రామ‌న్ రాణించేనా – స‌మ‌స్య స‌ద్దు మ‌ణిగేనా- ముందుంది ముస‌ళ్ల పండ‌గ

ఇండియాలో క్రికెట్ ఆట‌కు ఉన్నంత క్రేజ్ .ఈ దేశ ప్ర‌ధానికి ఉండ‌దు. ఈ దేశానికి క‌ర‌వు వ‌స్తే దానిని అధిగ‌మించేందుకు కావాల్సిన నిధుల‌న్నీ భార‌త క్రికెట్ కంట్రో ల్ బోర్డు ద‌గ్గ‌ర ఉన్నాయంటే అర్థం చేసుకోవ‌చ్చు .అదెంత ఆదాయాన్ని స‌మ‌కూర్చి పెట్టుకుందో. ప్ర‌పంచ క్రికెట్ కౌన్సిల్ ను కూడా శాసించే స్థాయికి చేరుకుంది బీసీసీఐ. టీవీ రంగంలో ప‌ట్టు క‌లిగిన సోని ఎంట‌ర్ టైన్ మెంట్ కంపెనీ లిమిటెడ్ ఏకంగా ప్ర‌సార హ‌క్కుల‌ను 1000 కోట్ల‌కు చేజిక్కించుంది. ఇండియ‌న్ హిస్ట‌రీలో ఇదో రికార్డు. మెన్స్ క్రికెట‌ర్స్‌కు ఎక్క‌డ‌లేని క్రేజ్.ఊహించ‌ని ఆద‌ర‌ణ‌. యాడ్స్, స్పాన్స‌ర్స్, కంపెనీల లోగోలు, దుస్తులు, బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా వంద‌ల కోట్లు వెన‌కేసుకుంటున్నారు. ఐపీఎల్ పుణ్య‌మా అంటూ గ‌ల్లీ క్రికెట‌ర్లు కూడా క‌రోడ్‌ప‌తులు అయిపోయారు. విప‌రీత‌మైన క్రేజ్ స్వంతం చేసుకున్న ఈ ఆట‌పై ఇపుడు ప్ర‌భుత్వ ఆజ‌మాయిషీ లేకుండా పోయింది. ఎన్నో రాజ‌కీయాలు.మ‌రెన్నో ఆరోప‌ణ‌లు అయినా క్రికెట్ .క్రికెట్టే. ఉమెన్స్ క్రికెట్ విష‌యానికి వ‌స్తే.మిథాలీరాజ్ వ‌న్డే జ‌ట్టుకు కెప్టెన్‌గా ఉన్నారు. ఇటీవ‌ల కోచ్ పొవార్ పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ఆయ‌న‌కు మ‌ద్ధ‌తుగా డ‌యానా ఎడుల్జీ తో పాటు మ‌రో క్రీడాకారిణి వాయిస్ పెంచారు.

wv raman

అయినా బీసీసీఐ చీఫ్ ప్ర‌సాద్ వినిపించు కోలేదు. ఆయ‌న కాంట్రాక్టు గ‌డువును పొడిగించ‌లేదు. మిథాలీ .పొవార్ ల మ‌ధ్య పెద్ద యుద్ధ‌మే న‌డిచింది. త‌న‌ను కావాల‌నే ప‌క్క‌న పెట్టార‌ని.దీని వెనుక డ‌యానా ఉంద‌ని ఆమె తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ఈ విష‌యాన్ని ఈమెయిల్ ద్వారా బీసీసీఐ పెద్ద‌ల‌కు విన్న‌వించారు. ఆ త‌ర్వాత మీడియాకు ఎక్కారు. దీంతో దేశ వ్యాప్తంగా పెద్ద చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కోట్లాది రూపాయ‌ల‌తో కూడుకున్న బీసీసీఐకి పెద్ద స‌వాల్ గా మారింది. కోచ్‌ల ఎంపిక విష‌యం పెద్ద త‌ల‌నొప్పిగా ప‌రిణ‌మించింది. పొవార్‌ను సాగ‌నంపేందుకే నిర్ణ‌యించింది. మ‌హిళా క్రికెట్ జ‌ట్టుకు కొత్త కోచ్ ను ఎంపిక చేసే బాధ్య‌త‌ను ముగ్గురు మాజీ క్రికెట‌ర్ల‌తో కూడిన క‌మిటీని ఏర్పాటు చేసింది. ఇండియ‌న్ మాజీ కెప్టెన్ క‌పిల్‌దేవ్ నిఖంజ్, అంశుమ‌న్ గైక్వాడ్, శాంతా రంగ‌స్వామిలు ఈ క‌మిటీలో స‌భ్యులుగా ఉన్నారు. వీరు ప్ర‌పంచ వ్యాప్తంగా కోచ్ కావాలంటూ ప్ర‌క‌టించారు. ఇందుకు 25 మంది క్రికెట‌ర్లు కోచ్‌గా ఉండేందుకు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. వాట‌న్నింటిని కూలంకుశంగా ప‌రిశీలించి.చివ‌రికి కోచ్ కోసం ఇద్ద‌రిని ఎంపిక చేసింది.

అందులో ఇండియా నుండి మాజీ క్రికెట‌ర్, బ్యాట్స్‌మెన్ గా పేరున్న ఎం.వి.రామ‌న్‌, ద‌క్షిణాఫ్రికా మాజీ ఆట‌గాడు గ్యారీ కిర‌స్ట‌న్‌ను సూచిస్తూ బీసీసీఐకి అంద‌జేసింది. డ‌యానా ఎడుల్జీ మాత్రం పొవార్‌కే తిరిగి కోచ్ ప‌ద‌వి ఇవ్వాల‌ని, న్యూజిలాండ్ టూర్ వ‌ర‌కైనా కొన‌సాగించాల‌ని ప‌ట్టుప‌ట్టింది. ఈ మేర‌కు ఏకంగా మెయిల్ కూడా పంపించింది. అయినా బీసీసీఐ పెద్ద‌లు, చీఫ్ ప్ర‌సాద్ ఒప్పుకోలేదు. స‌వాల‌క్ష రాజ‌కీయాల‌తో ఇప్ప‌టికే చిన్న‌పాటి స‌మ‌స్య‌ను పెద్ద‌గా చేసి నానా రాద్ధాంతం సృష్టించిన వీరికి ప్ర‌యారిటీ ఇవ్వ‌కుండా నేరుగా డిసిష‌న్ తీసుకున్నారు. అంతా కిర‌స్ట‌న్ వైపు మొగ్గు చూపినా వారంద‌రిని కాద‌ని ఎం.వి. రామ‌న్‌కు కోచ్ బాధ్య‌త‌లు అప్ప‌గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో డ‌యానా ఎడుల్జీ మిన్న‌కుండి పోయారు. అటు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ‌, ఇటు కేంద్ర ప్ర‌భుత్వం ఉమెన్స్ క్రికెట్ విష‌యంలో త‌లెత్తిన వివాదాన్ని సాధ్య‌మైనంత త్వ‌ర‌లో ప‌రిష్క‌రించాల‌ని బీసీసీఐకి సూచించింది. అంటే స‌మ‌స్య ఎంత పెద్ద‌దైందో అర్థం చేసుకోవ‌చ్చు. భార‌త్ త‌ర‌పున రామ‌న్ 11 టెస్టులు, 27 వ‌న్డేలు ఆడారు. గ‌తంలో త‌మిళ‌నాడు, బెంగ‌లూరు జ‌ట్టుకు కోచ్ గా వ్య‌వ‌హ‌రించారు. 1982-83 కాలంలో మంచి ఆట‌గాడుగా గుర్తింపు పొందారు.

అండ‌ర్ -19 టీంకు కూడా సేవ‌లు అందించారు. ద‌క్షిణాఫ్రికాలో తొలి సెంచ‌రీ సాధించిన క్రికెట‌ర్‌గా చ‌రిత్ర సృష్టించారు. మ‌నోజ్ ప్ర‌భాక‌ర్, జాన్స‌న్‌, దిమిత్రి, బ్రాడ్ హాగ్, క‌ల్ప‌నా వెంక‌ట‌రామ‌న్‌ల‌ను కూడా ఎంపిక క‌మిటీ ఇంట‌ర్వ్యూ చేసింది. రామాన్, ప్ర‌భాక‌ర్, ర‌మేష్ పొవార్ లు వ్య‌క్తిగ‌తంగా హాజ‌రు కాగా.కిరెస్ట‌న్‌తో పాటు మ‌రో ఐదుగురు స్కైప్ ద్వారా , ఒక‌రు ఫోన్ ద్వారా ఇంట‌ర్వూకు హాజ‌ర‌య్యారు. కిరెస్టిన్ ఆధ్వ‌ర్యంలో 2011లో భార‌త జ‌ట్టు వ‌ర‌ల్డ్ కప్ సాధించింది. కిరెస్ట‌న్ కు ప్రాధాన్య‌త ఇచ్చినా ఎందుక‌నో రామ‌న్ వైపే మొగ్గు చూపింది బీసీసీఐ. రామ‌న్ ఎంపిక స‌రైన‌దేన‌ని బోర్డు స్ప‌ష్టం చేసింది. పొవార్‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఆయ‌న‌ను పూర్తిగా ప‌క్క‌న పెట్టేశారు. కోచ్ ఎంపిక ప్ర‌క్రియ‌పై వినోద్ రాయ్‌ను, బీసీసీఐ కోశాధికారి అనిరుధ్ చౌద‌రిని స‌భ్యురాలు డ‌యానా నిల‌దీశారు.

ఇప్ప‌టికే మ‌హిళా క్రికెట్ జ‌ట్టులో విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఒక‌రిపై మ‌రొక‌రు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. మిథాలీ రాజ్ కు భారీ ఎత్తున మ‌ద్ధ‌తు ల‌భించింది. ముదిరి పాకాన ప‌డిన ఈ స‌మ‌స్య‌ను ఎట్లా ప‌రిష్క‌రిస్తార‌నేది కొత్త కోచ్ ఎం.వి. రామ‌న్‌పైనే ఉంది. కోచ్ గా ప‌ని చేయ‌డం వేరు.మ‌హిళ‌ల మ‌ధ్య నెల‌కొన్న ఆధిప‌త్య పోరును ప‌రిష్క‌రించ‌డం వేరు. కోట్లాది రూపాయ‌లు క‌లిగిన బీసీసీఐపై కోట్లాది క‌ళ్లు ప‌రిశీలిస్తూనే ఉంటాయి. ఎంతో అనుభ‌వం క‌లిగిన క‌పిల్‌దేవ్, గ‌వాస్క‌ర్, అజారుద్దీన్‌ల సేవ‌లు వినియోగించుకుంటే బావుండేద‌న్న అభిప్రాయం అభిమానుల్లో వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డం ప‌రుగులు చేసినంత ఈజీ కాద‌న్న‌ది రామ‌న్‌కు తెలిసే ఉంటుంది.

Comments

comments

Share this post

scroll to top