రామ్ దేవ్ బాబా..పతంజలి ప్రొడక్ట్స్ చేసిన జిమ్మిక్స్. !? ఇదేంటి బాబా ఇలా?

రామ్ దేవ్ బాబా  పతంజలి ప్రొడక్ట్స్ ఒక్కసారిగా వార్తల్లోని అంశాలుగా మరాయి.  తప్పుడు డేట్స్ ను ముద్రించారంటూ దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.  ఇటీవలే దేశవ్యాప్తంగా మార్కెట్‌లోకి అట్టహాసంగా ప్రవేశించిన బాబా రాందేవ్ పతంజలి ఉత్పత్తులైనే ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆరోగ్యం గురించి యోగా గురించి అన్ అపీషియల్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న  రామ్ దేవ్ బాబా సొంత సంస్థ ఇలా తప్పుడు తేదీలను ముద్రించడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
Pat-750x500
సాధారణంగా ఏ సంస్థ అయినా ఏదైనా ఉత్పత్తిని తయారు చేస్తే దాని తయారీ తేదీ, గడువు తేదీలను తప్పనిసరిగా ఆ ప్యాకింగ్‌పై ముద్రిస్తుంది. అయితే పతంజలి వారు మాత్రం తమకు చెందిన ఆవ్లా మురబ్బా అనే ఉత్పత్తిపై ఎప్పుడో రానున్న అక్టోబర్ 20, 2016 తేదీని ముద్రించారు. మరి దాని గడువు తేదీ ఎంత వేశారో తెలుసా, అక్టోబర్ 19, 2017 అట. కల్యాణ్‌పుర్ రింగ్ రోడ్ సమీపంలోని ఓ రిటెయిల్ షాప్‌లో ఇలా ఉత్పత్తి తేదీ, గడువు తేదీ తప్పుగా ఉన్న 1 కిలో బరువు గల రెండు ఆవ్లా మురబ్బా ప్యాక్‌లను అక్కడి డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ అధికారులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు.
కేవలం అక్కడే కాదు, సదరు ఆవ్లా మురబ్బా ప్యాక్‌లు దేశమంతటా ఇప్పుడు అన్ని మార్కెట్‌లలోనూ దొరుకుతున్నాయి. అయితే వాటిని కొనేముందు మాత్రం జాగ్రత్త. ఎందుకంటే మీరు కొన్న సదరు మురబ్బా ప్యాక్‌పై కూడా తేదీలు పై లాగే తప్పుడుగా ముద్రించబడి ఉండొచ్చు. ఇక చివరిగా ఒక మాట. యోగా గురువైనా, అనిల్ అంబానీ అయినా వ్యాపారం విషయానికి వస్తే అందరూ ఒకే విధంగా ప్రవర్తిస్తారనడానికి ఉదాహరణగా నిలుస్తుందీ సంఘటన. కాబట్టి నాణ్యత, స్వచ్ఛత, ఆయుర్వేదం అంటూ మోసపూరిత మాటలు చెప్పే విదేశీ కంపెనీ అయినా, స్వదేశీ కంపెనీ అయినా దేని మాటలకు ఆకర్షితులు కాకండి. వారిని నమ్మకండి. మీకు పూర్తి భరోసా ఉంటేనే ఆయా ఉత్పత్తులను కొనుగోలు చేయండి.

Comments

comments

Share this post

scroll to top