ఏ క‌ల‌ర్ వంకాయ తింటే మంచిది ? గ‌్రీన్ OR వైలెట్.!!

వంకాయ‌వంటి కూర‌యు…పంక‌జ‌ముఖి సీత వంటి భామామ‌నియున్…..అంటూ వంకాయ మ‌న వంట‌కాల్లో ఓ ముఖ్య‌మైన ప్లేస్ ను కొట్టేసింది.! అలాంటి వంకాయ‌కు సంబంధించి మార్కెట్ లో రెండు ర‌కాలు దొరుకుతున్నాయి. 1) గ్రీన్ క‌ల‌ర్ వంకాయ‌లు 2) వైలెట్ క‌ల‌ర్ వంకాయ‌లు. ఈ రెండిటిలో ఏది తింటే మంచిది? ఏది అంత శ్రేయ‌స్కారం కాదు అనేది ఓ సారి తెలుసుకుందాం.

ఒక్క‌మాట‌లో చెప్పాలంటే వైలెట్ క‌ల‌ర్ వంకాయ ది బెస్ట్.! ఇంకా చెప్పాలంటే…వైలెట్ క‌ల‌ర్ లో మ‌న‌కు తిన‌డానికి దొరికేవి రెండే రెండు 1) వంకాయ 2)నేరేడు ( జామూన్ ) …సో వైలెట్ క‌ల‌ర్ ఫుడ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది.!

గ్రీన్ తో పోల్చితే వైలెట్ క‌ల‌ర్ వంకాయ‌…పెరిగే క్ర‌మంలో సూర్యుని నుండి అధిక కాంతిని గ్ర‌హిస్తుంది. ! అధిక సూర్య ర‌శ్మిని ఉప‌యోగించుకుంటూ పెరిగిన మొక్క‌ల నుండి వ‌చ్చే ఆహార ప‌దార్థాలు తిన‌డానికి చాలా శ్రేయస్క‌రం.!!

ఇంకా వంకాయ విష‌యంలో చాలా అపోహ‌లున్నాయి…వంకాయ వాతం, బ‌రువు పెరుగుతారు అంటారు- కానీ వైలెట్ క‌ల‌ర్ వంకాయను క‌డుపునిండా తినొచ్చు. జొన్న‌రొట్టె, స‌జ్జ రొట్టె తో వంకాయ కూర‌ను క‌లిపి తింటే చాలా మంచిది.

వంకాయ తిన‌డం వ‌ల్ల క‌లిగే లాభాలు:

  • క్యాన్స‌ర్ ను అడ్డుకుంటుంది.
  • బ‌రువు త‌గ్గడంలో హెల్ప్ అవుతుంది( 100 గ్రాముల వంకాయ‌లో 25 కేలొరీస్ )
  • గుండె జ‌బ్బుల‌ను నివారిస్తుంది ( ఫైబ‌ర్, పొటాషియం, విటామిన్ B-6 లు ఉండ‌డం వ‌ల్ల హార్ట్ ఎటాక్స్ ను నివారించ‌వొచ్చు)
  • షుగ‌ర్ ను అరిక‌డుతుంది.
  • చ‌ర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.

వంకాయ‌లోని పోష‌క విలువ‌లు. ( 100 గ్రాములకు ):

  • Total Fat – 27.5g
  • Saturated Fat – 5.2g
  • Cholesterol – 16mg
  • Sodium – 62mg
  • Potassium – 618mg
  • Total Carbohydrates – 17.8g
  • Dietary Fiber – 4.9g
  • Protein – 8g
  • Sugars – 11.4g

Comments

comments

Share this post

scroll to top