భ‌క్తుల బాంధ‌వుడు – ల‌క్ష్మీ న‌ర‌సింహుడు -యాదాద్రి మ‌రో భ‌ద్రాద్రి

ఉగ్ర‌రూపుడైన ల‌క్ష్మీన‌ర‌సింహ్మ స్వామి కొలువై ఉన్న యాద‌గిరిగుట్ట ఇపుడు యాదాద్రిగా పిలువ‌బ‌డుతోంది. వేలాది మంది భ‌క్తులు స్వామి వారిని ద‌ర్శించుకుంటున్నారు. తెలంగాణ తిరుప‌తిగా వినుతికెక్కిన ఈ ఆల‌యానికి అద్భుత‌మైన చ‌రిత్ర ఉన్న‌ది..అత్యంత విశిష్ట‌మైన‌ది ఈ స్థ‌లం. ప్ర‌శాంత వాతావ‌ర‌ణాన్ని త‌ల‌పించేలా..హైద‌రాబాద్‌-విజ‌య‌వాడ ప్ర‌ధాన ర‌హ‌దారికి ప‌క్క‌నే ఉన్న ఈ ఆల‌యం గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఒక్క‌సారి ద‌ర్శించుకుంటే చాలు.జీవితాంతం గుర్తుండి పోయేలా ఆ ల‌క్ష్మీన‌ర‌సింహ్మ స్వామి మ‌నల్ని దీవిస్తూనే ఉంటాడు. ఇదో పేద‌ల తిరుమ‌ల‌గా విరాజిల్లుతోంది. ర‌వాణా సౌక‌ర్యం ఉండ‌డం..కేపిట‌ల్ సిటీకి ద‌గ్గ‌ర‌గా ఉన్న ఈ గుడి ప్ర‌తి నిత్యం పూజ‌ల‌తో..భ‌క్తుల తాకిడితో నిండిపోతోంది. న‌ల్ల‌గొండ జిల్లాలో ఉన్న ఈ ఆల‌యంలో న‌ర‌సింహ‌స్వామితో పాటు ల‌క్ష్మీదేవి కొలువై ఉన్నారు.

yadigirgutta lakshmi narasimha

ఎత్తైన గుట్ట‌లు..కొండ‌లు..చుట్టూ చెరువులు..ర‌హ‌దారులు..నియాన్ లైట్ల వెలుతురుతో యాదాద్రి భ‌క్తుల మ‌న‌సు దోచుకుంటోంది. స్థ‌ల పురాణ చ‌రిత్ర ప‌రంగా చూస్తే యాద మ‌హ‌ర్షి ఈ గుట్ట‌పై త‌పస్సు చేశాడు. అప‌ర భ‌క్తుడైన ఈ మ‌హ‌ర్షి భ‌క్తికి మెచ్చిన న‌ర‌సింహ‌స్వామి ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాడు. నీకు ఏం కావాల‌ని కోరుకో అని అడిగితే నాకేమీ వ‌ద్దు ..స్వామీ మీరు ఇక్క‌డే ఉండండి నాలాంటి వారితో పాటు నిత్యం పూజ‌లు అందుకునేలా..చేసేలా భ‌క్తుల కోసం కొలువుతీరండి అని కోరాడ‌ని చ‌రిత్ర‌. యాద మ‌హ‌ర్షి కోరిక‌ను మ‌న్నించి లక్ష్మీ న‌ర‌సింహ్మ స్వామి గుడి ద‌గ్గ‌ర కొలువై ఉన్నాడు. యాద‌గిరిలో క్షేత్ర‌పాల‌కుడిగా వినుతికెక్కాడు. ఈ పుణ్య‌క్షేత్రానికి ఇంకో కథ కూడా నానుడిలో ఉన్న‌ది. ప్ర‌హ్లాదుడిని ర‌క్షించేందుకు అహోబిలంలో న‌ర‌సింహ్మ‌స్వామి స్తంభాన్ని చీల్చుకు వ‌చ్చి హిర‌ణ్య క‌శ్య‌పుడిని చంపిన త‌ర్వాత ఆ భీక‌ర రూపాన్ని శాంత ప‌రచ‌డం ఎవ‌రి త‌రం కాలేద‌ని ..దేవ‌త‌లంతా ల‌క్ష్మీదేవిని ప్రార్థిస్తే ఆమె ప్ర‌త్య‌క్ష‌మై స్వామి వారిని శాంతింప చేసింద‌ని ..మ‌రో క‌థ ప్ర‌చారంలో ఉన్న‌ది. భీక‌ర రూపంలో ద‌ర్శ‌న‌మిచ్చిన స్వామి వారు ఆ స్థ‌లంలో ఉండ‌డం భావ్యం కాద‌ని..లోక క‌ళ్యాణార్థం యాద‌గిరిలో ల‌క్ష్మీ స‌మేతుడై కొండ‌పై వెలిశాడ‌ని మ‌రో క‌థ ప్రాచుర్యంలో ఉన్న‌ది. ఆ మ‌హోగ్ర‌రూపం వెంట ప్ర‌హ్లాదుడు, స‌క‌ల దేవ‌త‌లు వ‌చ్చి ఇక్క‌డ కొలువుతీరి..స్వామి వారిని సేవిస్తూ వ‌చ్చార‌న్ని ఇక్క‌డి ప్ర‌జ‌ల న‌మ్మ‌కం. స్వామి వారికి ఉన్న శంఖ చ‌క్రాలు విశిష్ట‌మైన‌వి.

రాక్ష‌స సంహారం చేసిన ల‌క్ష్మీ న‌ర‌సింహుడి కాళ్ల‌ను బ్ర‌హ్మ‌దేవుడు ఆకాశ గంగ‌తో క‌డిగాడ‌ని, గంగ లోయ లోంచి పారి..విష్ణు పుష్క‌రిణిలోకి చేరింద‌ని..దానికి కూడా ప్రాముఖ్య‌త ఉంద‌ని భ‌క్తుల విశ్వాసం. యాద‌గిరిగుట్ట‌లోని పుష్క‌రిణిలో స్నానం చేసి స్వామి వారిని సేవిస్తే కోరిన కోర్కెలు తీరుతాయ‌ని..పితృకార్యాలు చేస్తే పితృ దేవ‌త‌లు త‌రిస్తార‌ని కూడా ప్ర‌తీతి. ఆల‌య ప్రాంగ‌ణంలో ఉన్న మండ‌పం కూడా ప్ర‌సిద్ది. భ‌క్తులు, యోగులు, రుషులు, స్వాములు ఇక్క‌డే కొలువై కొలుస్తారు. మెట్ల మార్గాన వెళ్లే తోవ‌లో శివాల‌యం క‌న‌బ‌డుతుంది. ఇక్క‌డ శివుడు స్వామి వారికంటే ముందు స్వ‌యంభూగా వెలిశాడు. ఈ మెట్లు ఎక్కి న‌ర‌సింహుడిని ద‌ర్శించుకుంటే కీళ్ల నొప్పులు త‌గ్గుతాయ‌ని భ‌క్తుల న‌మ్మ‌కం. రాయ‌గిరి రైల్వే స్టేష‌న్ ద‌గ్గ‌ర‌లోనే స్వామి వారి ఆల‌యం ఉన్న‌ది.

సుదూర ప్రాంతాల నుంచి వ‌చ్చే భ‌క్తుల కోసం స‌త్రాలు, గ‌దులు ఉన్నాయి. సామాన్యుల నుండి డ‌బ్బున్న వాళ్ల దాకా అంతా యాదాద్రిని ద‌ర్శించుకుంటారు. నిత్య పూజ‌ల‌తో పాటు ప్ర‌తినిత్యం అన్న‌దానం జ‌రుగుతోంది. ఆల‌యం ప్ర‌త్యేకంగా క‌ళ్యాణం నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేసింది. కొన్ని త‌రాల‌పాటు యాద‌గిరిగుట్ట‌గా పిలువబ‌డుతున్న ఈ ఆల‌య పేరును కేసీఆర్ కోరిక మేర‌కు .శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన‌జీయ‌ర్ స్వామి ..యాదాద్రిగా మార్చేశారు. అప్ప‌ట్లో దుమారం రేగింది. కానీ యాదాద్రి ఆల‌య అభివృద్ధి సంస్థ పేరుతో భారీ ఎత్తున నిధులు కేటాయించారు. ప‌నులు యుద్ధ ప్రాతిప‌దిక‌న జ‌రుగుతున్నాయి. మ‌రో తిరుప‌తిగా మార్చాల‌న్న సంక‌ల్పం ఈ సీఎంది. శిల్ప‌క‌ళా నైపుణ్యం ఉట్టి ప‌డేలా..భ‌క్తుల కొంగుబంగారంగా వినుతి కెక్కేలా ..ఎప్ప‌టిక‌ప్పుడు శ్రీ స్వామి వారి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఈ ఆల‌యం రూపుదిద్దుకొంటోంది. ల‌క్ష‌లాది మంది భ‌క్తుల‌కు దీవెన‌లు అంద‌జేస్తోంది.

ఉగ్ర‌రూపం ఎలా ఉంటుందో..శాంత స్వ‌రూపం ఎలా ఉంటుందో..తెలుసు కోవాల‌ని ఉందా..అయితే యాదాద్రిలో కొలువై ఉన్న ల‌క్ష్మీ స‌మేతుడైన ..కోరిక‌లు తీర్చే ..న‌ర‌సింహ‌స్వామి వారిని ద‌ర్శించుకోండి. జ‌న్మ ధ‌న్య‌మ‌వుతుంది. మీరు చేసిన పాపాలు..త‌ప్పులు ..మాయ‌మై పోతాయి. మీరు మామూలు మ‌నుషులై మ‌ళ్లీ కొత్త జీవితాల‌ను ప్రారంభిస్తారు. ఆ స్థ‌లానికి అంత‌టి శ‌క్తి ఉన్న‌ది. యాద‌గిరిగుట్ట‌..తెలంగాణ‌కే త‌ల‌మానికం. నాలుగున్న‌ర కోట్ల ప్ర‌జ‌ల హృద‌య నాదం.

Comments

comments

Share this post

scroll to top