యాత్ర సినిమా సెన్సార్ పూర్తి.. ప్రశంసలు కురిపించిన సెన్సార్ సభ్యులు ఏమని కామెంట్ చేసారో తెలుసా.?

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి గారి బయోపిక్ యాత్ర చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది, మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి యాత్ర సినిమాలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి గారి పాత్రలో నటించారన్న సంగతి తెలిసిందే, మమ్మూటీ గారు వైవిధ్యమైన పాత్రలకు పెట్టింది పేరు, విలక్షణమైన నటనతో జనాలను ఆకట్టుకొనే సామర్ధ్యం ఆయన వరం, ఏ పాత్రలోనైనా ఇమిడిపోగలిగే సత్తా మమ్ముట్టి గారి బలం.

సెన్సార్ సభ్యుల ప్రశంసలు.. :

సెన్సార్ సభ్యులు యాత్ర సినిమాకు క్లీన్ యూ సర్టిఫికెట్ జారీ చేసారు, యాత్ర సినిమాలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి గారు రాజకీయాల్లో ఎలా ఎదిగారు, పాద యాత్ర సమయం లో ఆయన ఎలాంటి పరిస్థితులను ఎదురుకున్నారు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి ఎలా అయ్యారు అనే అంశాలను చిత్రం లో చూపించినట్టు చిత్ర ప్రొడ్యూసర్ తెలిపారు. యాత్ర చిత్రాన్ని డైరెక్ట్ చేసిన మహి వి రాఘవ ని సెన్సార్ సభ్యులు పొగడ్తలతో ముంచెత్తారని యాత్ర టీం సభ్యులు తెలిపారు.

ఫిబ్రవరి 8 న.. :

ఫిబ్రవరి 8 వ తారీఖున యాత్ర చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి గారి అభిమానులే కాదు, ప్రత్యర్థి పార్టీ నేతలు కార్యకర్తలు సామాన్య ప్రజలు కూడా ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. మమ్మూటీ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి గారి పాత్రలో జీవించేశారని చిత్ర వర్గాలు తెలిపాయి, యాత్ర టీజర్, ట్రైలర్ లు చూస్తే వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి గారి పాత్రలో మమ్మూట్టి గారు ఒదిగిపోయారని అర్ధమవుతుంది.

అచ్చం విజయమ్మే :

యాత్ర చిత్ర ట్రైలర్ ని చుసిన ప్రతి ఒక్కరు విజయమ్మ పాత్రలో నటించిన నటి విజయమ్మ లాగానే ఉన్నారని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. విజయమ్మ పాత్రను పోషించిన నటి పేరు అశ్రిత వేముగంటి, యాత్ర సినిమాలో వై.ఎస్.ఆర్ గారి తండ్రి పాత్రలో జగపతి బాబు నటించారు.

అశ్రిత వేముగంటి ఎవరంటే … :

అశ్రిత వేముగంటి భరతనాట్యం, కూచిపూడి నాట్యంలో ప్రతిభ సాధించారు. అయితే ఆమెకు సినిమాలో ఛాన్స్ ఎలా వచ్చింది అనుకుంటున్నారా? ఓసారి ఆమె ఓ ప్రదర్శన ఇస్తున్నారు. ఆ ప్రదర్శన వీక్షించే ఆడియన్స్ లో రాజమౌళి కుటుంభం కూడా ఉంది. ఆ పెర్ఫార్మెన్స్ అయిపోయిన నెలకు రాజమౌళి కొడుకు కార్తికేయ నుండి ఫోన్ కాల్ వచ్చింది. మీకు సినిమాలో నటించే ఉద్దేశ్యం ఉందా అని. అలా అడిగితె అవకాశం ఎవరు వదులుకుంటారు చెప్పండి! అందులోను బాహుబలి సినిమా.అందుకే ఆశ్రిత ఓకే చెప్పేసింది.

అశ్రిత వేముగంటి వయసు ఎంతో తెలుసా :

అశ్రిత వేముగంటి బాహుబలి – 2 చిత్రం లో అనుష్క కు వదిన పాత్రలో నటించారు, అశ్రిత వేముగంటి వయసు 27 ఏళ్ళు, ఆమె అనుష్క కంటే చిన్నవారు వయసులో, అశ్రిత వేముగంటి ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీ బిజీ గా ఉన్నారు, యాత్ర చిత్రం తరువాత ఆమె మరింత బిజీ అవుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.

 

Comments

comments

Share this post

scroll to top