యజమాని పెద్దకొడుకు ఆమెను ఎలా హింసించే వాడో తెలుసా..? అర్ధరాత్రి రూమ్ తలుపు కొట్టి, తీయకుంటే.

కుటుంబం కోసం ఎంత కష్టాన్నైనా భరించేందుకు సిద్ధమవుతారు. నా అనుకున్న వారందరినీ వదిలేసి ఎక్కడో ఎడారి దేశాలకు వలస వెళ్తుంటారు. కానీ అక్కడ పరిస్థితులు మొదట్లో ఉన్నంత అనుకూలంగా ఉండవు. కష్టాలే కదా పడదామనుకునేవాళ్లకు గల్ఫ్ దేశాల్లో ప్రత్యక్ష నరకం కనిపిస్తుంటుంది. చాలామంది గల్ఫ్ యజమానులు వలస కూలీల విషయంలో సానుకూలంగానే ఉన్నా.. కొంతమంది మాత్రం విపరీత దోరణిలో ప్రవర్తిస్తుంటారు. వలస వచ్చిన వారిని బానిసల్లా భావిస్తుంటారు. ఎంతో మంది భారతీయులు ఇలాంటి వారి నుంచి కష్టాలను ఎదుర్కొన్నారు. భరించలేక ప్రభుత్వ సాయంతో బయటకి వచ్చి ప్రాణాలు నిలుపుకున్నారు. తాజాగా దుబాయిలో మరో యజమాని వేదింపుల ఘటన ఒకటి బయటపడింది..


గతేడాది డిసెంబర్‌లో కన్సల్టెన్సీ మాటలు నమ్మి దుబాయికి వెళ్లిన ఓ తెలుగు మహిళ ప్రత్యక్ష నరకం అనుభవిస్తోంది. దుబాయిలోని షార్జాహ్‌లో ఓ ఇంట్లో పనిమనిషిగా కుదిరిన ఆమెకు.. యజమానుల నుంచి, కన్సల్టెన్సీ నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తన బాధలు భరించలేక ఓ వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాదాపు 60వేలు ఇస్తే విజిటర్ వీసాపై తనను దుబాయికి పంపారనీ, ఆ తర్వాత మరో లక్ష రూపాయలు కన్సల్టెన్సీకి ఇవ్వాలని చెప్పారని ఆమె తెలిపింది. వారం రోజులు పనిచేసి నచ్చితే ఉండు.. లేకుంటే భారత్‌కు రావొచ్చిని తనకు చెప్పారని ఆమె వాపోయింది. ‘దుబాయిలోని కన్సల్టెన్సీ నిర్వాహకులు పిలిచి డబ్బు అడిగారు. లేదని చెబితే చిత్ర హింసలు పెట్టారు. యజమాని, ఆమె భార్య కొట్టేవారు, తిట్టేవాళ్లు. నాతోపాటు ఉన్న ఫిలిప్పీన్ యువతుల్ని కూడా కొడుతున్నారు. వెళ్లిపోతా అని చెబితే.. 2 లక్షల రూపాయలు ఇచ్చి వెళ్లమంటున్నారు. నరకం అనుభవిస్తున్నా.. నన్ను కాపాడండి. యజమాని పెద్ద కొడుకు చాలా దారుణంగా ప్రవర్తించేవాడు. అర్ధరాత్రి ఒకటి, రెండు గంటల సమయంలో వచ్చేవాడు. నేను పడుకునే రూమ్ తలుపు కొట్టేవాడు. తీయకుంటే మరుసటి రోజు ఉదయం గొడవ చేసి కొట్టేవాడు. భరించలేకపోతున్నా’ అని ఆ మహిళ తన ఆవేదన వ్యక్తం చేసింది. తాను షార్జాహ్‌లో ఉండే ఇంటి అడ్రస్‌ను చెప్పింది. ఎలాగయినా తనను రక్షించాలని, భారత్‌కు పంపించాలని కోరింది.

 

Comments

comments

Share this post

scroll to top