యాత్ర సినిమా మొదటి టికెట్ నాలుగున్నర లక్షలు, రిలీజ్ కి ముందు విపరీతమైన క్రేజ్.!!

మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి హీరో గా నటించిన సినిమా యాత్ర. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి బయోపిక్ యాత్ర సినిమా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పాత్ర లో ఆయన లాగే నటించారు మమ్ముట్టి. ఆయన హావభావాలు, నడక, మాట తీరు.. టీజర్, ట్రైలర్ లు చూస్తుంటే మమ్ముట్టి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పాత్ర లో ఒదిగిపోయారు అనిపించింది.

టికెట్ ధర 4.37 లక్షలా.?

అమెరికా లో యాత్ర సినిమా ప్రీమియర్ ఫస్ట్ టికెట్ ని వేలం వెయ్యగా, 6,116 డాలర్లకు సొంతం చేసుకున్నారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వీరాభిమాని, 6 వేళ డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీ లో చెప్పాలంటే సుమారు నాలుగున్నర లక్షల రూపాయిలు. మునీశ్వర్‌ రెడ్డి అనే వైఎస్ వీరాభిమాని 6,116 డాలర్లకు మొదటి టికెట్‌ను సొంతం చేసుకున్నారు.

భారీ స్థాయిలో.. :

అమెరికాలోని పంపిణీ సంస్థ నిర్వాణ యాత్ర సినిమాను ఓవర్ సీస్ లో పంపిణీ చేస్తోంది. యాత్ర సినిమాను 70ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మించింది. 70ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్వాణ తో కలిసి ఓవర్సీస్ లో పంపిణి చేస్తున్నారు.

ఫిబ్రవరి 8 న..:

మమ్మూట్టి గారు ఇంత వరకు ఎన్నో విలక్షణమైన పాత్రల్లో నటించారు. కేవలం మాస్ కమర్షియల్ మూవీస్ లోనే కాకుండా ముందు నుండి అన్ని తరహా పాత్రల్లో నటిస్తూ వస్తున్నారు. యాత్ర సినిమాను తెలుగు, మలయాళ బాషలలో ఫిబ్రవరి 8 న విడుదల చెయ్యనున్నారు. వై.ఎస్.ఆర్ గారి తండ్రి పాత్రలో జగపతి బాబు నటించారు. విజయమ్మ గారి పాత్రను పోషించిన నటి పేరు అశ్రిత వేముగంటి,

అశ్రిత వేముగంటి వయసు ఎంతో తెలుసా :

అశ్రిత వేముగంటి బాహుబలి – 2 చిత్రం లో అనుష్క కు వదిన పాత్రలో నటించారు, అశ్రిత వేముగంటి వయసు 27 ఏళ్ళు, ఆమె అనుష్క కంటే చిన్నవారు వయసులో, అశ్రిత వేముగంటి ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీ బిజీ గా ఉన్నారు, యాత్ర చిత్రం తరువాత ఆమె మరింత బిజీ అవుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.

 

Comments

comments

Share this post

scroll to top