ఇంటి ముందు ఉండే ఉన్న బాద్ షా రెండు రోజుల నుండి కనిపించడం లేదంట… ఎటు వెళ్లిందోనని తనకు తెలిసిన అన్ని ప్లేస్ లలో వెతికాడు..అయినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో తెగ టెంక్షన్ పడిపోయిన మనోజ్ కరపత్రాలు కొట్టించి మరీ పంచాడు..పట్టించిన వారికి 50 వేల నజరానా కూడా ప్రకటించాడు.  బాద్ షా ఎవరికైనా కనిపిస్తే వారు అమ్మకుండా ఉండటానికే తాను 50వేలు ప్రకటించానని… తన బాద్ షాను అప్పగిస్తే తప్పకుండా 50వేలు ఇస్తానని పాండే తెలిపాడు. బాద్‌షా తనకు నందిలాంటిదని… తాను పూజిస్తున్నానని… అలాంటి బాద్‌షా తప్పిపోవడంపై బాధపడుతున్నానని పాండే ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు.

Comments

comments

Share this post

scroll to top