మొత్తం 25 కార్లు ఒకదాన్ని ఒకటి గుద్దుకున్నాయ్, 3D గేమ్ కాదు పొగమంచు ఎఫెక్ట్!

ఒక కారు వెళ్లి ముందు ట్రక్ ను ఢీ  కొట్టింది. ఆ కారును మరో, ఈ కారును మరో కారు, దాని వెనుక ఉన్న కారును మరో కారు.. ఇలా ఒక దాని వెనుక ఉన్న కార్లు మొత్తం 25 డీ కొట్టుకుంటున్నాయి. ఇదేదే త్రీడీ వీడియో గేమ్ కాదు. నాలుగు రోజుల క్రితం యమునా ఎక్స్ ప్రెస్ వే జరిగిన దారుణ సంఘటన. ఈ ఘటనలో మొత్తం ముగ్గురు మృతి చెందారు. దీనికి కారణం అక్కడ కురుస్తున్న దట్టమైన పొగమంచే కారణం. ఉత్తరప్రదేశ్ లోని జెవార్ టోల్ ప్లాజా సమీపంలోని యమునా ఎక్స్ ప్రెస్ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఉదయం దట్టమైన పొగమంచు కారణంగా ముందు వెళ్తున్న ట్రక్ ను, వెనుకే వెళ్తున కారు డ్రైవర్ చూసుకోకపోవడంతో ట్రక్ ను ఢీ  కొట్టాడు. దాని వెనుకే వస్తున్న కార్లు ఒకదానికొకటి డీ కొట్టుకున్నాయి.

yamuna-expressway-accident

ఉదయం సమయంలో 50 మీ. దూరం విజిబిలిటీ మాత్రమే ఉండడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా చెబుతున్నారు. యుమునా ఎక్స్ ప్రెస్ రహదారిపై జరిగిన ఆ ప్రమదపు వీడియో, అక్కడ కార్లు ఢీ కొట్టుకున్న కార్లు చెల్లాచెదురుగా పడిఉన్నాయి.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top