మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు షోపై యండ‌మూరి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

ప్ర‌ముఖ ర‌చ‌యిత యండ‌మూరి వీరేంద్ర‌నాథ్ సినీ న‌టుడు రాంచ‌ర‌ణ్ తేజ‌పై చేసిన వ్యాఖ్య‌ల‌కు గాను మొన్నా న‌డుమ నాగ‌బాబు ఓ ఫంక్ష‌న్‌లో ఎలా స్పందించారో అంద‌రికీ తెలిసిందే. ప‌రుష‌మైన ప‌ద‌జాలంతో ఇన్‌డైరెక్ట్‌గా యండ‌మూరిపై కామెంట్స్ చేశారు. అయితే ఆ వివాదం గురించి జ‌నాలు మ‌రిచిపోక‌ముందే తాజాగా యండ‌మూరి చేసిన వ్యాఖ్య‌లు మ‌రోసారి దుమారాన్ని సృష్టిస్తున్నాయి. ఇంత‌కీ ఆయ‌న ఈసారి దేనిపై కామెంట్స్ చేశారో తెలుసా..?  మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు షోపై..! ఆయ‌న చేసిన కామెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..!

yandamuri-on-mek

”టీవీ ఆన్ చేస్తే ఒక సీరియ‌ల్ త‌రువాత ఒక సీరియ‌ల్… నీ మొగుడే నా మొగుడు, నీకు నాకు ఒక‌డే మొగుడు, నీ కొత్త మొగుడే నా పాత మొగుడు… అంతే మ‌న జ‌న్మ ధ‌న్య‌మైపోయింది…” అంటూ  మొద‌లైన యండ‌మూరి వ్యాఖ్య‌లు మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు షోపై కూడా సాగాయి. ”కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తి, మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు. ఒక్కొక్క‌రి ద‌గ్గ‌ర రూ.15 వ‌సూలు చేసి, అలా 10 ల‌క్ష‌ల మంది ద‌గ్గ‌ర వ‌సూలు చేసి, రూ.1.80 కోట్లు సంపాదించి, దాంట్లో రూ.6 ల‌క్ష‌లు మ‌న‌కు కుక్క‌కు విసిరిన‌ట్టు విసిరితే, చొంగ కార్చుకుంటూ చూస్తున్నాం, ఎర్న్ (సంపాదించు), నాట్ బై ల‌క్… దాని క‌న్నా లాట‌రీ టిక్కెట్ కొనుక్కోవ‌డం ఈజీ. ఐ హేట్ దిస్ గ‌వ‌ర్న‌మెంట్ ఫ‌ర్ బ్యానింగ్ ది లాట‌రీస్‌. (ప్ర‌భుత్వం లాట‌రీల‌ను బ్యాన్ చేయ‌డాన్ని ఖండిస్తున్నా). నువ్వు (ప్ర‌భుత్వం) లాట‌రీలను బ్యాన్ చేయొద్దు, బ్యాన్ చేస్తే అన్నీ బ్యాన్ చేయ్‌. మా ఇంటి ప‌క్క‌న పాక‌లో ఉండే లేబ‌ర్ వాళ్లు కూడా రూ.15 ఖ‌ర్చు పెట్టి 3 మెసేజ్‌లు పంపారు. ఇంత క‌న్నా హీనం ఉందా. ఐ డోన్ట్ నో యూ అగ్రీ విత్ మీ ఆర్ నాట్‌. ఎంత మంది పేద వారి ద‌గ్గ‌ర  నుంచి రూ.15 తీసుకుని ఇలా చేస్తారు. బియ్యానికి లేని వారు కూడా ఎస్ఎంఎస్‌లు పంపుతున్నారు. చాలా త‌ప్పు జ‌రుగుతోంది. గ్యాంబ్లింగ్‌ను నిషేధించిన‌ప్పుడు అన్నింటినీ నిషేధించాలి.” ఇవీ… యండ‌మూరి చేసిన వ్యాఖ్య‌లు..! కావాలంటే ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల వీడియోను మీరూ స్వ‌యంగా చూడ‌వ‌చ్చు.

మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు షోపై యండ‌మూరి వీరేంద్రనాథ్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. సోష‌ల్ మీడియాలోనైతే ఈ వీడియో బాగా ట్రెండ్ అవుతోంది. అయితే గ‌తంలో రాంచ‌ర‌ణ్‌పై వ్యాఖ్య‌లు చేశాడ‌నే నాగ‌బాబు అంతలా ఆగ్ర‌హం చెందారు క‌దా, ఇక స్వ‌యానా త‌న అన్న చిరంజీవి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న షోపై యండ‌మూరి కామెంట్లు చేయ‌డంతో ఇప్పుడు నాగ‌బాబు ఇంకా ఎలా ఫైర్ అవుతారో, అస‌లు ప‌ట్టించుంటారో లేదో వేచి చూస్తే తెలుస్తుంది..!

Comments

comments

Share this post

scroll to top