ప్రశ్నాపత్రంలో ఆ ప్రశ్న చూసి 10 వ తరగతి విద్యార్థులు షాక్..! అసలే ఎగ్జామ్స్ అని సినిమాలు, క్రికెట్ చూడరు.!

విద్యార్ధులకు నిర్వహించే బోర్డ్ ఎగ్జామ్స్ క్వచ్చన్ పేపర్లలో అడుగుతున్న ప్రశ్నలు మరీ వింతగా కనిపిస్తున్నాయి. సిలబస్ కు సంబంధించిన ప్రశ్నలు అడగడం మానేసి.. కాంట్రవర్సీ క్వచ్చన్స్ అడుగుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్ లో మంగళవారం (మార్చి 13) పదో తరగతి ఇంగ్లీష్‌ పరీక్ష రాసిన విద్యార్ధులకు ఇలానే ఓ విచిత్ర ప్రశ్న ఎదురైంది.


‘విరాట్‌ కోహ్లీ గురించి రాయండి’ అని ఓ ప్రశ్న విద్యార్దులకు కనిపించింది. దీంతో ఆశ్యర్యయానికి గురయ్యారు స్టూడెంట్స్. ఎగ్జామ్స్ అంటేనే సినిమాలు, క్రికెట్ బంద్ చేసి మరీ ప్రిపేర్ పుస్తకాలు చదివేశాం.. ఇప్పుడు క్రికెటర్ గురించి రాయమంటే ఎలా అంటూ తలగొక్కున్నారు స్టూడెంట్స్. అందులోనూ 10 మార్కుల క్వశ్చన్ అది.

మొదట్లో తడబడినా.. క్రికెట్ అనుభవం ఉంది కాబట్టి ఎవరికి తోచిన విధంగా వాళ్లు రాసేశారు స్టూడెంట్స్. ఓ విద్యార్ధి అయితే.. అతను నా ఐడల్‌ అని.. అతని గురించి తెలియని వారు ఎవరుంటారంటూ చరిత్ర రాసేశాడంట. మరో విద్యార్థి మాట్లాడుతూ.. కోహ్లీ గురించి పేపర్లకి పేపర్లు నింపేశాం.. 10కి.. 10 మార్కులు వస్తాయ్ అంటూ ఆనందంగా చెప్పాడు. కోహ్లీ గురించి పరీక్షల్లో ప్రశ్న అడగడం బాగుందని.. ఇలాంటి ఆలోచనలకు మద్దతు ఇవ్వాలి అంటూ ఈ విషయాన్ని వెనకేసుకొచ్చాడు భారత మాజీ క్రికెటర్‌ లక్ష్మి రతన్‌ శుక్లా. భవిష్యత్లో ఈ విధంగానే క్రీడాకారులపై ప్రశ్నలు అడిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.

అయితే అదేదో ముందుగా చెబితే బాగుందని.. టెక్ట్స్ బుక్స్ కూడా క్రీడాకారుల జీవితాలను పెడితే బాగుంటుంది కదా అంటున్నారు పేరంట్స్. ఊహించని ఇలాంటి ప్రశ్నలతో పిల్లలను గందరగోళానికి గురిచేయొద్దని అంటున్నారు.

Comments

comments

Share this post

scroll to top