ఏమేం ఫ‌లితాలు క‌ల‌గాలంటే ఎలాంటి ఆంజ‌నేయ స్వామి ప‌టాన్ని పూజించాలో తెలుసా..?

హ‌నుమంతుడు… ఆంజ‌నేయ స్వామి… ఎలా పిలిచినా ఆ స్వామి అంటే చాలా మంది భ‌క్తుల‌కు న‌మ్మ‌కం. అన్ని ఆప‌ద‌ల నుంచి త‌మ‌ను హ‌నుమ ర‌క్షిస్తాడ‌ని భ‌క్తులు విశ్వసిస్తారు. అందులో భాగంగానే చాలా మంది మంగ‌ళ‌వారం ఆంజ‌నేయ స్వామికి పూజ‌లు చేస్తారు. కొంద‌రైతే ఆ రోజు ఉప‌వాసం కూడా ఉంటారు. మ‌ద్యం, మాంసం ముట్ట‌రు. నిష్ట‌గా ఉంటారు. అయితే ఆంజ‌నేయ స్వామిని పూజిస్తే భ‌క్తుల‌కు మంచి జ‌రుగుతుంద‌ని తెలుసు, కానీ… వివిధ రూపాల్లో, వివిధ సంద‌ర్భాల్లో చిత్ర ప‌టాల రూపంలో ఉన్న ఆంజ‌నేయ స్వామిని పూజిస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా..? అదే ఇప్పుడు చూద్దాం…

hanuman-photo-1

సూర్య భ‌గ‌వానునికి న‌మ‌స్క‌రిస్తున్న హ‌నుమంతుడు…
హ‌నుమంతుడు సూర్యునికి న‌మ‌స్కారం చేస్తున్న‌ట్టుగా ఉండే చిత్ర‌ప‌టాన్ని పూజిస్తే దాంతో భ‌క్తుల‌కు అంతులేని జ్ఞానం సిద్ధిస్తుంది. తెలివిమంతులు అవుతారు. అన్నింటా విజ‌యాలు సాధిస్తారు. విద్యార్థులైతే చ‌దువుల్లో, వ్యాపారులైతే త‌మ రంగంలో ముందుకు దూసుకెళ్తారు.

రామునికి మొక్కుతూ…
శ్రీ‌రాముని పాదాల‌ను మొక్కుతూ ఉండే హ‌నుమంతుని చిత్ర‌ప‌టాన్ని పూజిస్తే భ‌క్తులకు వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు, ఉద్యోగ స‌మస్య‌లు ఉండ‌వు. అవి ఉన్నా సుల‌భంగా పరిష్కార‌మ‌వుతాయి.

భ‌జ‌న చేస్తూ…
హనుమంతుడు భ‌జ‌న చేస్తున్న‌ట్టుగా ఉండే చిత్ర‌ప‌టాన్ని పూజిస్తే భ‌క్తుల‌కు అనుకున్న కోర్కెలు తీరుతాయి. పెట్టుకున్న ల‌క్ష్యాలు నెర‌వేరుతాయి. ఉన్న‌త స్థానాల‌కు చేరుకుంటారు.

lanka-dahan

లంకను ద‌హ‌నం చేస్తూ…
లంక‌ను ద‌హ‌నం చేస్తున్న‌ట్టుగా ఉండే హ‌నుమంతుడి చిత్ర ప‌టాన్ని పూజిస్తే భ‌క్తుల‌కు ధైర్య సాహ‌సాలు వ‌స్తాయి. భ‌యం పోతుంది. దుష్ట పీడ‌లు ఎదుర్కొంటున్న వారు ఇలాంటి హ‌నుమంతుని ప‌టానికి పూజ చేస్తే ఫ‌లితం ఉంటుంది.

lord-hanuman

ఉత్త‌రం వైపుగా…
ఉత్త‌రం దిక్కుగా ముఖం పెట్టిన ఆంజ‌నేయ స్వామి చిత్ర‌ప‌టాన్ని పూజిస్తే దాంతో భ‌క్తుల‌కు అంద‌రి దేవ‌తల ఆశీస్సులు క‌లుగుతాయి. అంద‌రు దేవ‌త‌లు శుభ దృష్టితో చూస్తారు. అంతా మంచే జ‌రుగుతుంది.

Comments

comments

Share this post

scroll to top