అత్యంత చిన్న‌దైన టూత్ పిక్‌పై క‌ళాఖండం మ‌లిచినందుకు అత‌నికి గిన్నిస్‌లో స్థానం ద‌క్కింది తెలుసా..?

మైక్రో ఆర్ట్‌.. దీన్నే సూక్ష్మ క‌ళ అంటారు. ఇలాంటి క‌ళను ప్ర‌దర్శించే ఆర్టిస్టుల‌ను మైక్రో ఆర్టిస్టులు అంటారు. చాలా సూక్ష్మ‌మైన వ‌స్తువుల‌పై క‌ళాఖండాల‌ను చెక్క‌డ‌మే వీరి ప్ర‌త్యేక‌త‌. అయితే నిజంగా అలాంటి క‌ళాకృతుల‌ను మ‌ల‌చాలంటే అందుకు చాలా ప్ర‌తిభ అవ‌స‌రం. అంత సామాన్యంగా ఇది ఎవ‌రూ చేయ‌లేరు. ఎంతో ఓర్పు, స‌హ‌నం కూడా ఇందుకు కావాలి. అప్పుడే అద్భుత‌మైన క‌ళాఖండాల‌ను తీర్చిదిద్ద‌గ‌ల‌రు. అదిగో… ఇప్పుడు మేం చెప్ప‌బోయే ఆ క‌ళాకారుడు కూడా అదే కోవ‌కు చెందుతాడు. అత‌ను తీర్చిదిద్దుతున్న సూక్ష్మ క‌ళాకృతులు చూప‌రుల‌ను కట్టి ప‌డేయ‌డ‌మే కాదు, అత‌నికి గిన్నిస్ రికార్డును కూడా తెచ్చి పెట్టాయి. ఇంత‌కీ అత‌ను ఎవ‌రంటే…

అత‌ని పేరు గ‌ట్టెం వెంక‌టేష్‌. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం విశాఖ‌ప‌ట్నం వాసి. అక్క‌డే గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చ‌ర్‌లో చ‌దువుతున్నాడు. అయితే వెంక‌టేష్‌కు చిన్న‌ప్ప‌టి నుంచి క‌ళ‌లంటే ప్రాణం. అందులోనూ సూక్ష్మ క‌ళ ఇంటే ఎంతో ఇష్టం. ఈ క్ర‌మంలోనే ఎవ‌రూ చెప్ప‌కుండానే అత‌ను త‌న‌కు తానుగా సొంతంగా సూక్ష్మ క‌ళ నేర్చుకున్నాడు. దీంతో చిన్న చిన్న వ‌స్తువులపై క‌ళాకృతులను మ‌ల‌చ‌డం అభ్య‌సించాడు. అలా అత‌ను ఎన్నో సంవ‌త్స‌రాల నుంచి త‌న‌లో ఉన్న సూక్ష్మ క‌ళ‌కు మెరుగులు దిద్దుకుంటూ వ‌చ్చాడు. ఈ క్ర‌మంలోనే ఎన్నో సూక్ష్మ క‌ళాకృతుల‌ను కూడా అత‌ను తీర్చిదిద్దాడు.

అయితే న్యూయార్క్ సిటీలో ఉన్న ది ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ భ‌వంతిని వెంక‌టేష్ సూక్ష్మ క‌ళాకృతిలో తీర్చిదిద్దాల‌నుకున్నాడు. అనుకున్న‌దే త‌డ‌వుగా ప‌ని ప్రారంభించాడు. అయితే అందుకు అత‌ను ఎంచుకున్న వ‌స్తువు ఏదో తెలుసా..? టూత్ పిక్‌. దాన్ని ఉప‌యోగించే అత్యంత సూక్ష్మ ఆకృతిలో ఆ భ‌వంతి మోడ‌ల్‌ను తీర్చిదిద్దాడు. అందుకు అత‌ను 6 ఏళ్ల పాటు క‌ష్ట‌ప‌డ్డాడు. ఎట్ట‌కేల‌కు దాన్ని మ‌లిచాడు కూడా. ఈ క్ర‌మంలోనే 18 మిల్లీమీట‌ర్ల పొడ‌వైన అత్యంత సూక్ష్మ‌మైన ఆకృతిలో ది ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ భ‌వంతిని మ‌లిచాడు. అయితే అందుకు గాను వెంక‌టేష్‌కు తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్ కూడా ల‌భించింది. ఆ క‌ళాకృతికి గిన్నిస్ రికార్డులో స్థానం దక్కింది. ఈ క్ర‌మంలో గిన్నిస్ వారు వెంక‌టేష్‌కు స‌ర్టిఫికెట్‌ను కూడా ప్రదానం చేశారు. దాన్ని వెంక‌టేష్ సోష‌ల్ మీడియాలో షేర్ చేసి త‌న ఆనందాన్ని అంద‌రితో పంచుకున్నాడు.

Comments

comments

Share this post

scroll to top