ల‌క్ష‌ల జీతం వ‌చ్చే కార్పోరేట్ ఉద్యోగాన్ని వొదులుకొని…ఇండియ‌న్ ఆర్మీలో జాయిన్ అయ్యాడు.!?

ఇంజ‌నీరింగ్ పూర్తికాగానే…పేరుమోసిన అమెరికా కంపెనీ నుండి జాబ్ ఆఫ‌ర్ వ‌చ్చింది. ప్యాకేజ్ ల‌క్ష‌ల్లో ఉంటుంద‌ని తెలిపింది. మ‌రో వైపు ప్ర‌తిష్టాత్మ‌క IIM లో సీటు వ‌చ్చింది.! రోజూ కూలీ  ప‌ని చేసి తండ్రి సంపాదించే 100 రూపాయ‌లతో గ‌డుస్తున్న కుటుంబం త‌న‌ది.. ఈ సంద‌ర్భంలో ఎవ‌రైనా… ఏం చేస్తారు.? మ‌రో ఆలోచ‌న లేకుండా అమెరికా జాబ్ లో జాయిన్ అయిపోతారు.! కానీ హైద్రాబాద్ ఐఐటిలో ఇంజ‌నీరింగ్ చ‌దివిన యాద‌గిరి అలా చేయ‌లేదు…. దేశం కోసం ఏదైనా చేయాల‌ని ఆలోచించాడు… త‌న చ‌దువును, మేధ‌స్సును దేశ ర‌క్ష‌ణ‌కోసం ఉప‌యోగించాల‌ని ఫిక్స్ అయిపోయాడు.! ఇండియ‌న్ ఆర్మీలో జాయిన్ అయ్యాడు.

డిసెంబ‌ర్ 9 న జ‌రిగిన ఇండియ‌న్ ఆర్మీ పాసింగ్ పేరేడ్ లో….ట్రైనింగ్ లో భాగంగా అన్ని విభాగాల్లో మెరిట్ సాధించిన యాద‌గిరికి సిల్వ‌ర్ మెడ‌ల్ ద‌క్కింది. ఈ సంద‌ర్భంగా కొన్ని మీడియా ఛాన‌ల్స్ యాద‌గిరితో ముచ్చ‌టించ‌గా..అత‌ని గొప్ప నిర్ణ‌యం గురించి తెలిసింది.

అమెరికాలో ఉద్యోగం, అంతా ఏసి…ల‌క్ష‌ల్లో జీతం…బోన‌స్ లు, ఇంక్రిమెంట్లు…ఇవ్వ‌న్నీ కాద‌ని….త‌న మేద‌స్సును దేశ ర‌క్ష‌ణ కోసం ఉప‌యోగించాల‌నే ఉద్దేశ్యంతో…ఇండియ‌న్ ఆర్మీలో చేరిన యాద‌గిరి క‌మిట్మెంట్ కు…. హ్యాట్సాప్ చెప్పాల్సిందే.!

నాకేంటి..? అనే ట్రెండ్ న‌డుస్తున్న ఈ కాలంలో…నానుండి దేశానికేంటి?? అనే ఆలోచ‌న చేసిన యాద‌గిరి నిజంగా భార‌త‌మాత ముద్దుబిడ్డే.!

Comments

comments

Share this post

scroll to top