మొబైల్ మార్కెట్లో మనోడే దిగ్గజం

ప్రపంచ వ్యాపార రంగంలో భారతీయులు టాప్ పొజిషన్ లో వుంటున్నారు . ఇప్పటికే మొబైల్ తయారీ మార్కెట్ లో చైనా అందనంత దూరంలో ఉన్నది . ఇతర దేశాలకు దిమ్మ తిరిగేలా షాక్ లు ఇస్తూ కోలుకోలేకుండా చేస్తోంది . ఓ వైపు ఆపిల్ ఇంకో వైపు సాంసంగ్ మొబైల్స్ కు పోటీగా చైనా మొబైల్స్ ఇండియన్ మార్కెట్ ను ఆక్రమించేశాయి . దీంతో చైనాను నిలువరించేందుకు భారతీయ స్మార్ట్ ఫోన్ల తయారీదారులు నానా తంటాలు పడుతున్నారు . మైక్రో మాక్స్ , ఇంటెక్స్ ..తదితర కంపెనీలు మార్కెట్లో ఉన్నా ఆశించినంత అమ్మకాలు సాగడం లేదు . చైనా మొబైల్స్ కంపెనీలలో వివో ..ఒప్పో తో పాటు రెడ్ మీ స్మార్ట్ ఫోన్లు రికార్డ్ స్థాయిలో అమ్ముడవుతున్నాయి. తయారీలోనూ ..సెల్ఫీ క్లారిటీ ,,బ్యాటరీ ..ఎక్కువ ఫీచర్స్ ..ఉండడంతో ఈ మొబైల్స్ ను యూత్ ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు .

దీంతో ఊహించని రీతిలో చైనా మొబైల్స్ కంపెనీలకు లెక్కించంలేనంత ఆదాయాం సమకూరుతోంది . ఓ వైపు వివో కంపెనీ ఏకంగా అత్యంత ఖరీదైన టోర్నమెంట్ ఐపిల్ టోర్నీని స్పాన్సర్ చేస్తోంది . దీనిపైనే ఏకంగా ఈ కంపెనీ కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది. భారతీయ వ్యాపార రంగంలో తమ వాటాను కలిగి ఉన్న విదేశీ కంపెనీలకు కోలుకోని షాక్ ఇచ్చారు ఇండియన్ కు చెందిన మనోజ్ కుమార్ జైన్ . ప్రతి సామాన్యుడి చేతిలో ఉండాలన్న లక్ష్యంతో జైన్ ప్లాన్ సిద్ధం చేశారు .దేశ వ్యాప్తంగా ప్రతి చోటా రెడ్ మీ స్మార్ట్ ఫోన్లు లభించేలా చేశారు . మార్కెట్ రంగాన్ని ఒక రకంగా పరుగులు పెట్టించారు జైన్. అతి తక్కువ ధరలో అన్ని ఫీచర్స్ ఉండేలా ఏర్పాటు చేశారు . ఇతర కంపెనీలు స్టోర్లు లేకుండా ఆన్ లైన్ లో విక్రయం చేస్తుంటే రెడ్ మీ మొబైల్స్ మాత్రం అందరికి అందుబాటులో ఉండేలా స్టోర్ రూమ్ లు ఏర్పాటు చేశారు .

ఆకర్షణీయమైన డిజైన్లతో ..ఆకట్టుకునే సర్వీస్ తో ..డిఫరెంట్ మోడల్స్ తో స్టోర్స్ జనాన్ని ..అంతకంటే యువతీ యువకులను ఆకట్టుకుంటున్నాయి . ఇండియన్ మొబైల్స్ మార్కెట్ ను ఒక రకంగా జైన్ ఒంటి చేత్తో తన చెప్పు చేతుల్లోకి తెచ్చుకున్నాడు. అంతకు ముందు ఈ ఇండియన్ ఈ కామర్స్ రంగంలో ఇప్పటికే జొబంగ్ రికార్డ్ లు తీరుగా రాసింది . ఈ భారతీయుడు తీసుకున్న నిర్ణయాలు .. చేపట్టిన మార్పులు రెడ్ మీ స్మార్ట్ ఫోన్లు అమ్మకాల్లో దుము రేపాయి . ఆపిల్ ..శాంసంగ్ మొబైల్స్ కంటే ఎక్కువగా ..అత్యధికంగా అమ్ముడు పోయి వసూళ్ళలో రికార్డులు సృష్టించేలా చేశాడు జైన్. లాభాలు మాకు ప్రయారిటీ కాదు . కస్టమర్లే దేవుళ్ళు .. మా స్టోర్ రూమ్ కు వచ్చే ప్రతి వినియోగదారుడు ఏదో ఒక దానిని కొనుగోలు చేసేలా ఉండాలి అంటారు జైన్ .

కస్టమర్లు సంతృప్తి చెందితే ఆదాయం అదంతకు అదే సమకూరుతుంది అంటారు . రెడ్ మీ స్మార్ట్ ఫోన్లే కాదు ..ఏకంగా ఆక్సెస్సరీస్ ..షియోమీ టీవీలు స్టోర్ రూమ్ లలో ఏర్పాటు చేశారు . లక్షల్లో ఉండే టీవీల ధరల కంటే రెడ్ మీ టీవీల అమ్మకాలు భారీ ఎత్తున పెరిగాయి . ఇది కూడా రికార్డ్ . మొబైల్స్ తో పాటు టీవీలలో రెడ్ మీ సృష్టించిన సునామి కి దిగ్గజ మొబైల్స్ కంపెనీలన్నీ డీలా పడ్డాయి . దీని వెనుక మనోడి ప్లాన్ ఉంది ..కష్టం దాగి ఉంది . త్వరలో భారతీయలు అంతా ఇక్కడే కొనుగోలు చేసేలా చేస్తామంటున్నారు జైన్ . సక్సెస్ అంటే డబ్బులు కాదు ..సక్సెస్ అంటే అందరిని మెప్పించడం . వస్తువును కొనేలా చేయడం . జైన్ లో కిక్ ఉంది ..దానికో లెక్కుంది కదూ..

Comments

comments

Share this post

scroll to top