యాత్ర సినిమా రివ్యూ..మమ్ముట్టి గారు జీవించేసారు. అభిమానులకి పండగే..!!

వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి బయోపిక్ అయిన ‘యాత్ర’ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది, రాజన్న పాద యాత్ర చేసిన సమయాన్ని ఎక్కువగా హై లైట్ చేసారు, టైటిల్ కూడా యాత్ర అని సినిమా కి తగ్గట్టుగానే పెట్టారు. థియేటర్ ల దెగ్గర వై.ఎస్.ఆర్ అభిమానులు భారీ హంగామా చేస్తున్నారు, తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మార్నింగ్ షోస్ మరియు బెనిఫిట్ షోస్ భారీ ఓపెనింగ్స్ తో మొదలయ్యాయి, వై.ఎస్.ఆర్ అభిమానులు, కాంగ్రెస్, వైకాపా అభిమానులే కాకుండా, సామాన్య ప్రజలు కూడా సినిమా చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు, ఆయన విలువ, క్రేజ్ ఎప్పటికి తగ్గదు అనడానికి నిదర్శనం యాత్ర సినిమా.

మమ్ముట్టి.. జీవించేసారు సర్…!

మమ్ముట్టి గారిని ఎంత పొగిడిన తక్కువే, ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో గ్రేటెస్ట్ యాక్టర్స్ లో మమ్ముట్టి ఒకరని అందరూ అంటూ ఉంటారు, ఒకవేళ ఎందుకు అలా అంటారు అని మీకు అనుమానం వస్తే, యాత్ర సినిమా తప్పక చూడండి, మీకే అర్ధం అవుతుంది, వై.ఎస్.ఆర్ అభిమానులకు ఈ సినిమా పండగే, సామాన్య ప్రజలకు కూడా ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది, ఇక ఈ సినిమా లో నటీ నటులు వారి పాత్ర పరిధి మేరకు చక్కగా నటించారు, కానీ మమ్ముట్టి గారు తన నటనతో అందరినీ డామినేట్ చేసారు.

సినిమా..:

ఇక సినిమా విషయానికి వస్తే, వై.ఎస్.ఆర్ ప్రజల కోసం అమలు పరిచిన ప్రతి ఒక్క స్కీం కి ఒక కారణం చూపించడం, ఎమోషన్స్ ని కరెక్ట్ గా చూపించడంలో డైరెక్టర్ విజయం సాధించాడు, చంద్ర బాబు నాయుడు గారితో ఫోన్ లో మాట్లాడే సీన్ సినిమా కె హైలైట్, ఇక సినిమా అయిపోయాక చివర్లో వై.ఎస్.ఆర్ గారి నిజ జీవిత ఫుట్ఏజ్ చూపించినప్పుడు అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయింది, అభిమానులే కాదు సామాన్య ప్రేక్షకులు కూడా చాలా కనెక్ట్ అవుతారు ఆ సీన్స్ కి.

సక్సెస్.. :

ఇక సినిమా మొత్తం మీద చూసుకుంటే అభిమానులనే కాదు సామాన్య ప్రజలను కూడా ఆకట్టుకునే సినిమా గా యాత్ర సినిమా నిలిచిపోతుంది, ఒక బయోపిక్ లో ఏవైతే ఉండాలో, అవన్నీ ఉన్నాయ్. కమర్షియల్ ఫార్మటు కి దూరం గా ఉన్నా, మమ్ముట్టి నటన, డైరెక్టర్ సినిమా ని మలిచిన తీరు యాత్ర సినిమా ని ప్రేక్షకులకు దెగ్గర చేసింది.

Positives :

మమ్ముట్టి
సెకండ్ హాఫ్
ఎమోషనల్ సీన్స్
చంద్రబాబు నాయుడు గారి ఫోన్ కాల్
లాస్ట్ 15 మినిట్స్

Negatives :

స్లో పేస్ ఇన్ ఫస్ట్ హాఫ్.
అక్కడక్కడా కొన్ని సీన్స్ అనవసరం అనిపిస్తాయి

Ap2Tg రేటింగ్ : 3.5/5

Comments

comments

Share this post

scroll to top